ఈ వ్రతమును బుధవారము, ఏకాదశి, ద్వాదశి, సంక్రమణం, శ్రవణా నక్షత్రం, స్వాతి నక్షత్రం రోజులలో ఆచరించాలి. విశేష ఫలం లభిస్తుంది. ఏ రోజునైనా వ్రతం ఆచరించవచ్చును.
ఈ వ్రతము ప్రభాత కాలంలో చేయాలి. ప్రభాత కాలంలో చేసిన ఏ దైవ కార్యమైనా అత్యంత ఫలమును కూర్చుతుంది.
ఈ వ్రతమును అన్ని కులములవారు ఆచరించవచ్చును.
స్త్రీ పురుష వయో భేదము లేదు.
వ్రతాచరణ రోజు సూర్యోదయానికి ఒక గంట కాలము ముందుగానే నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకుని తలస్నానము చేసి, తెల్లని శుభ్ర - వస్త్రములు ధరించాలి.
నుదుట తిలక ధారణ చేసి, పద్మావతీ అలమేలు మంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామిని మనసున నిలుపుకుని ప్రార్థించి, ఈ వ్రతమును ఆచరించుచున్నానని సంకల్పించుకోవాలి.
ఈ వ్రతాచరణ రోజు మద్య, మత్స్య మాంస ధూమపానములు నిషేధము. బ్రహ్మచర్యము పాటించాలి.
ఈ వ్రతాచరణ రోజుకు ముందురోజు రాత్రి, వ్రతాచరణ రోజు ఉపవశించాలి. రోగులు, ముసలివారు వారి ఆరోగ్య పరిస్థితినిబట్టి పండ్లు, పాలు స్వీకరించవచ్చును.
దృఢమైన విశ్వాసంతో, భక్తితో ఈ వ్రతము నాచరించాలి. కనీసం ఒక సంవత్సరకాలం ఆచరించాలి.
పరులను నిందించుట కూడదు. మౌనము వహించుట మేలు.
ఆవునెయ్యి లేదా నువ్వుల నూనెతో అఖండ దీపారాధన చెయ్యాలి. చలిమిడి, వడపప్పు, పానకం, పండ్లు, పాలు నివేదన చెయ్యాలి.
ఈ వ్రత పుస్తకములు కనీసం తొమ్మిదిమంది స్త్రీలకు లేదా పురుషులకు పంచి పెట్టాలి.
శ్రీ వేంకటేశ్వరస్వామి వ్రతకల్పం
వ్రత నియమాలు