కలల కన్నయ్య
కన్నయ్యకు తల్లి తండ్రీ లేరు. శివపురం గ్రామ ప్రజల దయాధర్మ భిక్షం మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు వాడు.
అయితే కన్నయ్యెప్పుడూ దిగులుగా ఉండడు. ప్రపంచంలోని సంతోషమంతా తనదే ఐనట్లు ఎప్పుడూ నవ్వుతూ వుంటాడు. వాడికి బద్ధకం లేదు. ఎప్పుడూ ఎవరికో ఏదో పని చేస్తూంటాడు. ఎవరినీ దేనికీ విసుక్కోడు. వాడి ఓర్పు అనంతం.
కన్నయ్యంటే ఊళ్లో చాలా మందికి ఇష్టం. ఒక్క గురవయ్యకు తప్ప!
గురవయ్య ఆ ఊరికి పెద్ద షావుకారు. ఊళ్లో గొప్ప గొప్ప వాళ్లు కూడా ఆయన దగ్గర అప్పు తీసుకుంటారు. ఎక్కడా పంటలు పండనప్పుడు కూడా గురవయ్య దగ్గర తిండిగింజలు దొరుకుతాయి. గురవయ్య ఎంత సంపాదిస్తాడో అంత లోభి! పిల్లికి కూడా బిచ్చం వెయ్యడు.
గురవయ్య కూడా కన్నయ్య చేత పనులు చేయించుకుంటాడు. కానీ ప్రతిఫలం ఇవ్వడు. ఆఖరికి గుప్పెడు మెతుకులు కూడా పెట్టడు.
తను కన్నయ్య చేత ఊరికే పని చేయించుకుంటున్నానని గురవయ్యకు తెలుసు. ఆ విషయం ఆయనకు మనసులో బాధించేదేమో, ఒకసారి కన్నయ్యతో ఆయన అన్నాడు.
“ఒరేయ్ కన్నయ్యా! పూర్వజన్మలో ఏ పాపం చేశావోగానీ ఈ జన్మలో అనాధ బ్రతుకు బ్రతుకుతున్నావు. ఈ జన్మలో నీకు ఎవరైనా ఋణపడితే తప్ప వచ్చే జన్మలో నీకు తల్లిదండ్రులుండరు, నీ బాకీ తీర్చుకోవడం కోసం వాళ్లు వచ్చే జన్మలో నిన్ను కొడుకుగా కంటారు. ఈ ఊళ్లో ఒక్కరికీ నీ.....................................
కలల కన్నయ్య కన్నయ్యకు తల్లి తండ్రీ లేరు. శివపురం గ్రామ ప్రజల దయాధర్మ భిక్షం మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు వాడు. అయితే కన్నయ్యెప్పుడూ దిగులుగా ఉండడు. ప్రపంచంలోని సంతోషమంతా తనదే ఐనట్లు ఎప్పుడూ నవ్వుతూ వుంటాడు. వాడికి బద్ధకం లేదు. ఎప్పుడూ ఎవరికో ఏదో పని చేస్తూంటాడు. ఎవరినీ దేనికీ విసుక్కోడు. వాడి ఓర్పు అనంతం. కన్నయ్యంటే ఊళ్లో చాలా మందికి ఇష్టం. ఒక్క గురవయ్యకు తప్ప! గురవయ్య ఆ ఊరికి పెద్ద షావుకారు. ఊళ్లో గొప్ప గొప్ప వాళ్లు కూడా ఆయన దగ్గర అప్పు తీసుకుంటారు. ఎక్కడా పంటలు పండనప్పుడు కూడా గురవయ్య దగ్గర తిండిగింజలు దొరుకుతాయి. గురవయ్య ఎంత సంపాదిస్తాడో అంత లోభి! పిల్లికి కూడా బిచ్చం వెయ్యడు. గురవయ్య కూడా కన్నయ్య చేత పనులు చేయించుకుంటాడు. కానీ ప్రతిఫలం ఇవ్వడు. ఆఖరికి గుప్పెడు మెతుకులు కూడా పెట్టడు. తను కన్నయ్య చేత ఊరికే పని చేయించుకుంటున్నానని గురవయ్యకు తెలుసు. ఆ విషయం ఆయనకు మనసులో బాధించేదేమో, ఒకసారి కన్నయ్యతో ఆయన అన్నాడు. “ఒరేయ్ కన్నయ్యా! పూర్వజన్మలో ఏ పాపం చేశావోగానీ ఈ జన్మలో అనాధ బ్రతుకు బ్రతుకుతున్నావు. ఈ జన్మలో నీకు ఎవరైనా ఋణపడితే తప్ప వచ్చే జన్మలో నీకు తల్లిదండ్రులుండరు, నీ బాకీ తీర్చుకోవడం కోసం వాళ్లు వచ్చే జన్మలో నిన్ను కొడుకుగా కంటారు. ఈ ఊళ్లో ఒక్కరికీ నీ.....................................© 2017,www.logili.com All Rights Reserved.