నంగనాచి కుటుంబం
ఒక రాజ్యంలో పెద్ద, చిన్న అనే దొంగలిద్దరుండేవారు. వారిద్దరూ తండ్రీ కొడుకులు. తెలివితేటల్లో వారిద్దరూ ఒకరికి మించిన వారొకరని ప్రతీతి. చిన్న పెద్దవాడయ్యేవరకూ ఇద్దరూ కలిసే ఎన్నో దొంగతనాలు చేసి ధనికులకు సింహ స్వప్నంగా ఉండేవారు.
పెద్దకు భార్యా, చిన్నకు తల్లీ అయిన నంగనాచి కూడా దొంగతనాల్లో ఆరితేరినదే! అసలు పెద్దకూ, నంగనాచికీ పరిచయమే తమాషాగా అయ్యింది.
పెద్ద ఒకరోజున ఓ గొప్ప నగల దుకాణంలోకి వెళ్లాడు. అక్కడ ముత్యాల హారాలు, రత్నాల హారాలు ఎంతో విలువైనవి ఉన్నాయి. ఏమేమి ఎక్కడెక్కడున్నాయో చూసుకుని రాత్రికి ఆ దుకాణానికి కన్నం వేయాలని పెద్ద ఉద్దేశ్యం. అప్పుడతడికి అక్కడ రత్నాల హారాలు బేరమాడుతూ కనబడింది నంగనాచి.
వేషం చూసి ఆమె చాలా గొప్పింటిదయ్యుండాలని పెద్ద అనుకున్నాడు. ఆమెనెలాగో మోసంచేసి దగ్గరున్న నగలు కొట్టేస్తే తన పని సులభమైపోతుందను కున్నాడు. ఆడవాళ్లను మోసం చేయడం సులభం. శ్రమ తక్కువ. ఈ ఉద్దేశ్యంతో అతడు నంగనాచి పక్కనే చేరాడు.
నంగనాచి ఒక్కొక్క నగే చూసి పెదవి విరుస్తోంది. ఒక్కటీ ఆమెకు నచ్చినట్లు లేదు.
పెద్దకు ఆమెవద్ద ఎంత డబ్బున్నదో తెలియదు. అది తెలుసుకోవడం కోసం బాగా ఖరీదైన రత్నాల హారాన్ని ఆమె చూస్తూండగా, "ఇది తమరి కంఠానికి ఎంతో వన్నె తెస్తుంది” అన్నాడు........................
నంగనాచి కుటుంబం ఒక రాజ్యంలో పెద్ద, చిన్న అనే దొంగలిద్దరుండేవారు. వారిద్దరూ తండ్రీ కొడుకులు. తెలివితేటల్లో వారిద్దరూ ఒకరికి మించిన వారొకరని ప్రతీతి. చిన్న పెద్దవాడయ్యేవరకూ ఇద్దరూ కలిసే ఎన్నో దొంగతనాలు చేసి ధనికులకు సింహ స్వప్నంగా ఉండేవారు. పెద్దకు భార్యా, చిన్నకు తల్లీ అయిన నంగనాచి కూడా దొంగతనాల్లో ఆరితేరినదే! అసలు పెద్దకూ, నంగనాచికీ పరిచయమే తమాషాగా అయ్యింది. పెద్ద ఒకరోజున ఓ గొప్ప నగల దుకాణంలోకి వెళ్లాడు. అక్కడ ముత్యాల హారాలు, రత్నాల హారాలు ఎంతో విలువైనవి ఉన్నాయి. ఏమేమి ఎక్కడెక్కడున్నాయో చూసుకుని రాత్రికి ఆ దుకాణానికి కన్నం వేయాలని పెద్ద ఉద్దేశ్యం. అప్పుడతడికి అక్కడ రత్నాల హారాలు బేరమాడుతూ కనబడింది నంగనాచి. వేషం చూసి ఆమె చాలా గొప్పింటిదయ్యుండాలని పెద్ద అనుకున్నాడు. ఆమెనెలాగో మోసంచేసి దగ్గరున్న నగలు కొట్టేస్తే తన పని సులభమైపోతుందను కున్నాడు. ఆడవాళ్లను మోసం చేయడం సులభం. శ్రమ తక్కువ. ఈ ఉద్దేశ్యంతో అతడు నంగనాచి పక్కనే చేరాడు. నంగనాచి ఒక్కొక్క నగే చూసి పెదవి విరుస్తోంది. ఒక్కటీ ఆమెకు నచ్చినట్లు లేదు. పెద్దకు ఆమెవద్ద ఎంత డబ్బున్నదో తెలియదు. అది తెలుసుకోవడం కోసం బాగా ఖరీదైన రత్నాల హారాన్ని ఆమె చూస్తూండగా, "ఇది తమరి కంఠానికి ఎంతో వన్నె తెస్తుంది” అన్నాడు........................© 2017,www.logili.com All Rights Reserved.