విజయ సాధన సూత్రాలపై భారీ పుస్తకాలు వెలువడుతున్నా కోట్లాది మందిని వెతలు వెన్నాడుతూనే వున్నాయేల? ఆర్థికం, సామాజికం, సాంస్కృతికం, నైతికం, ఆధ్మాత్మికం ఇలా పలువ్యవస్థల మధ్య మానవ అవసరాలు, ఆసక్తి ఎలాటి ప్రభావం చూపిస్తాయి? స్థల కాలాల్లో వచ్చే మార్పులను అర్థం చేసుకుంటూ అన్వయించుకుంటూ అర్థవంతంగా జీవించడమెలా? మనుషులు, కుటుంబాలు, బంధుమిత్రులు, సమాజాలు, వ్యవస్థలు, దేశాలు, ప్రపంచం, ప్రచారాలు వీటిమధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడమెలా? నిత్యం ఎదురయ్యే సంధిగ్ధతలూ, సంఘర్షణలూ, సవాళ్ళతో మనుషుల గమనాన్ని నిర్దేశించే అంశాలేవి?
ఈ ప్రశ్నలలో ఏవో కొన్ని ఏదో రూపంలో, ఏదో సందర్భంలో ఎదురవుతూనే వుంటాయి. సంపదలూ, సమస్యలూ, జయాపజయాలు, కీర్తి ప్రతిష్టలూ, మంచి చెడ్డలూ వీటి గురించి విస్తారంగా వెలువడే రచనల నుంచి వీడియోల వరకూ అనుదినం కాదు అనుక్షణం సమాచారం గుమ్మరించడమే గాక ఏవో ముద్రలు వేస్తూనే వుంటాయి. మీపైనే గాక మీ ఇళ్లలోని బుల్లి బుల్లి మానవుల మెదళ్లనూ నింపేస్తుంటాయి. సముద్రంలో అలల్లా సమాజంలో వచ్చే సమస్యల తాకిడి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కాదంటే కళ్లు మూసుకొమ్మని కమ్మేస్తుంది. ఎందుకంటే ఎవరికైనా ఎప్పుడైనా జీవితం ఎప్పుడూ బహువచనమే. మనుషులనూ సమాజాలనూ అర్థం చేసుకుంటూ మన గమ్యాన్ని నిర్దేశించుకుంటూ ఆ దిశలో మనమేం చేయాలో తేల్చుకోవాల్సిందే. ఆ ప్రయాణంలో మనకు మనమే తోడు. ప్రేరణ సాధన అన్నీ మనమే. విజయం.....................
నా మాట ఏం చేద్దాం? ఎలా చూద్దాం? విజయ సాధన సూత్రాలపై భారీ పుస్తకాలు వెలువడుతున్నా కోట్లాది మందిని వెతలు వెన్నాడుతూనే వున్నాయేల? ఆర్థికం, సామాజికం, సాంస్కృతికం, నైతికం, ఆధ్మాత్మికం ఇలా పలువ్యవస్థల మధ్య మానవ అవసరాలు, ఆసక్తి ఎలాటి ప్రభావం చూపిస్తాయి? స్థల కాలాల్లో వచ్చే మార్పులను అర్థం చేసుకుంటూ అన్వయించుకుంటూ అర్థవంతంగా జీవించడమెలా? మనుషులు, కుటుంబాలు, బంధుమిత్రులు, సమాజాలు, వ్యవస్థలు, దేశాలు, ప్రపంచం, ప్రచారాలు వీటిమధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడమెలా? నిత్యం ఎదురయ్యే సంధిగ్ధతలూ, సంఘర్షణలూ, సవాళ్ళతో మనుషుల గమనాన్ని నిర్దేశించే అంశాలేవి? ఈ ప్రశ్నలలో ఏవో కొన్ని ఏదో రూపంలో, ఏదో సందర్భంలో ఎదురవుతూనే వుంటాయి. సంపదలూ, సమస్యలూ, జయాపజయాలు, కీర్తి ప్రతిష్టలూ, మంచి చెడ్డలూ వీటి గురించి విస్తారంగా వెలువడే రచనల నుంచి వీడియోల వరకూ అనుదినం కాదు అనుక్షణం సమాచారం గుమ్మరించడమే గాక ఏవో ముద్రలు వేస్తూనే వుంటాయి. మీపైనే గాక మీ ఇళ్లలోని బుల్లి బుల్లి మానవుల మెదళ్లనూ నింపేస్తుంటాయి. సముద్రంలో అలల్లా సమాజంలో వచ్చే సమస్యల తాకిడి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కాదంటే కళ్లు మూసుకొమ్మని కమ్మేస్తుంది. ఎందుకంటే ఎవరికైనా ఎప్పుడైనా జీవితం ఎప్పుడూ బహువచనమే. మనుషులనూ సమాజాలనూ అర్థం చేసుకుంటూ మన గమ్యాన్ని నిర్దేశించుకుంటూ ఆ దిశలో మనమేం చేయాలో తేల్చుకోవాల్సిందే. ఆ ప్రయాణంలో మనకు మనమే తోడు. ప్రేరణ సాధన అన్నీ మనమే. విజయం.....................© 2017,www.logili.com All Rights Reserved.