పరదేశీ అంటే గ్రామానికి సంబంధించిన వాడు కాదని అర్థం. ఆ మాటకొస్తే గ్రామంలో నివసిస్తున్న వారంతా మొదటి నుండి అక్కడ స్థిరపడిన వారు కాదు. పురాతన సమాజంలో గ్రామమంటే జనం స్థిరపడిన చోటు. అక్కడ ఒక సంస్కృతి, ఒక వ్యవస్థీకృత జీవితం ఉంటుంది. వివిధ వృత్తుల్లో నైపుణ్యం గల కులాల వారు నిచ్చెనమెట్ల తరహా సామాజిక హోదాల్లో ఉంటారు. గ్రామం మీద ఆధారపడి జీవించే వారు కొందరుంటారు. వారు ఒక గ్రామం నుండి మరో గ్రామానికి సంచరిస్తూ గ్రామానికి దూరంగా బతుకుతుంటారు. వాళ్లనే పరదేశీ అంటారు. ఆహారం కోసం వారు గ్రామంపై ఆధారపడినా వారు గ్రామంలో భాగం కాదు. అయితే కొన్ని సందర్భాల్లో అవసరమైతే వారు ఊరికి జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే గ్రామపంచాయతీ ఆమోదంతోనే వారు గ్రామం వెలుపల గుడిసెలు వేసుకుంటారు గనుక. ఉదాహరణకు గంగిరెద్దుల, కాటిపాపల, బుడబుక్కల, దొమ్మర కులాలు గ్రామంలో భాగం కావు. అలాగే అక్కడి నిచ్చెనమెట్ల కులవ్యవస్థ సంస్కృతిలో స్థిరపడినవి కావు. కనుక వారు గ్రామ పంచాయతీలో భాగంగా ఉండరు. తమ కులపెద్ద నాయకత్వంలోని పంచాయతీకి వారు కట్టుబడి ఉంటారు. గ్రామస్తులకు తమ వస్తువులు. మందులు అమ్ముతూ వారి దానధర్మాలపై ఆధారపడి జీవిస్తారు. వారు తమ ఆహారాన్ని తాము ఉత్పత్తి చేసుకోరు. గ్రామస్తుల మాదిరిగా స్థిరమైన స్వయంప్రతిపత్తి గల ఆర్థిక వ్యవస్థ వారికి లేదు. ఈ సంచారజీవులు ఒక నిర్దిష్ట శ్రమపై ఆధారపడి జీవించే వారూ కాదు. గ్రామ ఆర్థిక వ్యవస్థకు వారు అనుబంధమూ కాదు. అలాగని స్వేచ్చగానూ బతకలేరు. గ్రామంలో భాగం కాకపోయినా తమ అవసరాల కోసం వారు గ్రామం పై ఆధారపడక తప్పదు'.........................
పరదేశీలు: బహిష్కృత సంచార జాతులు పరదేశీ అంటే గ్రామానికి సంబంధించిన వాడు కాదని అర్థం. ఆ మాటకొస్తే గ్రామంలో నివసిస్తున్న వారంతా మొదటి నుండి అక్కడ స్థిరపడిన వారు కాదు. పురాతన సమాజంలో గ్రామమంటే జనం స్థిరపడిన చోటు. అక్కడ ఒక సంస్కృతి, ఒక వ్యవస్థీకృత జీవితం ఉంటుంది. వివిధ వృత్తుల్లో నైపుణ్యం గల కులాల వారు నిచ్చెనమెట్ల తరహా సామాజిక హోదాల్లో ఉంటారు. గ్రామం మీద ఆధారపడి జీవించే వారు కొందరుంటారు. వారు ఒక గ్రామం నుండి మరో గ్రామానికి సంచరిస్తూ గ్రామానికి దూరంగా బతుకుతుంటారు. వాళ్లనే పరదేశీ అంటారు. ఆహారం కోసం వారు గ్రామంపై ఆధారపడినా వారు గ్రామంలో భాగం కాదు. అయితే కొన్ని సందర్భాల్లో అవసరమైతే వారు ఊరికి జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే గ్రామపంచాయతీ ఆమోదంతోనే వారు గ్రామం వెలుపల గుడిసెలు వేసుకుంటారు గనుక. ఉదాహరణకు గంగిరెద్దుల, కాటిపాపల, బుడబుక్కల, దొమ్మర కులాలు గ్రామంలో భాగం కావు. అలాగే అక్కడి నిచ్చెనమెట్ల కులవ్యవస్థ సంస్కృతిలో స్థిరపడినవి కావు. కనుక వారు గ్రామ పంచాయతీలో భాగంగా ఉండరు. తమ కులపెద్ద నాయకత్వంలోని పంచాయతీకి వారు కట్టుబడి ఉంటారు. గ్రామస్తులకు తమ వస్తువులు. మందులు అమ్ముతూ వారి దానధర్మాలపై ఆధారపడి జీవిస్తారు. వారు తమ ఆహారాన్ని తాము ఉత్పత్తి చేసుకోరు. గ్రామస్తుల మాదిరిగా స్థిరమైన స్వయంప్రతిపత్తి గల ఆర్థిక వ్యవస్థ వారికి లేదు. ఈ సంచారజీవులు ఒక నిర్దిష్ట శ్రమపై ఆధారపడి జీవించే వారూ కాదు. గ్రామ ఆర్థిక వ్యవస్థకు వారు అనుబంధమూ కాదు. అలాగని స్వేచ్చగానూ బతకలేరు. గ్రామంలో భాగం కాకపోయినా తమ అవసరాల కోసం వారు గ్రామం పై ఆధారపడక తప్పదు'.........................© 2017,www.logili.com All Rights Reserved.