ఆదివారం మధ్యాహ్నం...
చింతపిక్కరంగు నిక్కరు, నీలి గళ్ళ తెల్లచొక్కా వేసుకున్న అబ్బాయి.. వరండాలో గోడవారగా మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టుక్కూర్చుని పరధ్యానంగా ఆలోచిస్తున్నాడు.
ఉదయాన్నే బావిదగ్గర కూచుని కుంకుడు పులుసుతో తల బరబరా రుద్దేసుకున్నాడేమో.. జుట్టు మెత్తని అలలుగా నుదుటి మీద పడుతోంది.
పెద్దచప్పుడుతో డేగిశా ఈడ్చిన శబ్దం వినిపించి నిద్దర్లో ఉలిక్కిపడ్డట్టు కదిలి, మళ్ళీ తన ఆలోచనల్లో తాను పడిపోయాడు.
వెనక పెరట్లో ఇందాకా ఎప్పట్నుంచో ఆవు పెయ్య చుట్టూ తిరుగుతూ ఆడుతూ చెల్లెలు చెప్తున్న కబుర్లు వినిపిస్తున్నాయి. పెయ్య మెడలో గలగల్లాడుతున్న మువ్వ సవ్వడి..
ఎదురుగా వెల్ల ఊడిపోతున్న గోడమీద తాపీగా పాకుతున్న చీమల బారుని గమనిస్తూ, అల్లిబిల్లిగా సాగిపోతున్న ఆలోచనల్లో మళ్ళీ మళ్ళీ మునకలేస్తూ.. తండ్రి కొట్టిన దెబ్బలని ఆ పిల్లాడు నెమరేసుకుంటున్నాడు..........................
ఆదివారం మధ్యాహ్నం... చింతపిక్కరంగు నిక్కరు, నీలి గళ్ళ తెల్లచొక్కా వేసుకున్న అబ్బాయి.. వరండాలో గోడవారగా మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టుక్కూర్చుని పరధ్యానంగా ఆలోచిస్తున్నాడు. ఉదయాన్నే బావిదగ్గర కూచుని కుంకుడు పులుసుతో తల బరబరా రుద్దేసుకున్నాడేమో.. జుట్టు మెత్తని అలలుగా నుదుటి మీద పడుతోంది. పెద్దచప్పుడుతో డేగిశా ఈడ్చిన శబ్దం వినిపించి నిద్దర్లో ఉలిక్కిపడ్డట్టు కదిలి, మళ్ళీ తన ఆలోచనల్లో తాను పడిపోయాడు. వెనక పెరట్లో ఇందాకా ఎప్పట్నుంచో ఆవు పెయ్య చుట్టూ తిరుగుతూ ఆడుతూ చెల్లెలు చెప్తున్న కబుర్లు వినిపిస్తున్నాయి. పెయ్య మెడలో గలగల్లాడుతున్న మువ్వ సవ్వడి.. ఎదురుగా వెల్ల ఊడిపోతున్న గోడమీద తాపీగా పాకుతున్న చీమల బారుని గమనిస్తూ, అల్లిబిల్లిగా సాగిపోతున్న ఆలోచనల్లో మళ్ళీ మళ్ళీ మునకలేస్తూ.. తండ్రి కొట్టిన దెబ్బలని ఆ పిల్లాడు నెమరేసుకుంటున్నాడు..........................© 2017,www.logili.com All Rights Reserved.