అమ్మతో పుట్టని బిడ్డ
"అమ్మా.. అమ్మా.." సన్నని గొంతు మెత్తగా మృదువుగా వినిపించింది. ఉలిక్కిపడి చుట్టూ చూసింది ఆమె. కనుచూపు మేరలో ఎవరూ కనిపించలేదు. మరి ఎవరిదీ పిలుపు? తననే పిలిచినట్టు ఉన్నదని ఆశ్చర్యపోయింది ఆమె. "అమ్మా... నేనమ్మా..!”
"ఎవరూ..?” ఆ మిట్ట మధ్యాహ్నం వేళ లోతైన చిన్ని కళ్ళు చికిలించి చుట్టూ చూస్తూ ఆమె.
"నేనమ్మా.. నా ప్రమేయం లేకుండా నీ కడుపులో గూడు కట్టుకున్న ప్రాణిని. నీలో ఊపిరి తీసుకుంటున్న నీ బిడ్డను.”
"ఏంటీ..?” అదిరిపడింది ఆమె. అప్రయత్నంగా ఆమె చేతులు కొద్దిగా ఎత్తుగా పెరిగిన పొట్ట పైకి వచ్చాయి.
"అవునమ్మా.. నువ్వు పిలవకుండా, నీకిష్టం లేకుండా నీలోకి చొరబడిన నీ బిడ్డనమ్మా... నీ గర్భగుడిలో తిష్టవేసి నీ రక్తాన్ని జుర్రుకుంటున్న బిడ్డనమ్మా." వెంట వెంట రెండుసార్లు జారిపోయిన గర్భం వల్ల నీరసంతో అలసిన ఆమె....................
అమ్మతో పుట్టని బిడ్డ "అమ్మా.. అమ్మా.." సన్నని గొంతు మెత్తగా మృదువుగా వినిపించింది. ఉలిక్కిపడి చుట్టూ చూసింది ఆమె. కనుచూపు మేరలో ఎవరూ కనిపించలేదు. మరి ఎవరిదీ పిలుపు? తననే పిలిచినట్టు ఉన్నదని ఆశ్చర్యపోయింది ఆమె. "అమ్మా... నేనమ్మా..!” "ఎవరూ..?” ఆ మిట్ట మధ్యాహ్నం వేళ లోతైన చిన్ని కళ్ళు చికిలించి చుట్టూ చూస్తూ ఆమె. "నేనమ్మా.. నా ప్రమేయం లేకుండా నీ కడుపులో గూడు కట్టుకున్న ప్రాణిని. నీలో ఊపిరి తీసుకుంటున్న నీ బిడ్డను.” "ఏంటీ..?” అదిరిపడింది ఆమె. అప్రయత్నంగా ఆమె చేతులు కొద్దిగా ఎత్తుగా పెరిగిన పొట్ట పైకి వచ్చాయి. "అవునమ్మా.. నువ్వు పిలవకుండా, నీకిష్టం లేకుండా నీలోకి చొరబడిన నీ బిడ్డనమ్మా... నీ గర్భగుడిలో తిష్టవేసి నీ రక్తాన్ని జుర్రుకుంటున్న బిడ్డనమ్మా." వెంట వెంట రెండుసార్లు జారిపోయిన గర్భం వల్ల నీరసంతో అలసిన ఆమె....................© 2017,www.logili.com All Rights Reserved.