ఒక్క నిమిషం..!
“నువ్వు పువ్వులన్నీ చిదిమేయగలవేమో గానీ వసంతం రాకుండా ఆపడం నీ తరం కాదు" అంటారు నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత పాబ్లో నెరూడా. అందుకే మనుషులను భౌతికంగా అంతం చేసినంత మాత్రాన పరిష్కారం దొరుకదని చరిత్ర చెప్తున్న సత్యం. ఇది ప్రస్తుతం మధ్య భారతంలో ఆపరేషన్ కగార్ (అంతిమ యుద్ధం) పేరుతో మావోయిస్టులపై పాలకులు సాగిస్తున్న మారణహోమానికి కూడా వర్తిస్తుందని భావిస్తున్నాం.
ఆపరేషన్ కగార్ పేరుతో సాగుతున్న మారణహోమంలో మావోయిస్టులపై పాలకులు పైచేయిగానే ఉన్నారు. కానీ ప్రజాస్వామ్య దేశంలో కనీస చర్చలకు కూడా తావివ్వకుండా ముందుకు సాగుతున్న ప్రజాస్వామ్య దేశం మనది అనక తప్పడం లేదు. ఇక్కడ పాలకులను ప్రశ్నించినా ప్రమాదమే అవుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా భావప్రకటన చేసినా ప్రమాదమే. వారి కన్నుపడితే మన చేతిలో పెన్ను ఉన్నా గన్ను అవుతుంది. మన సంకలో రాజ్యాంగ పుస్తకం ఉన్నా అది నిషేధమే అవుతుంది. తక్షణమే వారు అర్బన్ నక్సలైట్లుగా ముద్ర పడిపోతారు.
ఎంతో గొప్పగా చెప్పుకునే ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి పరిస్థితి ప్రజాస్వామ్యానికి చేటు. ఆపరేషన్ కగార్లో ప్రాణాలు కోల్పోతున్న వారు అటు మావోయిస్టులైనా, ఇటు పోలీసులు, భారత సైన్యం, ఎవరైనా మనుషులే. ఎవరు కూడా చనిపోకూడదనేదే మా ఉద్దేశ్యం. మనుషులను అంతమెందించినంత మాత్రాన.......................
ఒక్క నిమిషం..! “నువ్వు పువ్వులన్నీ చిదిమేయగలవేమో గానీ వసంతం రాకుండా ఆపడం నీ తరం కాదు" అంటారు నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత పాబ్లో నెరూడా. అందుకే మనుషులను భౌతికంగా అంతం చేసినంత మాత్రాన పరిష్కారం దొరుకదని చరిత్ర చెప్తున్న సత్యం. ఇది ప్రస్తుతం మధ్య భారతంలో ఆపరేషన్ కగార్ (అంతిమ యుద్ధం) పేరుతో మావోయిస్టులపై పాలకులు సాగిస్తున్న మారణహోమానికి కూడా వర్తిస్తుందని భావిస్తున్నాం. ఆపరేషన్ కగార్ పేరుతో సాగుతున్న మారణహోమంలో మావోయిస్టులపై పాలకులు పైచేయిగానే ఉన్నారు. కానీ ప్రజాస్వామ్య దేశంలో కనీస చర్చలకు కూడా తావివ్వకుండా ముందుకు సాగుతున్న ప్రజాస్వామ్య దేశం మనది అనక తప్పడం లేదు. ఇక్కడ పాలకులను ప్రశ్నించినా ప్రమాదమే అవుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా భావప్రకటన చేసినా ప్రమాదమే. వారి కన్నుపడితే మన చేతిలో పెన్ను ఉన్నా గన్ను అవుతుంది. మన సంకలో రాజ్యాంగ పుస్తకం ఉన్నా అది నిషేధమే అవుతుంది. తక్షణమే వారు అర్బన్ నక్సలైట్లుగా ముద్ర పడిపోతారు. ఎంతో గొప్పగా చెప్పుకునే ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి పరిస్థితి ప్రజాస్వామ్యానికి చేటు. ఆపరేషన్ కగార్లో ప్రాణాలు కోల్పోతున్న వారు అటు మావోయిస్టులైనా, ఇటు పోలీసులు, భారత సైన్యం, ఎవరైనా మనుషులే. ఎవరు కూడా చనిపోకూడదనేదే మా ఉద్దేశ్యం. మనుషులను అంతమెందించినంత మాత్రాన.......................© 2017,www.logili.com All Rights Reserved.