అధ్యాయం ఒకటి
పదాతిదళంలో నావికుడు
సమరం తీవ్రతరమైన దశలో ఉంది. ఓర్ష విముక్తి కోసమని జర్మన్ రక్షణల్ని ఛేదించేందుకై పదేపదే ప్రయత్నం చేయడంవల్ల రెజిమెంటు బలహీనమైపోయింది. తమ స్థానే వేరే రెజిమెంటువారు రాబోతున్నట్టు విన్నారు. మైళ్ల కొద్దీ తెరుచుకొని బురదగా ఉన్న కొండ పగుళ్ల పొడుగునా రక్షణకై కందకాలు త్రవ్వి వాటిలో స్థావరాలు ఏర్పరచుకుని పోరాడుతూన్న మనుషుల స్థానే కొత్త వాళ్లను ఏర్పాటు చేయవలసి ఉంది. ఆపై వారు పొడిగా ప్రశాంతంగా ఉన్న ఏదో ఒక స్థలంలోకి విశ్రాంతి కొరకై, శరదృతువు తెచ్చిపెట్టిన చలినీ, జలుబుల్నీ, పుండ్లనీ స్వస్థత పరచుకొనేందుకై వెళ్లాలి. రెజిమెంటు కమాండరు మేజర్ గొలొవీన్ తన సహాయకులను, ముగ్గురు బటాలియను కమాండర్లను, తన చీఫ్ ఆఫ్ స్టాఫ్ని సమావేశ పరచాడు. వారికా వార్తను తెలియ జేసినప్పుడు అతని ముఖంలో మరుగుపడని సంతృప్తి వెలుగొందింది.
సమావేశం జరుగుతున్న సమయంలో పాత వాళ్లదగ్గరనుండి చార్జి తీసుకోబోతున్న డివిజన్ నుండి యిద్దరు ప్రతినిధులు. వయసులో పెద్దవాడైన ఒక కర్నలూ, యువకుడైన మేజరూ వచ్చారు. ఏదో ఒక విధంగా ఏర్పాటు చేసిన దీపం కాంతిలో ఆ చెమ్మగా ఉన్న కందకం బసలోకి వారు ప్రవేశించి, తమ కాగితాల్ని చూపించి తడి ఆర్చు కోను వెచ్చగా ఉండేందుకై ఒక చిన్న యినుపపొయ్యి ప్రక్క ఉన్న మడతమంచంమీద కూర్చున్నారు.................
అధ్యాయం ఒకటి పదాతిదళంలో నావికుడు సమరం తీవ్రతరమైన దశలో ఉంది. ఓర్ష విముక్తి కోసమని జర్మన్ రక్షణల్ని ఛేదించేందుకై పదేపదే ప్రయత్నం చేయడంవల్ల రెజిమెంటు బలహీనమైపోయింది. తమ స్థానే వేరే రెజిమెంటువారు రాబోతున్నట్టు విన్నారు. మైళ్ల కొద్దీ తెరుచుకొని బురదగా ఉన్న కొండ పగుళ్ల పొడుగునా రక్షణకై కందకాలు త్రవ్వి వాటిలో స్థావరాలు ఏర్పరచుకుని పోరాడుతూన్న మనుషుల స్థానే కొత్త వాళ్లను ఏర్పాటు చేయవలసి ఉంది. ఆపై వారు పొడిగా ప్రశాంతంగా ఉన్న ఏదో ఒక స్థలంలోకి విశ్రాంతి కొరకై, శరదృతువు తెచ్చిపెట్టిన చలినీ, జలుబుల్నీ, పుండ్లనీ స్వస్థత పరచుకొనేందుకై వెళ్లాలి. రెజిమెంటు కమాండరు మేజర్ గొలొవీన్ తన సహాయకులను, ముగ్గురు బటాలియను కమాండర్లను, తన చీఫ్ ఆఫ్ స్టాఫ్ని సమావేశ పరచాడు. వారికా వార్తను తెలియ జేసినప్పుడు అతని ముఖంలో మరుగుపడని సంతృప్తి వెలుగొందింది. సమావేశం జరుగుతున్న సమయంలో పాత వాళ్లదగ్గరనుండి చార్జి తీసుకోబోతున్న డివిజన్ నుండి యిద్దరు ప్రతినిధులు. వయసులో పెద్దవాడైన ఒక కర్నలూ, యువకుడైన మేజరూ వచ్చారు. ఏదో ఒక విధంగా ఏర్పాటు చేసిన దీపం కాంతిలో ఆ చెమ్మగా ఉన్న కందకం బసలోకి వారు ప్రవేశించి, తమ కాగితాల్ని చూపించి తడి ఆర్చు కోను వెచ్చగా ఉండేందుకై ఒక చిన్న యినుపపొయ్యి ప్రక్క ఉన్న మడతమంచంమీద కూర్చున్నారు.................© 2017,www.logili.com All Rights Reserved.