నెమళ్ళు
బెంగళూరులో ఇల్లు కట్టించాను. ఫోన్ పెట్టించాను. పిల్లలిద్దరినీ మంచి స్కూల్లో చేర్పించాను. వీటన్నిటి వల్ల ఇరుకున పడ్డ నేను కోపం వచ్చినప్పుడల్లా 'పోవయ్యా' అని ఉద్యోగానికి రాజీనామా పారేసిన నాన్నలా బతకలేను. నేను ఉద్యోగంలో చేరేవరకూ అమ్మ ఓ పట్టుచీర ముఖం కూడా చూడలేదు. మేము అర్ధాకలితో పెరగడానికి, పెద్దవాళ్ళమయ్యేటప్పటికీ, మా దృష్టిలో నాన్న గౌరవం పోగొట్టుకోవడానికి ఆయన స్వేచ్ఛాప్రియత్వం, మొండితనాలే చాలా ముఖ్యమైన కారణాలు అని చెప్పొచ్చు.
చూడటానికి నాన్నలా ఉన్నా నా స్వభావమే వేరు. అయినా భార్యతో గొడవపడ్డానికి ముందు నాన్న అవలక్షణాలను పక్కన బెట్టి కావాలనే ఆయన ఆత్మాభిమానాన్ని పొగిడేవాణ్ణి. అంటే నీ వల్లనే నాలో నాన్న గుణం లేకుండా పోయిందని పరోక్షంగా ఆమెకు అర్థమయ్యేలా చేసేవాడ్ని. పిల్లల కోసం, భార్య కోసం సమస్త సౌకర్యాలనూ సమకూర్చుడానికి చేయవలసిందంతా చేసి, చివరిలో భార్యనే తప్పుబట్టి, నువ్వు ఇష్టపడే ఈ సామాజిక ప్రతిష్ట చెత్తతో సమానమని అట్టహాసంతో కేకలు వేసి, నా అహాన్ని తృప్తి పరుచుకునేవాడిని.
అయితే నేనెంతటి బలహీనుణ్ణి అంటే భార్యకు నన్నిలా తయారు చేయడానికి....................
నెమళ్ళు బెంగళూరులో ఇల్లు కట్టించాను. ఫోన్ పెట్టించాను. పిల్లలిద్దరినీ మంచి స్కూల్లో చేర్పించాను. వీటన్నిటి వల్ల ఇరుకున పడ్డ నేను కోపం వచ్చినప్పుడల్లా 'పోవయ్యా' అని ఉద్యోగానికి రాజీనామా పారేసిన నాన్నలా బతకలేను. నేను ఉద్యోగంలో చేరేవరకూ అమ్మ ఓ పట్టుచీర ముఖం కూడా చూడలేదు. మేము అర్ధాకలితో పెరగడానికి, పెద్దవాళ్ళమయ్యేటప్పటికీ, మా దృష్టిలో నాన్న గౌరవం పోగొట్టుకోవడానికి ఆయన స్వేచ్ఛాప్రియత్వం, మొండితనాలే చాలా ముఖ్యమైన కారణాలు అని చెప్పొచ్చు. చూడటానికి నాన్నలా ఉన్నా నా స్వభావమే వేరు. అయినా భార్యతో గొడవపడ్డానికి ముందు నాన్న అవలక్షణాలను పక్కన బెట్టి కావాలనే ఆయన ఆత్మాభిమానాన్ని పొగిడేవాణ్ణి. అంటే నీ వల్లనే నాలో నాన్న గుణం లేకుండా పోయిందని పరోక్షంగా ఆమెకు అర్థమయ్యేలా చేసేవాడ్ని. పిల్లల కోసం, భార్య కోసం సమస్త సౌకర్యాలనూ సమకూర్చుడానికి చేయవలసిందంతా చేసి, చివరిలో భార్యనే తప్పుబట్టి, నువ్వు ఇష్టపడే ఈ సామాజిక ప్రతిష్ట చెత్తతో సమానమని అట్టహాసంతో కేకలు వేసి, నా అహాన్ని తృప్తి పరుచుకునేవాడిని. అయితే నేనెంతటి బలహీనుణ్ణి అంటే భార్యకు నన్నిలా తయారు చేయడానికి....................© 2017,www.logili.com All Rights Reserved.