2012 ఎన్ ఐటీ వరంగల్..
ఫ్రెషర్స్ డేతో పాటు ఆలమ్నీ ప్రోగ్రాం కూడా కలిపి చేస్తోంది మేనేజ్మెంట్. ప్రోగ్రాం డిజైనింగ్ టీంకి లీడ్ గా మీనాక్షిని ఎంగేజ్ చేసింది రమణి మేడమ్. ప్రోగ్రాం రోజు తన హాస్టల్ రూమ్లో సంధ్యతో కూర్చొని ప్రోగ్రాం డిజైనింగ్ ఫైనలైజ్ చేస్తోంది మీనాక్షి. తన మనసు మొత్తం రెండు గంటల నుండి వెతుకుతున్న, తను ఉదయం పోగొట్టుకున్న పేపర్ మీదే ఉంది. మీనాక్షిని స్టేజ్ దగ్గరికి రమ్మని రమణి మేడమ్ పిలవడంతో అటుగా వెళ్లింది. సంధ్య, మీనాక్షి కలిసి డిజైన్ చేసిన ప్రోగ్రాంని మేడమ్ ఓకే అనడంతో రూమ్కి వెళ్లి పేపర్ కోసం వెతుకుతోంది. అక్కడా కనిపించకపోవడంతో ఉదయం నుండి తను తిరిగిన చోట్లలో వెతుకుతోంది.
"మీనా! నువ్విక్కడ ఉన్నావేంటే? అక్కడ నీకోసం అంకిత వెతుకుతూ ఉంది" అంది మల్లిక.
"మార్నింగ్ చెప్పాను కదా, డైరీలో నుండి ఓ పేపర్ మిస్సయిందని. దాని " కోసమే వెతుకుతున్నా" అంది మీనాక్షి. తన మాటల్లో ఏదో కోల్పోయిన దిగులును గమనించింది మల్లిక.
"ఏమైందే? అంతా ఆల్ రైట్ కదా! అక్కడ గెస్టులందరూ వచ్చారు. ప్రోగ్రాం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకో రెండు పర్ఫార్మెన్స్ల తరువాత అంకిత పర్ఫార్మెన్స్ ఉంది. నువ్వు వచ్చి హెయిర్ సెట్ చేస్తావని, నీకోసం వెయిట్ చేస్తూ. ఉంది. పద.. పద.." అంటూ మీనాక్షిని తనతోపాటు తీసుకెళ్లింది...................
2012 ఎన్ ఐటీ వరంగల్.. ఫ్రెషర్స్ డేతో పాటు ఆలమ్నీ ప్రోగ్రాం కూడా కలిపి చేస్తోంది మేనేజ్మెంట్. ప్రోగ్రాం డిజైనింగ్ టీంకి లీడ్ గా మీనాక్షిని ఎంగేజ్ చేసింది రమణి మేడమ్. ప్రోగ్రాం రోజు తన హాస్టల్ రూమ్లో సంధ్యతో కూర్చొని ప్రోగ్రాం డిజైనింగ్ ఫైనలైజ్ చేస్తోంది మీనాక్షి. తన మనసు మొత్తం రెండు గంటల నుండి వెతుకుతున్న, తను ఉదయం పోగొట్టుకున్న పేపర్ మీదే ఉంది. మీనాక్షిని స్టేజ్ దగ్గరికి రమ్మని రమణి మేడమ్ పిలవడంతో అటుగా వెళ్లింది. సంధ్య, మీనాక్షి కలిసి డిజైన్ చేసిన ప్రోగ్రాంని మేడమ్ ఓకే అనడంతో రూమ్కి వెళ్లి పేపర్ కోసం వెతుకుతోంది. అక్కడా కనిపించకపోవడంతో ఉదయం నుండి తను తిరిగిన చోట్లలో వెతుకుతోంది. "మీనా! నువ్విక్కడ ఉన్నావేంటే? అక్కడ నీకోసం అంకిత వెతుకుతూ ఉంది" అంది మల్లిక. "మార్నింగ్ చెప్పాను కదా, డైరీలో నుండి ఓ పేపర్ మిస్సయిందని. దాని " కోసమే వెతుకుతున్నా" అంది మీనాక్షి. తన మాటల్లో ఏదో కోల్పోయిన దిగులును గమనించింది మల్లిక. "ఏమైందే? అంతా ఆల్ రైట్ కదా! అక్కడ గెస్టులందరూ వచ్చారు. ప్రోగ్రాం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకో రెండు పర్ఫార్మెన్స్ల తరువాత అంకిత పర్ఫార్మెన్స్ ఉంది. నువ్వు వచ్చి హెయిర్ సెట్ చేస్తావని, నీకోసం వెయిట్ చేస్తూ. ఉంది. పద.. పద.." అంటూ మీనాక్షిని తనతోపాటు తీసుకెళ్లింది...................© 2017,www.logili.com All Rights Reserved.