ఈ నవలా రచన ఓ భగీరథ ప్రయత్నం
భగీరథుడు, భగీరథ ప్రయత్నం ఈ మాటలను నేను మొదటి సారి ఒక పాటలో విన్నాను. 1972లో వచ్చిన బాలభారతం సినిమాలో ఆరుద్ర రాయగా ఘంటసాల మాస్టారు పాడిన మానవుడే మహనీయుడు అనే పాటలో “దివిజ గంగ భువుకి దింపిన భగీరథుడు" మానవుడే అన్న పాట అది. ఆ తరువాత నా పదో తరగతిలో మా తెలుగు సారు "ఆకాశంబు నుండి శంభుని శిరంబు” అనే పద్యం చెపుతూ మొదటి సారి గంగావతరణం గురించి అద్భుతంగా చెప్పారు. అప్పటినుండీ గంగావతరణం అనే ఆసక్తి, అనురక్తీ మొదలయ్యాయి. గంగావతరణం చెపుతూ మా తెలుగు సారు సాగరుడికి వేయి మంది పుత్రులని చెప్పినప్పుడు అది అసహజంగా నాకు అనిపించింది. ఒక స్త్రీ కి అరవై వేల మందిపిల్లలని కనే శక్తి ఉంటుందా అన్నది అప్పటి నా సందేహం. ఆ సందేహాన్ని మా సార్ ముందు వెలిబుచ్చడానికి నేను సంశయపడ్డాను. ఆ తరువాత కొంత వయసు వచ్చాక గంగావతరణం చుట్టూ ఉన్న అనేకానేక మిత్ (Myth) లు నన్ను వెంటాడినప్పటికీ బాపు సీతా కళ్యాణం గంగావతరణం ఘట్టం చూసి ఆ సౌందర్యానికి నన్ను నేను కోల్పోయాను
సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన గంగావతరణం కూడా ఆ గంగ చుట్టూ ఉన్న పౌరాణిక సంబంధ అంశాలకు ఏ విఘాతమూ కలగకుండా
పినాకపాణీ వేణీభరమే కరమై గ్రహించే సురగంగను తన నాయికగా
ఉరుకుల పరుగుల ఉరుముతూ వచ్చిన కన్నియ ఒదిగెను తలలో నాలుకగా
ఆ సురగంగా ప్రళయహేళ అది విష కంధరునకు ప్రణయ లీలగా
విలయమ్మును తన విలాసముగా ఔదల దాల్చెను శంకరుడాభరణముగా
మందస్మిత సుందర వదనారవింద మందాకినీ అలవోకగా నెలవంక మీదుగా
చిరునవ్వుల కిరణముల జీవజ్యోత్స్నను వర్షించెను... రసవాహిని ప్రభవించెను
శివ గంగా కళ్యాణం అది దివి భువి సంధానం పిపాసులకు రస గానం
జీవ రసధునీ నీకు స్వాగతం...............................
© 2017,www.logili.com All Rights Reserved.