అపరాధి
హెలెన్ డాయిబ్ & శామ్యూల్ పుల్లర్
బాధ్యత, ప్రేమ. ఈ రెండూ మనిషికి ముఖ్యం. కాని ఏది ఎక్కువ ముఖ్యం?
లాస్ ఏంజెలెస్.
అక్కడి ప్రఖ్యాత హాలీవుడ్ బుల్వర్డ్లో అనేక షాప్స్ ఉన్నాయి.
వాటిలో ఆడవారిని బాగా ఆకర్షించేవి రెడీమేడ్ దుస్తుల షాప్స్. అనేక కొత్త డిజైన్స్ ప్రతీ షాప్ ఔత్సాహిక నటీమణులతో, ఇతర మహిళలతో కళకళలాడుతూంటుంది. ఆ ఇరవై ఆరేళ్ళ యువతి విండోలలోని బొమ్మలకి కట్టిన దుస్తులని చూస్తూ నెమ్మదిగా పేవ్మెంట్ మీద నడవసాగింది. ఆమె ఒంటిమీది నల్లగౌన్ చాలా ఏళ్ళ క్రితానికి చెందిన ఫేషన్. ఆమె మొహం అందరి మొహాల్లాకాక సూర్యరశ్మి పడకపోవడంతో కొద్దిగా పాలిపోయినట్లుగా కనిపిస్తోంది. మధ్యమధ్యలో ఆమె చేతి గడియారం వంక చూసుకుంటోంది.
ఆమెని ఆకర్షించిన విండోలోని బొమ్మకి కట్టిన ఓ గౌన్ని చూసి చటుక్కున ఆగింది. కొద్దిగా సందేహించాక లోపలకి వెళ్ళి సేల్స్ గర్ల్స్ ని అడిగింది.
"విండోలోని గ్రే రంగు గౌన్ ధర ఎంత?”
"మేడం. చూపించనా?”
"అది నాకు నచ్చింది. నేను వేసుకుని చూడచ్చా?”.............
అపరాధి హెలెన్ డాయిబ్ & శామ్యూల్ పుల్లర్ బాధ్యత, ప్రేమ. ఈ రెండూ మనిషికి ముఖ్యం. కాని ఏది ఎక్కువ ముఖ్యం? లాస్ ఏంజెలెస్. అక్కడి ప్రఖ్యాత హాలీవుడ్ బుల్వర్డ్లో అనేక షాప్స్ ఉన్నాయి. వాటిలో ఆడవారిని బాగా ఆకర్షించేవి రెడీమేడ్ దుస్తుల షాప్స్. అనేక కొత్త డిజైన్స్ ప్రతీ షాప్ ఔత్సాహిక నటీమణులతో, ఇతర మహిళలతో కళకళలాడుతూంటుంది. ఆ ఇరవై ఆరేళ్ళ యువతి విండోలలోని బొమ్మలకి కట్టిన దుస్తులని చూస్తూ నెమ్మదిగా పేవ్మెంట్ మీద నడవసాగింది. ఆమె ఒంటిమీది నల్లగౌన్ చాలా ఏళ్ళ క్రితానికి చెందిన ఫేషన్. ఆమె మొహం అందరి మొహాల్లాకాక సూర్యరశ్మి పడకపోవడంతో కొద్దిగా పాలిపోయినట్లుగా కనిపిస్తోంది. మధ్యమధ్యలో ఆమె చేతి గడియారం వంక చూసుకుంటోంది. ఆమెని ఆకర్షించిన విండోలోని బొమ్మకి కట్టిన ఓ గౌన్ని చూసి చటుక్కున ఆగింది. కొద్దిగా సందేహించాక లోపలకి వెళ్ళి సేల్స్ గర్ల్స్ ని అడిగింది. "విండోలోని గ్రే రంగు గౌన్ ధర ఎంత?” "మేడం. చూపించనా?” "అది నాకు నచ్చింది. నేను వేసుకుని చూడచ్చా?”.............© 2017,www.logili.com All Rights Reserved.