రాజెరుగని రాజప్రతినిధి
లవంగుడికి ఎవ్వరూలేరు. వాడు చూడ్డానికి ఎంతో అందంగా ఉంటాడు. వాడి బుర్రనిండా ఎన్నో తెలితేటలున్నాయి. కానీ వాడికి డబ్బు లేదు. ఓ మారుమూల గ్రామంలో జీవితం వెళ్లబుచ్చుతూండేవాడు. ఓసారి ఆ గ్రామానికి ధనికుడైన యువకుడు వచ్చాడు. ఆ గ్రామంలో కొబ్బరికాయలను కొనడం కోసం వచ్చిన ఆ యువకుడి పేరు జయుడు. అతడక్కడికి చాలా వైభవంగా వచ్చాడు. అతడి భార్య ఎంతో అందంగా ఉన్నది. అందంలో అతడి భార్యకు ఏమాత్రమూ తీసిపోని నలుగురు యువతులను పరిచారికలుగా తీసుకువచ్చాడు జయుడు.
జయుడు లవంగుడికంటే నాలుగైదేళ్లు పెద్ద ఉంటాడేమో! అందచందాల్లో తను జయుడికే విధంగానూ తీసిపోడని లవంగుడికి అనిపించింది. మరి అతడికున్న వ్కెభవం తనకెందుకు లేదు?
ఇంతకాలం లవంగుడు తన పరిస్థితి గురించి ఆలోచించలేదు. జయుడిని చూసినప్పట్నించీ వాడికి తన జీవితం ఎంతో రోతగా ఉన్నది. తను ధరించిన బట్టలు వాడికి వెగటుగా ఉన్నవి. జయుడి కోసం వాడు కొబ్బరికాయల బస్తాలు మోసి, అసూయ పట్టలేక, 'ఆహా! భగవంతుడు ఎంత దుర్మార్గుడు! కొందరు నా వయసులో భోగభాగ్యాలను భస్తూంటే నేను కొబ్బరికాయల బస్తాల మోస్తున్నాను' అని గట్టిగా అన్నాడు.
ఈ మాటలు జయుడు విన్నాడు. వెంటనే తన పరిచారకుణ్ణి పంపి లవంగుణ్ణి తనవద్దకు పిలిపించి 'కొబ్బరికాయల బస్తాలు మోయడం నీ కిష్టంలేదా?' అన్నాడు..........................
రాజెరుగని రాజప్రతినిధి లవంగుడికి ఎవ్వరూలేరు. వాడు చూడ్డానికి ఎంతో అందంగా ఉంటాడు. వాడి బుర్రనిండా ఎన్నో తెలితేటలున్నాయి. కానీ వాడికి డబ్బు లేదు. ఓ మారుమూల గ్రామంలో జీవితం వెళ్లబుచ్చుతూండేవాడు. ఓసారి ఆ గ్రామానికి ధనికుడైన యువకుడు వచ్చాడు. ఆ గ్రామంలో కొబ్బరికాయలను కొనడం కోసం వచ్చిన ఆ యువకుడి పేరు జయుడు. అతడక్కడికి చాలా వైభవంగా వచ్చాడు. అతడి భార్య ఎంతో అందంగా ఉన్నది. అందంలో అతడి భార్యకు ఏమాత్రమూ తీసిపోని నలుగురు యువతులను పరిచారికలుగా తీసుకువచ్చాడు జయుడు. జయుడు లవంగుడికంటే నాలుగైదేళ్లు పెద్ద ఉంటాడేమో! అందచందాల్లో తను జయుడికే విధంగానూ తీసిపోడని లవంగుడికి అనిపించింది. మరి అతడికున్న వ్కెభవం తనకెందుకు లేదు? ఇంతకాలం లవంగుడు తన పరిస్థితి గురించి ఆలోచించలేదు. జయుడిని చూసినప్పట్నించీ వాడికి తన జీవితం ఎంతో రోతగా ఉన్నది. తను ధరించిన బట్టలు వాడికి వెగటుగా ఉన్నవి. జయుడి కోసం వాడు కొబ్బరికాయల బస్తాలు మోసి, అసూయ పట్టలేక, 'ఆహా! భగవంతుడు ఎంత దుర్మార్గుడు! కొందరు నా వయసులో భోగభాగ్యాలను భస్తూంటే నేను కొబ్బరికాయల బస్తాల మోస్తున్నాను' అని గట్టిగా అన్నాడు. ఈ మాటలు జయుడు విన్నాడు. వెంటనే తన పరిచారకుణ్ణి పంపి లవంగుణ్ణి తనవద్దకు పిలిపించి 'కొబ్బరికాయల బస్తాలు మోయడం నీ కిష్టంలేదా?' అన్నాడు..........................© 2017,www.logili.com All Rights Reserved.