యమపాశం
ఆనాడు నారాయణరావు ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి ఏడు గంటలయింది.
అతను చీఫ్ సెక్రెటేరియట్ లో గుమస్తా పని చేస్తున్నాడు. అతను అయిదు గంటలకు తన పనిపూర్తి చేసుకొని ఇంటికి బయలుదేరబోతుంటే అతని సెక్షన్ సూపరింటెండెంట్ అర్జంట్ గా ఒక ఫైలు పుటప్చేసి వెళ్ళమని చెప్పటంతో ఆనాడు ఇంటికి రావటం ఆలస్యం అయింది. ఆ ఫైలు త్వరగా పంపవలసివుంది. ఆ ఫైలు త్వరగా పంపమని మంత్రిగారు సెక్రటరీకి ఫోను చెయ్యగా సెక్రటరీ డిప్యూటీ సెక్రటరీకీ, డిప్యూటీ సెక్రటరీ అసిస్టెంట్ సెక్రటరీకీ, అసిస్టెంట్ సెక్రటరీ సూపరిటెండెంట్కి ఫోను చేసి చెప్పారు. నూపరింటెండెంట్ తన సెక్షన్లో పనిచేస్తున్న నారాయణరావుమీదకు వచ్చి పడ్డాడు. ఇక నారాయణరావుకి తప్పేది ఏముంది? 'అయిదు గంటలయింది. నేను వెళ్ళిపోవాలి' అనలేడు గదా! అంటే ఉద్యోగం నిలవదు. ఇన్సబార్డినేషన్ క్రింద ఒక నోటు పైకి వెళ్ళడమూ, అతని కాన్ఫిడెన్షియల్ రిపోర్టులోకి ఎక్కడమూ జరుగుతుంది. అతను కష్టపడి పనిచేస్తే మాత్రం కాన్ఫిడెన్షియల్ రిపోర్టు చెడకుండా వుంటుందనే గ్యారంటీ ఏమున్నదంటారా? అది వేరే విషయం.
ప్రభుత్వ యంత్రాంగం అనేది ఒక పరమపద సోపాన పటం. ఆ పటంలో ఏ గదికి ఆ గదికే ఒక పాము వుంటుంది. ఆ పాము ఎప్పుడు ఎక్కడ కాటువేసినా వెయ్యవచ్చు. ఆ పాముకాటుకు గురి అయిన ఉద్యోగి, కనురెప్ప పాటులో బయలుదేరిన స్థలానికి వచ్చి కూర్చుంటాడు. ఎక్కటం కష్టం. దిగటాని దేముంది? భూమి తగిలే వరకూ జర్రున జారటమే.
ఎప్పుడో ఒకప్పుడు పాము కాటువెయ్యక పోదనీ, జర్రున జారక తప్పదనీ అనుకొని ఎక్కటం మానుకోడు గదా మానవుడు. అందుకని, అంటే ఎక్కగలందులకు కష్టపడి పనిచేస్తాడు. పై అధికారి, 'నీకు బుద్ధిలేదు' అంటే, 'యస్, సర్' అంటారు. అంతకీ కోపం వస్తే ఆ కోపం పైకి కనపడనివ్వకుండా పెదవులు బిగబట్టి 'నాకే కాదండీ, చాలా మందికి లేదండీ' అంటాడు. అలా కష్టపడి పనిచేస్తూ 'యస్. సర్' అంటూ అప్పుడప్పుడూ 'బుద్ధి నాకే కాదండీ, చాలామందికి లేదండీ' అంటూ తిరిగే వాళ్ళల్లో నారాయణరావు ఒకడు.
నారాయణరావు కూడా ఎక్కాలనే అభిలాష కలవాడవడటం వల్ల సూపరింటెండెంట్ చెప్పగానే 'యస్, సర్' అని ఇంటికి వెళ్ళటానికి గాను తగిలించుకొన్న కోటును తీసి, మళ్ళీ కుర్చీకి తగిలించి కూర్చుని ఫైలు తీశాడు. ఆ ఫైలు క్షుణ్ణంగా చదివి, అందులో వున్న విషయాలను క్రోడీకరించి ఒక నోట్ వ్రాసి, సూపరింటెండెంట్కి ఫుటప్ చేశాడు......................
