ఇంత రక్తపాతం ఎందుకు?
కైలాశ్ శహర్లో కాలేజీ వుంది. కానీ దానికి అగర్తలాలో మహారాజా • స్థాపించిన కాలేజీకి ఉన్నంత పేరు లేదు. స్కూలుఫైనలు పరీక్షలో మంచి మార్కులతో పాసవడంతో, అగర్తలా కాలేజీలోనే చదువుతానని అజయ్ మొండిపట్టు పట్టేడు. హాస్టలు ఖర్చులు భరించే స్తోమత వాళ్ల నాన్న హేమేన్ దేవ్ బర్మకి వున్నా, కొడుకు కళ్ల ఎదుటే వుండాలని అతడి తాపత్రయం. వచ్చిన చిక్కల్లా ఆ కుర్రవాడి మేనమామతోనే. మేనల్లుడు ఎక్కడ చదువుకుంటానంటే అక్కడే చదివించమని, తన సలహా తెలియజేసేడు. అతడి నిర్ణయాన్ని ఉల్లంఘించే శక్తి హేమేనికి లేదు. ఆ మాటకొస్తే త్రిపురాలో చాలామంది ఆదివాసీలకే లేదు.
అయితే, ఒక్క విషయం హేమేన్ దేవ్ బర్మకి ఖచ్చితంగా తెలుసు. తన కొడుకు అజయ్ మాత్రం మేనమామ అడుగుజాడల్లో వెళ్లలేదు. అజయ్ తన మేనమామని ఆఖరుసారి చూడ్డం, ఎనిమిదేళ్ల వయస్సున్నప్పుడు. అప్పటి నుంచి అజయ్ మావయ్య స్వతంత్ర త్రిపురా పోరాటంలో మొదటిశ్రేణిలో వుండి, అండర్ గ్రౌండ్కి వెళ్లిపోయేడు. అజయ్కి పది, పన్నెండేళ్ల వయసు వచ్చేనాటికి చాలామంది ఆదివాసీ................................
ఇంత రక్తపాతం ఎందుకు? కైలాశ్ శహర్లో కాలేజీ వుంది. కానీ దానికి అగర్తలాలో మహారాజా • స్థాపించిన కాలేజీకి ఉన్నంత పేరు లేదు. స్కూలుఫైనలు పరీక్షలో మంచి మార్కులతో పాసవడంతో, అగర్తలా కాలేజీలోనే చదువుతానని అజయ్ మొండిపట్టు పట్టేడు. హాస్టలు ఖర్చులు భరించే స్తోమత వాళ్ల నాన్న హేమేన్ దేవ్ బర్మకి వున్నా, కొడుకు కళ్ల ఎదుటే వుండాలని అతడి తాపత్రయం. వచ్చిన చిక్కల్లా ఆ కుర్రవాడి మేనమామతోనే. మేనల్లుడు ఎక్కడ చదువుకుంటానంటే అక్కడే చదివించమని, తన సలహా తెలియజేసేడు. అతడి నిర్ణయాన్ని ఉల్లంఘించే శక్తి హేమేనికి లేదు. ఆ మాటకొస్తే త్రిపురాలో చాలామంది ఆదివాసీలకే లేదు. అయితే, ఒక్క విషయం హేమేన్ దేవ్ బర్మకి ఖచ్చితంగా తెలుసు. తన కొడుకు అజయ్ మాత్రం మేనమామ అడుగుజాడల్లో వెళ్లలేదు. అజయ్ తన మేనమామని ఆఖరుసారి చూడ్డం, ఎనిమిదేళ్ల వయస్సున్నప్పుడు. అప్పటి నుంచి అజయ్ మావయ్య స్వతంత్ర త్రిపురా పోరాటంలో మొదటిశ్రేణిలో వుండి, అండర్ గ్రౌండ్కి వెళ్లిపోయేడు. అజయ్కి పది, పన్నెండేళ్ల వయసు వచ్చేనాటికి చాలామంది ఆదివాసీ................................© 2017,www.logili.com All Rights Reserved.