ప్రపంచ దేశాలన్నీ మరింత వెలుగు దిశగా వేగంగా ప్రయాణిస్తున్న ఈ రోజుల్లో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం అంతకన్నా ఎక్కువ వేగంతో చీకట్లలోకి ప్రయాణిస్తుంది. పసి పిల్లాడి నుంచి పండు ముసలాడి వరకూ ఎవరిని కదిపినా ద్వేషం. సాటి మనిషి పట్ల ఇంతకు ముందెప్పుడూ లేనంత ద్వేషం. ఈ ద్వేషం బ్రతికి ఉన్నవాళ్ళ దగ్గర ఆగలేదు. ఎప్పుడో దశాబ్దాలకి ముందు చనిపోయిన వాళ్ళను కూడా గుర్తు చేసుకుని మరీ ద్వేషాన్ని చిమ్మే పరిస్థితి. ఆ ద్వేషం బారిన దేశానికొక దారి చూపిన మహనీయులు కూడా పడడం శోచనీయం.
ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది మేధావుల చేత మహాజ్ఞాని అని కొనియాడబడ్డ డాక్టర్. బి. ఆర్. అంబేడ్కర్, ఆయన చేసిన పోరాటాల కారణంగా బతికి ఉన్న కాలంలో ఈ దేశపు మతఛాందస వాదుల ద్వేషానికి గురయ్యాడు. ఈనాడు దేశం ఇంత పురోగమించాక కూడా ఆయన స్వంత వారి ద్వేషానికి గురవుతున్నాడు.
రాజ్యాంగం రెండు వందల మంది రాస్తే ఆయన పేరు వేసుకున్నాడు అని ఈ తరం యువత ఆయన మీద విషం చిమ్మడం అత్యంత బాధాకరమైన విషయం. జాగ్రత్తగా గమనిస్తే ఈ ద్వేషం వెనుక ఉన్న ఒకే ఒక్క కారణం కులమే.
మనుషుల పట్ల ఎంతో అమానవీయంగా ప్రవర్తించిన మనుస్మృతిని మళ్ళీ బతికించే ప్రయత్నం చేస్తున్నారు గానీ, నిజంగా దేశ ప్రయోజనాలకి ఉపయోగపడే అంబేడ్కర్ రచనలని మాత్రం పొరపాటున కూడా చర్చలలోకి రానివ్వడం లేదు. ఇది ఈ దేశ మేధావి వర్గం చేసిన ఉద్దేశపూర్వక కుట్ర అని కాస్త మెదడు ఉపయోగించి ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది.
కోట్ల మంది జనాభా కలిగిన ఇంత పెద్ద దేశం, ఎన్నో వనరులు ఉండి, ఈపాటికే ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశంగా అవతరించవలసిన దేశం, ఈ నాటికీ కుంటుతూ అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే ఉండిపోవడానికి కారణం "ఈ దేశాన్ని కులం పునాదుల మీద నిర్మించడమే".............................
ప్రపంచ దేశాలన్నీ మరింత వెలుగు దిశగా వేగంగా ప్రయాణిస్తున్న ఈ రోజుల్లో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం అంతకన్నా ఎక్కువ వేగంతో చీకట్లలోకి ప్రయాణిస్తుంది. పసి పిల్లాడి నుంచి పండు ముసలాడి వరకూ ఎవరిని కదిపినా ద్వేషం. సాటి మనిషి పట్ల ఇంతకు ముందెప్పుడూ లేనంత ద్వేషం. ఈ ద్వేషం బ్రతికి ఉన్నవాళ్ళ దగ్గర ఆగలేదు. ఎప్పుడో దశాబ్దాలకి ముందు చనిపోయిన వాళ్ళను కూడా గుర్తు చేసుకుని మరీ ద్వేషాన్ని చిమ్మే పరిస్థితి. ఆ ద్వేషం బారిన దేశానికొక దారి చూపిన మహనీయులు కూడా పడడం శోచనీయం. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది మేధావుల చేత మహాజ్ఞాని అని కొనియాడబడ్డ డాక్టర్. బి. ఆర్. అంబేడ్కర్, ఆయన చేసిన పోరాటాల కారణంగా బతికి ఉన్న కాలంలో ఈ దేశపు మతఛాందస వాదుల ద్వేషానికి గురయ్యాడు. ఈనాడు దేశం ఇంత పురోగమించాక కూడా ఆయన స్వంత వారి ద్వేషానికి గురవుతున్నాడు. రాజ్యాంగం రెండు వందల మంది రాస్తే ఆయన పేరు వేసుకున్నాడు అని ఈ తరం యువత ఆయన మీద విషం చిమ్మడం అత్యంత బాధాకరమైన విషయం. జాగ్రత్తగా గమనిస్తే ఈ ద్వేషం వెనుక ఉన్న ఒకే ఒక్క కారణం కులమే. మనుషుల పట్ల ఎంతో అమానవీయంగా ప్రవర్తించిన మనుస్మృతిని మళ్ళీ బతికించే ప్రయత్నం చేస్తున్నారు గానీ, నిజంగా దేశ ప్రయోజనాలకి ఉపయోగపడే అంబేడ్కర్ రచనలని మాత్రం పొరపాటున కూడా చర్చలలోకి రానివ్వడం లేదు. ఇది ఈ దేశ మేధావి వర్గం చేసిన ఉద్దేశపూర్వక కుట్ర అని కాస్త మెదడు ఉపయోగించి ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. కోట్ల మంది జనాభా కలిగిన ఇంత పెద్ద దేశం, ఎన్నో వనరులు ఉండి, ఈపాటికే ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశంగా అవతరించవలసిన దేశం, ఈ నాటికీ కుంటుతూ అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే ఉండిపోవడానికి కారణం "ఈ దేశాన్ని కులం పునాదుల మీద నిర్మించడమే".............................© 2017,www.logili.com All Rights Reserved.