అనగనగా ఒక రాజు: నవల వెనుక కథ
నలుగురినీ నవ్విస్తూ, నేను కూడా సంతోషంగా జీవితం గడుపుతూ ఉండగా ఇంతకాలం నవ్వింది చాలు ఇక ఏడు అని శిక్ష విధించాడు ఆ దేవుడు.
2023 జనవరిలో విశాఖపట్నం వెళ్లాను. అక్కడ వాళ్ళు చూపిన ఆదరణ చూసి మళ్లీ జ్ఞానోదయం అయింది.
నా ఉనికి నా రచనలే. ఆ రచనలు లేకపోతే నేనులేను అనుకుని, వెంటనే 'అనగనగా ఒక రాజు' అనే నవల ప్రారంభించాను.
కానీ దెబ్బ మీద దెబ్బ తగులుతూ వచ్చాయి. అందే మహేశ్వరి, శ్రీ రమణగారు, సోమరాజు సుశీల గారి అల్లుడు, మా తమ్ముడు ప్రసాద్, మా అన్నయ్య, మా ఆడపడుచు భర్త, పద్మ దాశరథి, సాయిపద్మ ఎంతోమంది దగ్గర వాళ్లను తీసుకువెళ్లిపోయాడు దేవుడు. మళ్లీ రచనల పట్ల విరక్తి పుట్టింది.
నేను సగంలో ఆపేసిన ఆ నవలను ఎవరైనా పూనుకొని పూర్తి చేయమని రిక్వెస్ట్ చేశాను.
'మీ శైలి మాకు రాదు' అన్నారు అందరూ. ఆ నవల పూర్తి చేయండి అంటూ రాజేశ్వరి అచ్యుతుని, శ్రావణి చుక్కపల్లి, చింతలపాటి హైమవతి, అనసూయ అడుసుమిల్లి వీరందరూ వెంటపడ్డారు.
సరే అని మళ్ళీ ఒక శుభ ముహూర్తాన నవల కొనసాగించాను. క్రిందటి నెల ఆరవ తారీఖున మోకాలు సర్జరీ. మళ్లీ ఆగిపోతుంది ఏమో అనుకున్నాను. కానీ పట్టుదలగా కొనసాగించాను. పూర్తి చేశాను.................
అనగనగా ఒక రాజు: నవల వెనుక కథ నలుగురినీ నవ్విస్తూ, నేను కూడా సంతోషంగా జీవితం గడుపుతూ ఉండగా ఇంతకాలం నవ్వింది చాలు ఇక ఏడు అని శిక్ష విధించాడు ఆ దేవుడు. 2023 జనవరిలో విశాఖపట్నం వెళ్లాను. అక్కడ వాళ్ళు చూపిన ఆదరణ చూసి మళ్లీ జ్ఞానోదయం అయింది. నా ఉనికి నా రచనలే. ఆ రచనలు లేకపోతే నేనులేను అనుకుని, వెంటనే 'అనగనగా ఒక రాజు' అనే నవల ప్రారంభించాను. కానీ దెబ్బ మీద దెబ్బ తగులుతూ వచ్చాయి. అందే మహేశ్వరి, శ్రీ రమణగారు, సోమరాజు సుశీల గారి అల్లుడు, మా తమ్ముడు ప్రసాద్, మా అన్నయ్య, మా ఆడపడుచు భర్త, పద్మ దాశరథి, సాయిపద్మ ఎంతోమంది దగ్గర వాళ్లను తీసుకువెళ్లిపోయాడు దేవుడు. మళ్లీ రచనల పట్ల విరక్తి పుట్టింది. నేను సగంలో ఆపేసిన ఆ నవలను ఎవరైనా పూనుకొని పూర్తి చేయమని రిక్వెస్ట్ చేశాను. 'మీ శైలి మాకు రాదు' అన్నారు అందరూ. ఆ నవల పూర్తి చేయండి అంటూ రాజేశ్వరి అచ్యుతుని, శ్రావణి చుక్కపల్లి, చింతలపాటి హైమవతి, అనసూయ అడుసుమిల్లి వీరందరూ వెంటపడ్డారు. సరే అని మళ్ళీ ఒక శుభ ముహూర్తాన నవల కొనసాగించాను. క్రిందటి నెల ఆరవ తారీఖున మోకాలు సర్జరీ. మళ్లీ ఆగిపోతుంది ఏమో అనుకున్నాను. కానీ పట్టుదలగా కొనసాగించాను. పూర్తి చేశాను.................© 2017,www.logili.com All Rights Reserved.