యమపాశం ఆనాడు నారాయణరావు ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి ఏడు గంటలయింది. అతను చీఫ్ సెక్రెటేరియట్ లో గుమస్తా పని చేస్తున్నాడు. అతను అయిదు గంటలకు తన పనిపూర్తి చేసుకొని ఇంటికి బయలుదేరబోతుంటే అతని సెక్షన్ సూపరింటెండెంట్ అర్జంట్ గా ఒక ఫైలు పుటప్చేసి వెళ్ళమని చెప్పటంతో ఆనాడు ఇంటికి రావటం ఆలస్యం అయింది. ఆ ఫైలు త్వరగా పంపవలసివుంది. ఆ ఫైలు త్వరగా పంపమని మంత్రిగారు సెక్రటరీకి ఫోను చెయ్యగా సెక్రటరీ డిప్యూటీ సెక్రటరీకీ, డిప్యూటీ సెక్రటరీ అసిస్టెంట్ సెక్రటరీకీ, అసిస్టెంట్ సెక్రటరీ సూపరిటెండెంట్కి ఫోను చేసి చెప్పారు. నూపరింటెండెంట్ తన సెక్షన్లో పనిచేస్తున్న నారాయణరావుమీదకు వచ్చి పడ్డాడు. ఇక నారాయణరావుకి తప్పేది ఏముంది? 'అయిదు గంటలయింది. నేను వెళ్ళిపోవాలి' అనలేడు గదా! అంటే ఉద్యోగం నిలవదు. ఇన్సబార్డినేషన్ క్రింద ఒక నోటు పైకి వెళ్ళడమూ, అతని కాన్ఫిడెన్షియల్ రిపోర్టులోకి ఎక్కడమూ జరుగుతుంది. అతను కష్టపడి పనిచేస్తే మాత్రం కాన్ఫిడెన్షియల్ రిపోర్టు చెడకుండా వుంటుందనే గ్యారంటీ ఏమున్నదంటారా? అది వేరే విషయం. ప్రభుత్వ యంత్రాంగం అనేది ఒక పరమపద సోపాన పటం. ఆ పటంలో ఏ గదికి ఆ గదికే ఒక పాము వుంటుంది. ఆ పాము ఎప్పుడు ఎక్కడ కాటువేసినా వెయ్యవచ్చు. ఆ పాముకాటుకు గురి అయిన ఉద్యోగి, కనురెప్ప పాటులో బయలుదేరిన స్థలానికి వచ్చి కూర్చుంటాడు. ఎక్కటం కష్టం. దిగటాని దేముంది? భూమి తగిలే వరకూ జర్రున జారటమే. ఎప్పుడో ఒకప్పుడు పాము కాటువెయ్యక పోదనీ, జర్రున జారక తప్పదనీ అనుకొని ఎక్కటం మానుకోడు గదా మానవుడు. అందుకని, అంటే ఎక్కగలందులకు కష్టపడి పనిచేస్తాడు. పై అధికారి, 'నీకు బుద్ధిలేదు' అంటే, 'యస్, సర్' అంటారు. అంతకీ కోపం వస్తే ఆ కోపం పైకి కనపడనివ్వకుండా పెదవులు బిగబట్టి 'నాకే కాదండీ, చాలా మందికి లేదండీ' అంటాడు. అలా కష్టపడి పనిచేస్తూ 'యస్. సర్' అంటూ అప్పుడప్పుడూ 'బుద్ధి నాకే కాదండీ, చాలామందికి లేదండీ' అంటూ తిరిగే వాళ్ళల్లో నారాయణరావు ఒకడు. నారాయణరావు కూడా ఎక్కాలనే అభిలాష కలవాడవడటం వల్ల సూపరింటెండెంట్ చెప్పగానే 'యస్, సర్' అని ఇంటికి వెళ్ళటానికి గాను తగిలించుకొన్న కోటును తీసి, మళ్ళీ కుర్చీకి తగిలించి కూర్చుని ఫైలు తీశాడు. ఆ ఫైలు క్షుణ్ణంగా చదివి, అందులో వున్న విషయాలను క్రోడీకరించి ఒక నోట్ వ్రాసి, సూపరింటెండెంట్కి ఫుటప్ చేశాడు......................© 2017,www.logili.com All Rights Reserved.