నాలుగు యుగాలు
హిందూ సంప్రదాయాన్ననుసరించి కొన్ని సంవత్సరాలు కలిపి ఒక యుగముగా కాలమానము లెక్కింపబడింది. అలా నాలుగు యుగాలు నిర్ణయించారు.
యుగాలు, మహా యుగము :
దేవతల కాల ప్రమాణము మన (మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మనకు ఒక సంవత్సర కాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు +రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. అటువంటి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము) 1. ఇది మనకు ఒక చతుర్యుగకాలానికి సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అవుతుంది.
కృత యుగము : = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములుత్రేతా యుగము : = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు
ద్వాపర యుగము : = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు© 2017,www.logili.com All Rights Reserved.