ప్రశ్నార్థకం
పెద్ద శబ్దంతో బస్ ఆగిపోయింది. ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారందరూ. డ్రైవర్ సీట్ పక్కనుండి పొగలు రావడంతో ఎదో జరిగిందనే భయంతో ముందు సీట్లలో కూర్చున్న ప్రయాణికులందరూ ఒకేసారి అరుస్తూ లేచి నిలబడ్డారు. కండక్టర్ మధ్యలోకి వచ్చి "భయపడకండమ్మా... కొంచెం నిదానించండి" అంటూ అందరినీ సమాధానపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. డ్రైవర్ కండక్టర్లు ఇద్దరూ క్రిందకు దిగి చూసారు. చివరకు బస్సు ఫేయిల్ అయిందని, భయపడవల్సింది. ఏమీ లేదని, రిపేర్ చేయించుకుని కాసేపట్లో బయలుదేరదాం అని డైవర్ చెప్పడంతో బస్సులోని వాళ్లు ఒకొక్కరూ ఒకోలా స్పందిస్తున్నారు.
అప్పటి దాకా ఆకలితో సతమతమవుతూ ఇబ్బందిగా వెనుక సీట్లో కూర్చోనున్న నాకు ఈ మాటతో విపరీతంగా నీరసం ఆవహించింది. ఓ గంటన్నరలో ఊరు చేరతాం కదా, అక్కడ భోజనం చేయవచ్చు అని ఆశతో ఎదురు చూస్తున్నాను. ఈ అనుకోని ఆలస్యంతో నాపై నాకే కోపం వచ్చింది . బైటకి చూస్తే ఎక్కడా కాస్త తిండి దొరికే ఛాయలు లేవు. చుట్టూ అన్నీ పొలాలే. నిన్నంతా కడుపులో ఇబ్బందిగా ఉందని చాలా తక్కువగా తిన్నాను. రాత్రి పూట భోజనం కూడా చేయలేదు. ప్రయాణంలో చాలా తక్కువ భోంచేయడం నా అలవాటు. ప్రొద్దున లేవగానే కడుపులో తిప్పుతుంటే, ఈ రోజు కాస్త కడుపు ఖాళీగా ఉంచితే మంచిదని, బస్ లో రిస్క్ తీసుకోవడం ఎందుకని ఏమీ తినకుండానే బస్ ఎక్కాను. బస్టాండ్లో అరటి పళ్ళు కనిపించినా కొనాలనిపించలేదు. ఐదు గంటల ప్రయాణమే కదా, బస్సు దిగంగానే తినవచ్చని అనుకున్నాను. బిస్కట్లు లాంటివి కూడా నేను పర్సులో ఉంచుకోను...............
ప్రశ్నార్థకం పెద్ద శబ్దంతో బస్ ఆగిపోయింది. ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారందరూ. డ్రైవర్ సీట్ పక్కనుండి పొగలు రావడంతో ఎదో జరిగిందనే భయంతో ముందు సీట్లలో కూర్చున్న ప్రయాణికులందరూ ఒకేసారి అరుస్తూ లేచి నిలబడ్డారు. కండక్టర్ మధ్యలోకి వచ్చి "భయపడకండమ్మా... కొంచెం నిదానించండి" అంటూ అందరినీ సమాధానపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. డ్రైవర్ కండక్టర్లు ఇద్దరూ క్రిందకు దిగి చూసారు. చివరకు బస్సు ఫేయిల్ అయిందని, భయపడవల్సింది. ఏమీ లేదని, రిపేర్ చేయించుకుని కాసేపట్లో బయలుదేరదాం అని డైవర్ చెప్పడంతో బస్సులోని వాళ్లు ఒకొక్కరూ ఒకోలా స్పందిస్తున్నారు. అప్పటి దాకా ఆకలితో సతమతమవుతూ ఇబ్బందిగా వెనుక సీట్లో కూర్చోనున్న నాకు ఈ మాటతో విపరీతంగా నీరసం ఆవహించింది. ఓ గంటన్నరలో ఊరు చేరతాం కదా, అక్కడ భోజనం చేయవచ్చు అని ఆశతో ఎదురు చూస్తున్నాను. ఈ అనుకోని ఆలస్యంతో నాపై నాకే కోపం వచ్చింది . బైటకి చూస్తే ఎక్కడా కాస్త తిండి దొరికే ఛాయలు లేవు. చుట్టూ అన్నీ పొలాలే. నిన్నంతా కడుపులో ఇబ్బందిగా ఉందని చాలా తక్కువగా తిన్నాను. రాత్రి పూట భోజనం కూడా చేయలేదు. ప్రయాణంలో చాలా తక్కువ భోంచేయడం నా అలవాటు. ప్రొద్దున లేవగానే కడుపులో తిప్పుతుంటే, ఈ రోజు కాస్త కడుపు ఖాళీగా ఉంచితే మంచిదని, బస్ లో రిస్క్ తీసుకోవడం ఎందుకని ఏమీ తినకుండానే బస్ ఎక్కాను. బస్టాండ్లో అరటి పళ్ళు కనిపించినా కొనాలనిపించలేదు. ఐదు గంటల ప్రయాణమే కదా, బస్సు దిగంగానే తినవచ్చని అనుకున్నాను. బిస్కట్లు లాంటివి కూడా నేను పర్సులో ఉంచుకోను...............© 2017,www.logili.com All Rights Reserved.