జీవితమే ఒక నాటక రంగం
వృత్తి, స్వభావాల రీత్యా నేను ఉపాధ్యాయుడ్ని. జీవితాన్ని ఓ పరీక్షగా చూడటం ఓ సందర్భంలో నాకలవాటైంది. 'జీవితమే ఒక నాటక రంగం" అంటారు. బ్రతుకు తెరువు సినిమాలో ఘంటసాల గారు పాడిన "అందమే ఆనందం” అనే పాటలో - సముద్రాల గారు.
జీవితంలో వివిధ పాత్రలను పోషిస్తున్నామని నాకు 30 సంవత్సరాలు వచ్చే వరకు తెలియదు. పరిశోధన కొరకు 1974-78 ల మధ్య రష్యా రాజధాని మాస్కోలో ఉన్నాను. కొలచల సీతారామయ్య గారనే తెలుగాయన ఓ పెద్ద శాస్త్రవేత్త కూడా అక్కడ ఉండే వారు. నాతో పాటు నా భార్య స్వర్ణకుమారి కూడా పరిశోధనా విద్యార్థిగా అక్కడే ఉన్నారు. మేమిరువురం సీతారామయ్య గారింటికి వెళుతూ ఉండేవారం. ఆయన భార్య జర్మన్. వారికిరువురు అమ్మాయిలు. వారు రష్యన్ పౌరులు. లీలావతి, నీలవేణి వారి పేర్లు. కానీ వారికి ఒక్క ముక్క తెలుగు రాదు. గొప్ప అంతర్జాతీయ కుటుంబం వారిది. మేమక్కడుండగానే ఆయన చనిపోవడం జరిగింది. ఆయన పని చేస్తున్న పెట్రోలియం టెక్నాలజీ పరిశోధనా సంస్థలో రష్యన్లు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో కలిసి పని చేసిన ఓ మహిళ మాట్లాడిన మాటలు నేను మర్చిపోలేదు. శ్రీ కొలచల అసాధారణ శాస్త్రవేత్త అనీ, అద్భుత సహ ఉద్యోగనీ, ప్రేమానురాగాలు కురిపించే తండ్రనీ, అత్యంత గౌరవాభిమానాలు చూపించే భర్తనీ ఆమె ప్రశంసలు కురిపించారు. అప్పటి దాకా ఓ మనిషి అన్ని పాత్రలు పోషించాలని నాకు తెలియదు. శ్రీ కొలచల లాగా అన్ని పాత్రలనూ విజయవంతంగా పోషించే వారుంటారని కూడా నేను ఊహించలేదు.
కానీ అప్పటినుండీ నా జీవిత పాత్రల మీద అంతర్మథనం ప్రారంభమైంది. వివిధ..............
జీవితమే ఒక నాటక రంగం వృత్తి, స్వభావాల రీత్యా నేను ఉపాధ్యాయుడ్ని. జీవితాన్ని ఓ పరీక్షగా చూడటం ఓ సందర్భంలో నాకలవాటైంది. 'జీవితమే ఒక నాటక రంగం" అంటారు. బ్రతుకు తెరువు సినిమాలో ఘంటసాల గారు పాడిన "అందమే ఆనందం” అనే పాటలో - సముద్రాల గారు. జీవితంలో వివిధ పాత్రలను పోషిస్తున్నామని నాకు 30 సంవత్సరాలు వచ్చే వరకు తెలియదు. పరిశోధన కొరకు 1974-78 ల మధ్య రష్యా రాజధాని మాస్కోలో ఉన్నాను. కొలచల సీతారామయ్య గారనే తెలుగాయన ఓ పెద్ద శాస్త్రవేత్త కూడా అక్కడ ఉండే వారు. నాతో పాటు నా భార్య స్వర్ణకుమారి కూడా పరిశోధనా విద్యార్థిగా అక్కడే ఉన్నారు. మేమిరువురం సీతారామయ్య గారింటికి వెళుతూ ఉండేవారం. ఆయన భార్య జర్మన్. వారికిరువురు అమ్మాయిలు. వారు రష్యన్ పౌరులు. లీలావతి, నీలవేణి వారి పేర్లు. కానీ వారికి ఒక్క ముక్క తెలుగు రాదు. గొప్ప అంతర్జాతీయ కుటుంబం వారిది. మేమక్కడుండగానే ఆయన చనిపోవడం జరిగింది. ఆయన పని చేస్తున్న పెట్రోలియం టెక్నాలజీ పరిశోధనా సంస్థలో రష్యన్లు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో కలిసి పని చేసిన ఓ మహిళ మాట్లాడిన మాటలు నేను మర్చిపోలేదు. శ్రీ కొలచల అసాధారణ శాస్త్రవేత్త అనీ, అద్భుత సహ ఉద్యోగనీ, ప్రేమానురాగాలు కురిపించే తండ్రనీ, అత్యంత గౌరవాభిమానాలు చూపించే భర్తనీ ఆమె ప్రశంసలు కురిపించారు. అప్పటి దాకా ఓ మనిషి అన్ని పాత్రలు పోషించాలని నాకు తెలియదు. శ్రీ కొలచల లాగా అన్ని పాత్రలనూ విజయవంతంగా పోషించే వారుంటారని కూడా నేను ఊహించలేదు. కానీ అప్పటినుండీ నా జీవిత పాత్రల మీద అంతర్మథనం ప్రారంభమైంది. వివిధ..............© 2017,www.logili.com All Rights Reserved.