కొమర్రాజు లక్ష్మణరావు సాహితీ జీవితం
"శ్రీ వీరేశలింగం, సాహిత్యంలో అనేక నూతన ప్రక్రియలకు ప్రవర్తకులయినప్పటికిని, ఆధునిక దృష్టితో చరిత్ర రచన, పరిశోధన, శాస్త్రీయ విజ్ఞాన ప్రచారం మొదలయిన వాటిని ఉద్యమం వలె, సాగించిన వారు శ్రీ లక్ష్మణరావు. సాహిత్యంలోను, సంఘ సంస్కరణలోను, జాతీయతా దృక్పథం లక్ష్మణరావుతోనే, తెలుగుదేశంలో ప్రారంభమయిందనవచ్చు. వీరేశలింగంది విమర్శన దృక్పథమైతే, లక్ష్మణరావుది విశ్లేషణ దృక్పథం. ఆయన శిథిలమవుతున్న వ్యవస్థను పడగొట్టాడు. ఈయన దాన్ని సంస్కరించి పునర్నిర్మాణానికి నడుం కట్టారు”.
- తిరుమల రామచంద్ర
పరిశోధకుడుగా, విమర్శకుడుగా, భాషావేత్తగా, సాహితీవేత్తగా, చరిత్ర గ్రంథాల రచయితగా, చరిత్ర పరిశోధకుడుగా, శాసనాల పరిశోధకుడుగా, గ్రంథ పరిష, పీఠికా రచయితగా, ఉపన్యాసకుడుగా, ప్రచురణ కర్తగా, సాహిత్య ప్రచారకుడుగా, సాహిత్య పోషకుడుగా, తెలుగు సంస్కృతి పరిరక్షకుడుగా, పరిపాలనాదక్షుడుగా, సంపాదకుడుగా, పండితుడుగా, పాఠ్య గ్రంథ రచయితగా, అధ్యాపకుడుగా, మేధావిగా, విజ్ఞాననిధిగా, రచయితగా, వ్యాసకర్తగా, అనువాదకుడుగా, అనేక సంస్థల వ్యవస్థాపకుడుగా, విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి స్థాపకుడుగా, గ్రంథాలయోద్యమ నిర్వాహకుడుగా, అనేక గ్రంథాలయాల స్థాపకుడుగా, జాతీయవాదిగా, సమైక్యవాదిగా, దేశభక్తుడుగా, దళితుల విద్యకోసం నిరంతరం పరితపించినవాడుగా ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా, ఆదర్శమూర్తిగా, సహృదయుడుగా, సౌజన్యమూర్తిగా, బహుభాషా కోవిదులుగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, తెలుగుజాతి వైతాళికుడుగా, తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ రూపశిల్పిగా... ఇలా ఎనలేని కీర్తి గడించిన గొప్ప సాహితీ సంపన్నులు, కొమర్రాజు వేంకట లక్ష్మణరావుగారు. (18-5-1876 – 13-07-1923). కందుకూరి వారసుడు కొమర్రాజు.
తెలుగువారి భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, పరిశోధన వికాసానికి తన జీవితం తుది క్షణం వరకు కృషి చేసిన మహనీయులు కొమర్రాజు. తెలుగు సాంస్కృతిక పునరుజ్జీవనంలో కొమర్రాజు పాత్ర చెప్పుకోదగ్గది. ప్రతీ తెలుగువారి......................
కొమర్రాజు లక్ష్మణరావు సాహితీ జీవితం "శ్రీ వీరేశలింగం, సాహిత్యంలో అనేక నూతన ప్రక్రియలకు ప్రవర్తకులయినప్పటికిని, ఆధునిక దృష్టితో చరిత్ర రచన, పరిశోధన, శాస్త్రీయ విజ్ఞాన ప్రచారం మొదలయిన వాటిని ఉద్యమం వలె, సాగించిన వారు శ్రీ లక్ష్మణరావు. సాహిత్యంలోను, సంఘ సంస్కరణలోను, జాతీయతా దృక్పథం లక్ష్మణరావుతోనే, తెలుగుదేశంలో ప్రారంభమయిందనవచ్చు. వీరేశలింగంది విమర్శన దృక్పథమైతే, లక్ష్మణరావుది విశ్లేషణ దృక్పథం. ఆయన శిథిలమవుతున్న వ్యవస్థను పడగొట్టాడు. ఈయన దాన్ని సంస్కరించి పునర్నిర్మాణానికి నడుం కట్టారు”. - తిరుమల రామచంద్ర పరిశోధకుడుగా, విమర్శకుడుగా, భాషావేత్తగా, సాహితీవేత్తగా, చరిత్ర గ్రంథాల రచయితగా, చరిత్ర పరిశోధకుడుగా, శాసనాల పరిశోధకుడుగా, గ్రంథ పరిష, పీఠికా రచయితగా, ఉపన్యాసకుడుగా, ప్రచురణ కర్తగా, సాహిత్య ప్రచారకుడుగా, సాహిత్య పోషకుడుగా, తెలుగు సంస్కృతి పరిరక్షకుడుగా, పరిపాలనాదక్షుడుగా, సంపాదకుడుగా, పండితుడుగా, పాఠ్య గ్రంథ రచయితగా, అధ్యాపకుడుగా, మేధావిగా, విజ్ఞాననిధిగా, రచయితగా, వ్యాసకర్తగా, అనువాదకుడుగా, అనేక సంస్థల వ్యవస్థాపకుడుగా, విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి స్థాపకుడుగా, గ్రంథాలయోద్యమ నిర్వాహకుడుగా, అనేక గ్రంథాలయాల స్థాపకుడుగా, జాతీయవాదిగా, సమైక్యవాదిగా, దేశభక్తుడుగా, దళితుల విద్యకోసం నిరంతరం పరితపించినవాడుగా ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా, ఆదర్శమూర్తిగా, సహృదయుడుగా, సౌజన్యమూర్తిగా, బహుభాషా కోవిదులుగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, తెలుగుజాతి వైతాళికుడుగా, తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ రూపశిల్పిగా... ఇలా ఎనలేని కీర్తి గడించిన గొప్ప సాహితీ సంపన్నులు, కొమర్రాజు వేంకట లక్ష్మణరావుగారు. (18-5-1876 – 13-07-1923). కందుకూరి వారసుడు కొమర్రాజు. తెలుగువారి భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, పరిశోధన వికాసానికి తన జీవితం తుది క్షణం వరకు కృషి చేసిన మహనీయులు కొమర్రాజు. తెలుగు సాంస్కృతిక పునరుజ్జీవనంలో కొమర్రాజు పాత్ర చెప్పుకోదగ్గది. ప్రతీ తెలుగువారి......................© 2017,www.logili.com All Rights Reserved.