జీవన రేఖలు
"కరువుల కడుపున పుట్టిన - పరమ దరిద్రుణ్ణి నేను
తాగేందుకు మంచినీళ్ళు - దొరకని ప్రాంతాల వాణ్ణి
సుజలా! అనలేను నిన్ను - సుఫలా! అనబోను నిన్ను
శుభ్రజ్యోత్స్నా పులకిత - సుందర యామినుల హొయలు
తిలకించేదెట్ల గాఢ - తిమిరం నా బ్రతుకంతా”
(వందేమాతరం కవిత-చంద్రహాసం : పు56)
గజ్జెల మల్లారెడ్డి తెలుగులో రెండవతరం అభ్యుదయ కవి. శ్రీశ్రీ తర్వాత తెలుగు గేయానికి గజ్జెకట్టి ఆడించిన కవి. శ్రీశ్రీ చేత తన వారసుడనిపించుకున్న కవి. అధిక్షేపానికి, ఆవేశానికి, వ్యంగ్యానికి పెట్టింది పేరయ్యారు. 20వ శతాబ్దిలో ముప్పాతిక భాగం పరుచుకున్న మల్లారెడ్డి జీవితం బహుముఖీనమైనది. ఆయన కవి, కమ్యూనిస్టు, రాజకీయవాది, పత్రికా సంపాదకుడు, అనువాదకుడు. జీవిత చరమాంకంలో ఆధ్యాత్మికవాది.
బాల్యం :
గజ్జెల మల్లారెడ్డి ఎప్పుడు పుట్టారో తెలియదు. మల్లారెడ్డి తన తల్లిని ఒకసారి అడిగితే, ఆమె తనకు తెలిసిన కొండగుర్తులు కొన్ని చెబితే, మల్లారెడ్డి ఆమె చెప్పిన ఆనవాళ్ళు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరిగి, రికార్డులు పరిశీలించి 1925 తాను పుట్టిన సంవత్సరంగా గుర్తించారు. రాయలసీమలో కడప జిల్లాలోని అంకాళమ్మ గూడూరు ఆయన స్వగ్రామం. అంకాళమ్మ ఆ ఊరి గ్రామదేవత. ఆమె పేరుమీదనే ఆ ఊరు వెలిసింది. మల్లారెడ్డి నాగమ్మ, సోమిరెడ్డి దంపతుల కుమారుడు. మూడవ సంతానం. ఆయనకు ఇద్దరు అక్కలు. సోమక్క, పార్వతమ్మ. కడప జిల్లాలో తండ్రికి తండ్రిని అబ్బ అంటారు.............................
జీవన రేఖలు "కరువుల కడుపున పుట్టిన - పరమ దరిద్రుణ్ణి నేను తాగేందుకు మంచినీళ్ళు - దొరకని ప్రాంతాల వాణ్ణి సుజలా! అనలేను నిన్ను - సుఫలా! అనబోను నిన్ను శుభ్రజ్యోత్స్నా పులకిత - సుందర యామినుల హొయలు తిలకించేదెట్ల గాఢ - తిమిరం నా బ్రతుకంతా” (వందేమాతరం కవిత-చంద్రహాసం : పు56) గజ్జెల మల్లారెడ్డి తెలుగులో రెండవతరం అభ్యుదయ కవి. శ్రీశ్రీ తర్వాత తెలుగు గేయానికి గజ్జెకట్టి ఆడించిన కవి. శ్రీశ్రీ చేత తన వారసుడనిపించుకున్న కవి. అధిక్షేపానికి, ఆవేశానికి, వ్యంగ్యానికి పెట్టింది పేరయ్యారు. 20వ శతాబ్దిలో ముప్పాతిక భాగం పరుచుకున్న మల్లారెడ్డి జీవితం బహుముఖీనమైనది. ఆయన కవి, కమ్యూనిస్టు, రాజకీయవాది, పత్రికా సంపాదకుడు, అనువాదకుడు. జీవిత చరమాంకంలో ఆధ్యాత్మికవాది. బాల్యం : గజ్జెల మల్లారెడ్డి ఎప్పుడు పుట్టారో తెలియదు. మల్లారెడ్డి తన తల్లిని ఒకసారి అడిగితే, ఆమె తనకు తెలిసిన కొండగుర్తులు కొన్ని చెబితే, మల్లారెడ్డి ఆమె చెప్పిన ఆనవాళ్ళు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరిగి, రికార్డులు పరిశీలించి 1925 తాను పుట్టిన సంవత్సరంగా గుర్తించారు. రాయలసీమలో కడప జిల్లాలోని అంకాళమ్మ గూడూరు ఆయన స్వగ్రామం. అంకాళమ్మ ఆ ఊరి గ్రామదేవత. ఆమె పేరుమీదనే ఆ ఊరు వెలిసింది. మల్లారెడ్డి నాగమ్మ, సోమిరెడ్డి దంపతుల కుమారుడు. మూడవ సంతానం. ఆయనకు ఇద్దరు అక్కలు. సోమక్క, పార్వతమ్మ. కడప జిల్లాలో తండ్రికి తండ్రిని అబ్బ అంటారు.............................© 2017,www.logili.com All Rights Reserved.