అంతరంగం
మర్మభేది
పాణ్యాతలా మాసా ఝాప్ ఘేయీ కైసా ।
జావేఁ త్యాచ్యా వంశా తే కళే ॥
మహారాష్ట్రకు చెందిన గొప్ప సాధువు సంత్ తుకారాం తన అభంగం ద్వారా సమాజానికి ఇది చెప్పడానికి ప్రయత్నించాడు. మనం ఎవరి బాధనైనా అనుభవించే వరకు ఆ బాధను వర్ణించలేమంటాడు తుకారాం. అదే విధంగా నగర జీవితానికి అలవాటు పడిన వారికి అడవులలోని పచ్చదనం, అక్కడ స్వేచ్ఛగా సంచరించే జింకలు, పులులు మొదలైన జంతువులు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అందుకే అడవులలోకి వెళ్లి అక్కడి సహజ సౌందర్యాన్ని సంపూర్ణంగా ఆనందించాలని కోరుకుంటారు. కాని ఇవే అడవుల్లో అనేక సమస్యలతో తినడానికి రొట్టె, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి : ఇల్లు కోసం పరితపిస్తున్న పీడిత మానవాళి వైపు మన దృష్టి ప్రసరించడం చాలా అరుదు. ఈ బాధనే కేంద్రం చేసుకొని సంత్ తుకారాం తన అభంగంలో చేపలను ఉదాహరిస్తూ ఇలా చెప్పాడు: చేప నీళ్లలో ఎలా నిద్రపోతుంది? ఇది తెలియాలంటే మీరు చేపగా జన్మించాలి. అంటే ఏ కష్టమైనా, బాధ అయినా అనుభవించినప్పుడు కాని తెలియదు. నితిన్ గడ్కరీ ఒకసారి తన పాఠశాల నుండి సమాజ సంబంధమైన అధ్యయనంలో భాగంగా విజ్ఞానయాత్రకు వెళ్ళాడు. ఈ అధ్యయనంలో ఆయనకు గడ్చిరోలి జిల్లాలోని ఆదివాసుల జీవనంతో పరిచయం ఏర్పడింది. వారి దురవస్థ చూసి ఆయన ఎంతో బాధ అనుభవించాడు.................
అంతరంగంమర్మభేది పాణ్యాతలా మాసా ఝాప్ ఘేయీ కైసా । జావేఁ త్యాచ్యా వంశా తే కళే ॥ మహారాష్ట్రకు చెందిన గొప్ప సాధువు సంత్ తుకారాం తన అభంగం ద్వారా సమాజానికి ఇది చెప్పడానికి ప్రయత్నించాడు. మనం ఎవరి బాధనైనా అనుభవించే వరకు ఆ బాధను వర్ణించలేమంటాడు తుకారాం. అదే విధంగా నగర జీవితానికి అలవాటు పడిన వారికి అడవులలోని పచ్చదనం, అక్కడ స్వేచ్ఛగా సంచరించే జింకలు, పులులు మొదలైన జంతువులు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అందుకే అడవులలోకి వెళ్లి అక్కడి సహజ సౌందర్యాన్ని సంపూర్ణంగా ఆనందించాలని కోరుకుంటారు. కాని ఇవే అడవుల్లో అనేక సమస్యలతో తినడానికి రొట్టె, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి : ఇల్లు కోసం పరితపిస్తున్న పీడిత మానవాళి వైపు మన దృష్టి ప్రసరించడం చాలా అరుదు. ఈ బాధనే కేంద్రం చేసుకొని సంత్ తుకారాం తన అభంగంలో చేపలను ఉదాహరిస్తూ ఇలా చెప్పాడు: చేప నీళ్లలో ఎలా నిద్రపోతుంది? ఇది తెలియాలంటే మీరు చేపగా జన్మించాలి. అంటే ఏ కష్టమైనా, బాధ అయినా అనుభవించినప్పుడు కాని తెలియదు. నితిన్ గడ్కరీ ఒకసారి తన పాఠశాల నుండి సమాజ సంబంధమైన అధ్యయనంలో భాగంగా విజ్ఞానయాత్రకు వెళ్ళాడు. ఈ అధ్యయనంలో ఆయనకు గడ్చిరోలి జిల్లాలోని ఆదివాసుల జీవనంతో పరిచయం ఏర్పడింది. వారి దురవస్థ చూసి ఆయన ఎంతో బాధ అనుభవించాడు.................© 2017,www.logili.com All Rights Reserved.