'నవ సమాజం కోసం' పుస్తకం గోదావరి తీరాన ఎగిసిన ఎర్రజెండా చరిత్ర. త్యాగాలు -సాహసాలు నిర్బంధాల నడుమ సాగిన ప్రజా పోరాటాల సమాహారం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1934 నుండి 1964 వరకు కమ్యూనిస్టు ఉద్యమ ఘట్టాలు, త్యాగాలు, నిర్బంధాలు పేరుతో వచ్చిన ఈ పుస్తకం చాలా విలువైనది. ఆ కాలంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమ్యూనిస్టు ఉద్యమానికి కంచుకోటలాగా ఎలా ఉండేదో, ఆనాటి పోరాట యోధుల త్యాగాలు ఇవన్నీ నేటి తరానికి స్ఫూర్తినిస్తాయి. రాజమండ్రి సెంట్రల్ జైల్ నుండి కమ్యూనిస్టు
యోధులు (కంభంపాటి సత్యనారాయణ సీనియర్, జి.ఎస్. బాలాజీ దాస్, చిట్టూరి ప్రభాకర చౌదరి, పెనుమత్స అనంతం, చింతా సత్యనారాయణ దాసు, కొర్రపాటి పట్టాభి రామయ్య, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నర్రా ఆంజనేయులు, అన్నే వేంకటేశ్వర రావు, కేరళకు చెందిన శంకర్) గోడ దూకి బయటకు వచ్చిన ఘటన, ఆ సందర్భంగా రాజమండ్రిలో ప్రేరప మృత్యుంజయుడుని కాల్చి చంపిన ఘటన, ఆ ఘటన నుండి చిట్టూరి ప్రభాకర చౌదరి తృటిలో బయటపడిన సందర్భం- ఇలాంటి అనేక స్ఫూర్తిదాయకమైన అంశాలున్న ఈ పుస్తకాన్ని చాలా ఓపికతో శ్రద్ధతో తీసుకు వచ్చిన కామ్రేడ్ శేషబాబ్ది గారికి విప్లవాభివందనలు.
---------అరుణ్
----------- జిల్లా కార్యదర్శి, సిపిఎం, తూర్పుగోదావరి జిల్లా
ప్రగతిశీల వాదులు అధ్యయనం చేయాలి.
'నవ సమాజం కోసం' పుస్తకాన్ని కచ్చితంగా ప్రతి ఒక్కరూ, కమ్యూనిస్టులు ప్రగతిశీలవాదులు అధ్యయనం చేయాలని కోరుతున్నాను. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు కమ్యూనిస్టు ఉద్యమంలో ఎంత పెద్ద చరిత్ర ఉందో ఈ గ్రంథం తెలియజేస్తున్నది. సాధారణ ప్రజాస్వామిక హక్కుల కోసం కూడా సుదీర్ఘ సమరశీల పోరాటాలు జరిగాయి. ఈ క్రమంలో కమ్యూనిస్టులు తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు...............
జిల్లా కార్యదర్శుల మనోగతం గోదావరి తీరాన ఎగిసిన ఎర్రజెండా చరిత్ర 'నవ సమాజం కోసం' పుస్తకం గోదావరి తీరాన ఎగిసిన ఎర్రజెండా చరిత్ర. త్యాగాలు -సాహసాలు నిర్బంధాల నడుమ సాగిన ప్రజా పోరాటాల సమాహారం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1934 నుండి 1964 వరకు కమ్యూనిస్టు ఉద్యమ ఘట్టాలు, త్యాగాలు, నిర్బంధాలు పేరుతో వచ్చిన ఈ పుస్తకం చాలా విలువైనది. ఆ కాలంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమ్యూనిస్టు ఉద్యమానికి కంచుకోటలాగా ఎలా ఉండేదో, ఆనాటి పోరాట యోధుల త్యాగాలు ఇవన్నీ నేటి తరానికి స్ఫూర్తినిస్తాయి. రాజమండ్రి సెంట్రల్ జైల్ నుండి కమ్యూనిస్టు యోధులు (కంభంపాటి సత్యనారాయణ సీనియర్, జి.ఎస్. బాలాజీ దాస్, చిట్టూరి ప్రభాకర చౌదరి, పెనుమత్స అనంతం, చింతా సత్యనారాయణ దాసు, కొర్రపాటి పట్టాభి రామయ్య, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నర్రా ఆంజనేయులు, అన్నే వేంకటేశ్వర రావు, కేరళకు చెందిన శంకర్) గోడ దూకి బయటకు వచ్చిన ఘటన, ఆ సందర్భంగా రాజమండ్రిలో ప్రేరప మృత్యుంజయుడుని కాల్చి చంపిన ఘటన, ఆ ఘటన నుండి చిట్టూరి ప్రభాకర చౌదరి తృటిలో బయటపడిన సందర్భం- ఇలాంటి అనేక స్ఫూర్తిదాయకమైన అంశాలున్న ఈ పుస్తకాన్ని చాలా ఓపికతో శ్రద్ధతో తీసుకు వచ్చిన కామ్రేడ్ శేషబాబ్ది గారికి విప్లవాభివందనలు. ---------అరుణ్ ----------- జిల్లా కార్యదర్శి, సిపిఎం, తూర్పుగోదావరి జిల్లా ప్రగతిశీల వాదులు అధ్యయనం చేయాలి. 'నవ సమాజం కోసం' పుస్తకాన్ని కచ్చితంగా ప్రతి ఒక్కరూ, కమ్యూనిస్టులు ప్రగతిశీలవాదులు అధ్యయనం చేయాలని కోరుతున్నాను. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు కమ్యూనిస్టు ఉద్యమంలో ఎంత పెద్ద చరిత్ర ఉందో ఈ గ్రంథం తెలియజేస్తున్నది. సాధారణ ప్రజాస్వామిక హక్కుల కోసం కూడా సుదీర్ఘ సమరశీల పోరాటాలు జరిగాయి. ఈ క్రమంలో కమ్యూనిస్టులు తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు...............© 2017,www.logili.com All Rights Reserved.