'ఎం' యొక్క వివరాలు
ఆ వింత జీవిని చూసే సరికి ఆ అబ్బాయి వయసు 9 ఏళ్ల కంటే కొంచెం ఎక్కువ. అతను దక్కనీ ముస్లిం కుటుంబానికి చెందిన పిల్లవాడు, కేరళలోని అందమైన రాజధాని త్రివేండ్రంలో స్థిరపడ్డాడు. మహ్మద్, ఇతర ప్రవక్తలు, సాధువులను ఆశీర్వదించడానికి దేవదూతలు వచ్చిన కథలను అతను పసితనం నుంచే భక్తురాలైన అమ్మమ్మ నుండి విన్నాడు. అయితే, ఆ రోజు అతను చూసింది, దేవదూత అని మొదట అనుకున్నాడు.
ఒకరోజు సాయంత్రం, బాలుడు వంచియూరులోని తన ఇంటి ప్రాంగణంలో తిరుగుతున్నాడు. ప్రాంగణం చివరన, పనస చెట్టు కింద ఎవరో నిలబడి ఉండడం చూశాడు. అపరిచితుడు బాలుడిని ముందుకు రమ్మని సైగ చేశాడు. బాలుడు ఎటువంటి భయం లేకుండా ఆ అపరిచితుడి దగ్గరికి వెళ్ళడానికి ఆసక్తి చూపాడు.
అపరిచితుడు పొడుగ్గా, సొగసుగా, చక్కగా ఉన్నాడు. అతని నడుము చుట్టూ ధరించే కౌపీనం మినహా అర్ధనగ్నంగా ఉన్నాడు. అతను బాలుడి తలపై తన కుడి చేయి వేసి, నీకు ఏమైనా గుర్తుందా అని దయతో అడిగాడు, లేదని ఆ కుర్రాడి సమాధానం. అపరిచితుడు ఉర్దూలో ఇలా అన్నాడు, “నీకు తరువాత అర్ధం అవుతుంది. దీని తర్వాత చాలా సంవత్సరాల వరకు మీరు నన్ను కలవరు, ఈలోగా అసంపూర్తిగా వదిలిపెట్టిన చదువులు పూర్తి చేయాలి. మీరు చేయలేరు. తగిన సమయం వచ్చేవరకు నా గురించి ఎవరికీ చెప్పకండి. ఇక ఇంటికి వెళ్లండి అంటూ అతడు అదృశ్యమయ్యాడు.
అది మొదటి దీక్ష. రెండు సంవత్సరాల తర్వాత, దాగుడుమూతలు ఆడుతున్నప్పుడు, ఆ బాలుడు యోగ పరంగా కేవల్ కుంభక్గా వర్ణించబడే.. శ్వాసస్తంభనను మొదటిసారి అనుభవించాడు. కొన్ని క్షణాల తరువాత శ్వాస తిరిగి ప్రారంభమైంది..............
'ఎం' యొక్క వివరాలు ఆ వింత జీవిని చూసే సరికి ఆ అబ్బాయి వయసు 9 ఏళ్ల కంటే కొంచెం ఎక్కువ. అతను దక్కనీ ముస్లిం కుటుంబానికి చెందిన పిల్లవాడు, కేరళలోని అందమైన రాజధాని త్రివేండ్రంలో స్థిరపడ్డాడు. మహ్మద్, ఇతర ప్రవక్తలు, సాధువులను ఆశీర్వదించడానికి దేవదూతలు వచ్చిన కథలను అతను పసితనం నుంచే భక్తురాలైన అమ్మమ్మ నుండి విన్నాడు. అయితే, ఆ రోజు అతను చూసింది, దేవదూత అని మొదట అనుకున్నాడు. ఒకరోజు సాయంత్రం, బాలుడు వంచియూరులోని తన ఇంటి ప్రాంగణంలో తిరుగుతున్నాడు. ప్రాంగణం చివరన, పనస చెట్టు కింద ఎవరో నిలబడి ఉండడం చూశాడు. అపరిచితుడు బాలుడిని ముందుకు రమ్మని సైగ చేశాడు. బాలుడు ఎటువంటి భయం లేకుండా ఆ అపరిచితుడి దగ్గరికి వెళ్ళడానికి ఆసక్తి చూపాడు. అపరిచితుడు పొడుగ్గా, సొగసుగా, చక్కగా ఉన్నాడు. అతని నడుము చుట్టూ ధరించే కౌపీనం మినహా అర్ధనగ్నంగా ఉన్నాడు. అతను బాలుడి తలపై తన కుడి చేయి వేసి, నీకు ఏమైనా గుర్తుందా అని దయతో అడిగాడు, లేదని ఆ కుర్రాడి సమాధానం. అపరిచితుడు ఉర్దూలో ఇలా అన్నాడు, “నీకు తరువాత అర్ధం అవుతుంది. దీని తర్వాత చాలా సంవత్సరాల వరకు మీరు నన్ను కలవరు, ఈలోగా అసంపూర్తిగా వదిలిపెట్టిన చదువులు పూర్తి చేయాలి. మీరు చేయలేరు. తగిన సమయం వచ్చేవరకు నా గురించి ఎవరికీ చెప్పకండి. ఇక ఇంటికి వెళ్లండి అంటూ అతడు అదృశ్యమయ్యాడు. అది మొదటి దీక్ష. రెండు సంవత్సరాల తర్వాత, దాగుడుమూతలు ఆడుతున్నప్పుడు, ఆ బాలుడు యోగ పరంగా కేవల్ కుంభక్గా వర్ణించబడే.. శ్వాసస్తంభనను మొదటిసారి అనుభవించాడు. కొన్ని క్షణాల తరువాత శ్వాస తిరిగి ప్రారంభమైంది..............© 2017,www.logili.com All Rights Reserved.