క్రిస్మస్కి రెండు రోజుల ముందు
ఏది దారుణమైంది? జరగరాని ఘోరమేదో జరిగిందని మనసుకి ఖచ్చితంగా తెలీడమా, లేదా క్షణక్షణం పెరుగుతున్న ఈ భయమా? అకస్మాత్తుగా కుప్పకూలిపోడమా, లేదా నెమ్మదిగా విచ్ఛిన్నమవుతూ బలహీనపడడమా?
తిరగాడుతున్న నా ఆలోచనల నుండి ఒక్కసారిగా నన్నేదో కుదిపి లేపి నా దృష్టి మళ్ళించింది. తల పైకెత్తి చూశాను.
సొర్నైనెన్ తీరపు రోడ్డులో, శిథిలమవుతున్న ఒక ట్రక్ నుండి ఉవ్వెత్తున ఎగసిన పసుపు-నలుపు రంగు మంటలు పెడస్ట్రియన్ బ్రిడ్జ్ మీది పిల్లర్తో తలపడుతున్నాయ్. ఆ ట్రక్ రెండు ముక్కలైంది, ప్రేయసిని బతిమిలాడుతున్న ప్రేమికుడిలా ఆ స్తంభాన్ని కౌగిలించుకుంది.
అటువైపు నుండి వెళ్తున్న కార్లలో ఒక్కటి కూడా వాటి వేగాన్ని తగ్గించలేదు, ఇక ఆగడం సంగతి అడగొద్దు. అవి అలా వేగంగా ఎగురుతూ, మండుతున్న ఆ శిథిలాలకు వీలైనంత దూరంగా ఔటర్లోన్లోకి దూసుకెళ్ళిపోయాయ్.
నేను ప్రయాణిస్తున్న బస్ ఇందుకు మినహాయింపు కాదు.
వర్షంలో తడిసిన నా పార్కను తెరిచి, పాకెట్లోంచి టిష్యూ ప్యాకెట్ తీశాను. తిమ్మిరెక్కిన వేళ్ళతో ఒక టిష్యూని బయటికి లాగి దానితో నా ముఖమూ జుట్టు తుడుచుకున్నాను. క్షణంలో అది తడిసి ముద్దయింది. దాన్ని ఉండ చుట్టి నా పాకెట్లో......................
క్రిస్మస్కి రెండు రోజుల ముందు ఏది దారుణమైంది? జరగరాని ఘోరమేదో జరిగిందని మనసుకి ఖచ్చితంగా తెలీడమా, లేదా క్షణక్షణం పెరుగుతున్న ఈ భయమా? అకస్మాత్తుగా కుప్పకూలిపోడమా, లేదా నెమ్మదిగా విచ్ఛిన్నమవుతూ బలహీనపడడమా? తిరగాడుతున్న నా ఆలోచనల నుండి ఒక్కసారిగా నన్నేదో కుదిపి లేపి నా దృష్టి మళ్ళించింది. తల పైకెత్తి చూశాను. సొర్నైనెన్ తీరపు రోడ్డులో, శిథిలమవుతున్న ఒక ట్రక్ నుండి ఉవ్వెత్తున ఎగసిన పసుపు-నలుపు రంగు మంటలు పెడస్ట్రియన్ బ్రిడ్జ్ మీది పిల్లర్తో తలపడుతున్నాయ్. ఆ ట్రక్ రెండు ముక్కలైంది, ప్రేయసిని బతిమిలాడుతున్న ప్రేమికుడిలా ఆ స్తంభాన్ని కౌగిలించుకుంది. అటువైపు నుండి వెళ్తున్న కార్లలో ఒక్కటి కూడా వాటి వేగాన్ని తగ్గించలేదు, ఇక ఆగడం సంగతి అడగొద్దు. అవి అలా వేగంగా ఎగురుతూ, మండుతున్న ఆ శిథిలాలకు వీలైనంత దూరంగా ఔటర్లోన్లోకి దూసుకెళ్ళిపోయాయ్. నేను ప్రయాణిస్తున్న బస్ ఇందుకు మినహాయింపు కాదు. వర్షంలో తడిసిన నా పార్కను తెరిచి, పాకెట్లోంచి టిష్యూ ప్యాకెట్ తీశాను. తిమ్మిరెక్కిన వేళ్ళతో ఒక టిష్యూని బయటికి లాగి దానితో నా ముఖమూ జుట్టు తుడుచుకున్నాను. క్షణంలో అది తడిసి ముద్దయింది. దాన్ని ఉండ చుట్టి నా పాకెట్లో......................© 2017,www.logili.com All Rights Reserved.