సచి రౌత్రాయ్ గారితో ఇంటర్వ్యూ
చెట్టుకవి ఇస్మాయిల్, చెవిలో పువ్వు విశ్వనాథ పావని శాస్త్రి, పురాణం, నందివాడ భీమారావు, విశ్వనాథంగారలు భువనేశ్వర్ నుంచి కారులో బయల్దేరి కటక్ వెళ్లి సమాజ్ పత్రికాధిపతి 'రథో'గారిని చూసి వారి ఆతిథ్యం స్వీకరించి, తరువాత జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత కథారచయిత పద్మశ్రీ సచ్చిదానంద రౌత్రాయ్ గారిని కటక్లో కలిసి వారితో ఇష్టాగోష్ఠి జరిపారు. అదే ఇక్కడ ప్రచురిస్తున్నాము.
ప్రశ్న: నమస్కారం! మీ వయస్సెంత యిప్పుడు? మీ జన్మస్థలం ఏది? జవాబు: నా వయస్సు 72 సంవత్సరాలు. ఒరిస్సా రాష్ట్రంలోని ఖుర్దాలో జన్మించాను.
ప్రశ్న: మీరు ప్రసిద్ధ మార్క్సిస్టువాది కదా! జైలు అనుభవాలు ఉన్నాయా తమకు?
జవాబు: మార్క్సిస్టువాదినే కాదు, స్వాతంత్ర్య సమర పోరాటాల్లో కూడా పాల్గొన్నాను. రైతాంగ పోరాటాల్లో కూడా పాల్గొన్నాను. జీవితంలో రెండుసార్లు జైలు కెళ్ళాను. 1939-42 ప్రాంతాలలో ఆనాటి ప్రభుత్వం వారిచే కవితలు నిషేధింపబడ్డాయి కూడాను.
ప్రశ్న: మీ విద్యాభ్యాసం ఎక్కడ, ఎంత వరకు సాగింది?
జవాబు: 1937 వరకు కలకత్తాలోనే ఉన్నాను. నా విద్యాభ్యాసం అంతా అక్కడే! 1939లో నా బి.ఏ. పరీక్ష పూర్తి అయింది. 1937కే ఒరిస్సా వచ్చేశాను. ప్రశ్న: ఉద్యోగాలేవైనా చేశారా?
జవాబు: కేశోరామ్ కాటన్ మిల్స్లో లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్గానూ, ఎగ్జిక్యూ టివ్ ఆఫీసర్గానూ పనిచేశాను. 1962లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాను. ప్రశ్న: రాజీనామా చేయడానికి ప్రత్యేకమైన కారణాలేవైనా ఉన్నాయా? జవాబు: లేవు.
ప్రశ్న: మీకు 1962లో "పద్మశ్రీ" బిరుదు ప్రదానం జరిగిందని విన్నాము... ఇతర సన్మానాలెప్పుడెప్పుడైనాయో దయచేసి తెలియజేయవలసిందని ప్రార్ధన........................
సచి రౌత్రాయ్ గారితో ఇంటర్వ్యూ చెట్టుకవి ఇస్మాయిల్, చెవిలో పువ్వు విశ్వనాథ పావని శాస్త్రి, పురాణం, నందివాడ భీమారావు, విశ్వనాథంగారలు భువనేశ్వర్ నుంచి కారులో బయల్దేరి కటక్ వెళ్లి సమాజ్ పత్రికాధిపతి 'రథో'గారిని చూసి వారి ఆతిథ్యం స్వీకరించి, తరువాత జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత కథారచయిత పద్మశ్రీ సచ్చిదానంద రౌత్రాయ్ గారిని కటక్లో కలిసి వారితో ఇష్టాగోష్ఠి జరిపారు. అదే ఇక్కడ ప్రచురిస్తున్నాము. ప్రశ్న: నమస్కారం! మీ వయస్సెంత యిప్పుడు? మీ జన్మస్థలం ఏది? జవాబు: నా వయస్సు 72 సంవత్సరాలు. ఒరిస్సా రాష్ట్రంలోని ఖుర్దాలో జన్మించాను. ప్రశ్న: మీరు ప్రసిద్ధ మార్క్సిస్టువాది కదా! జైలు అనుభవాలు ఉన్నాయా తమకు? జవాబు: మార్క్సిస్టువాదినే కాదు, స్వాతంత్ర్య సమర పోరాటాల్లో కూడా పాల్గొన్నాను. రైతాంగ పోరాటాల్లో కూడా పాల్గొన్నాను. జీవితంలో రెండుసార్లు జైలు కెళ్ళాను. 1939-42 ప్రాంతాలలో ఆనాటి ప్రభుత్వం వారిచే కవితలు నిషేధింపబడ్డాయి కూడాను. ప్రశ్న: మీ విద్యాభ్యాసం ఎక్కడ, ఎంత వరకు సాగింది? జవాబు: 1937 వరకు కలకత్తాలోనే ఉన్నాను. నా విద్యాభ్యాసం అంతా అక్కడే! 1939లో నా బి.ఏ. పరీక్ష పూర్తి అయింది. 1937కే ఒరిస్సా వచ్చేశాను. ప్రశ్న: ఉద్యోగాలేవైనా చేశారా? జవాబు: కేశోరామ్ కాటన్ మిల్స్లో లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్గానూ, ఎగ్జిక్యూ టివ్ ఆఫీసర్గానూ పనిచేశాను. 1962లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాను. ప్రశ్న: రాజీనామా చేయడానికి ప్రత్యేకమైన కారణాలేవైనా ఉన్నాయా? జవాబు: లేవు. ప్రశ్న: మీకు 1962లో "పద్మశ్రీ" బిరుదు ప్రదానం జరిగిందని విన్నాము... ఇతర సన్మానాలెప్పుడెప్పుడైనాయో దయచేసి తెలియజేయవలసిందని ప్రార్ధన........................© 2017,www.logili.com All Rights Reserved.