మిగిలిన వాళ్ళ కబుర్లు
విన్న సంగతులు విశ్వసనీయమైనవైతే వాటిని ఆధారం చేసుకొని రాసినవి వాస్తవానికి దూరంగా వుండవు. చెప్పే కబుర్లలో చిన్నమెత్తు అసత్యమున్నా అవి చేసే చెడుపు అంతా ఇంతా కాదు.
ప్రస్తుతం 'ఈనాడు' దినపత్రికలో వారం వారం 'కబుర్లు' అనే ఫీచరు రాసే శ్రీ చలసాని ప్రసాదరావు గారు 1991 ఆగస్టు మాసంలో 'ఇలా మిగిలేం' అనే పుస్తకం ఒకటి రాశారు. దాని నాలుగో అట్టమీద ప్రచురణకర్తలు (పర్స్పెక్టివ్స్) ఇలా రాశారు.
"బాల్యం నుండీ కమ్యూనిస్టు పార్టీ, ప్రజాసంస్థలు, పత్రికలు, ప్రముఖుల మధ్య పెరిగి, రచయిత, చిత్రకారుడు, కళా విమర్శకుడు, పత్రికా సంపాదకుడుగా ఎదిగి, ఈ తరంకు సుపరిచితుడైన చలసాని ప్రసాదరావు స్వీయానుభవాలు చెప్పకనే చెపుతున్న కారణాలేమిటి?
"ఎలా ఉండవలసిన వాళ్ళం ఇన్నేళ్ళ - ఇన్ని పోరాటాల తర్వాత ఇలా..... ఎలా మిగిలేం? అనే ఆవేదనకు ఒక సమాధానం ఈ అనుభవాల యథాతథ వివరణ". చలసాని, ప్రసాదరావుగారికి (ఈ పుస్తకంలో చెప్పుకున్న ప్రకారం) 1955లో పదహారేళ్ళు. అంటే ఆయన 1939 ప్రాంతాల్లో రెండవ ప్రపంచయుద్ధపు తొలిరోజుల్లో పుట్టారు.
1942లో కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం తొలిగింది. ఉద్యమం బలపడింది. ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం (1943), ప్రజా నాట్యమండలి (1944- 45), యువజనోద్యమం, మహిళా సంఘం మొదలైనవన్నీ ప్రభవించి, ప్రబలమవుతున్న దశలు చలసాని ప్రసాదరావుగారి బాల్యంలో జరిగాయి. 'బాల సంఘ సభ్యులం భరతమాత పుత్రులం' అని చిన్నప్పుడు తమ ఊళ్ళో పాటలు పాడుకుంటూ కదం తొక్కారు. బెజవాడలో పెరిగారు........................
మిగిలిన వాళ్ళ కబుర్లు విన్న సంగతులు విశ్వసనీయమైనవైతే వాటిని ఆధారం చేసుకొని రాసినవి వాస్తవానికి దూరంగా వుండవు. చెప్పే కబుర్లలో చిన్నమెత్తు అసత్యమున్నా అవి చేసే చెడుపు అంతా ఇంతా కాదు. ప్రస్తుతం 'ఈనాడు' దినపత్రికలో వారం వారం 'కబుర్లు' అనే ఫీచరు రాసే శ్రీ చలసాని ప్రసాదరావు గారు 1991 ఆగస్టు మాసంలో 'ఇలా మిగిలేం' అనే పుస్తకం ఒకటి రాశారు. దాని నాలుగో అట్టమీద ప్రచురణకర్తలు (పర్స్పెక్టివ్స్) ఇలా రాశారు. "బాల్యం నుండీ కమ్యూనిస్టు పార్టీ, ప్రజాసంస్థలు, పత్రికలు, ప్రముఖుల మధ్య పెరిగి, రచయిత, చిత్రకారుడు, కళా విమర్శకుడు, పత్రికా సంపాదకుడుగా ఎదిగి, ఈ తరంకు సుపరిచితుడైన చలసాని ప్రసాదరావు స్వీయానుభవాలు చెప్పకనే చెపుతున్న కారణాలేమిటి? "ఎలా ఉండవలసిన వాళ్ళం ఇన్నేళ్ళ - ఇన్ని పోరాటాల తర్వాత ఇలా..... ఎలా మిగిలేం? అనే ఆవేదనకు ఒక సమాధానం ఈ అనుభవాల యథాతథ వివరణ". చలసాని, ప్రసాదరావుగారికి (ఈ పుస్తకంలో చెప్పుకున్న ప్రకారం) 1955లో పదహారేళ్ళు. అంటే ఆయన 1939 ప్రాంతాల్లో రెండవ ప్రపంచయుద్ధపు తొలిరోజుల్లో పుట్టారు. 1942లో కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం తొలిగింది. ఉద్యమం బలపడింది. ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం (1943), ప్రజా నాట్యమండలి (1944- 45), యువజనోద్యమం, మహిళా సంఘం మొదలైనవన్నీ ప్రభవించి, ప్రబలమవుతున్న దశలు చలసాని ప్రసాదరావుగారి బాల్యంలో జరిగాయి. 'బాల సంఘ సభ్యులం భరతమాత పుత్రులం' అని చిన్నప్పుడు తమ ఊళ్ళో పాటలు పాడుకుంటూ కదం తొక్కారు. బెజవాడలో పెరిగారు........................© 2017,www.logili.com All Rights Reserved.