గుణపాఠం!
అదొక అందమైన పూల తోట. ఆ తోటలో గులాబీ, మల్లె, చామంతి, సంపెంగ, సన్నజాజి తదితర మొక్కలు ఉన్నాయి. అవి పూల పరిమళాలను వెదజల్లుతూ ఆ తోటకు మరింత అందాన్ని తీసుకువచ్చేవి. వేసవి కాలం కావడంతో మల్లె చెట్టు విరగబూసింది. అది తోట పరిమళాన్ని ఇంకా పెంచుతోంది. కొమ్మ కొమ్మకు ఉన్న తన తెల్లని చిట్టి పువ్వులను చూసుకుని మల్లె మురిసిపోసాగింది. తన చుట్టూ ఉన్న మొక్కలను ఒకటికి రెండుసార్లు గమనించింది. ఏ మొక్కకూ తన కంటే ఎక్కువ పువ్వులు లేవని గర్వపడింది. అదే గర్వంతో.. 'ప్రకృతిలోని పచ్చదనానికి నా ఆకులే ప్రతీకలు.. పున్నమి జాబిలి వెన్నెలకు నా పువ్వులే ప్రత్యక్ష నిదర్శనాలు.. నన్ను, నా అందమైన పువ్వులను చూసి తెల్లబోవడం తప్ప మీరింకేమీ చేయలేరు. గుబురుగా ఉండటంతో పాటు తుమ్మెదలకు కూడా గూడునిస్తాను. నా ముందు మీరెంత?” అంటూ తక్కిన మొక్కల ముందు అహంకారాన్ని ప్రదర్శించింది. మల్లె చెట్టు మాటలు విని తోటి మొక్కలన్నీ నివ్వెరపోయాయి. 'మల్లెకు ఎందుకంత గర్వం' అంటూ మనసులోనే అనుకున్నాయి. గులాబీ మొక్క మాత్రం మల్లె మిడిసిపాటు చూసి గట్టిగా నవ్వింది. 'ఓటమిని ఒప్పుకోని వారే అలా నవ్వుతారు.. అంతే కదూ!' అంటూ అదే గర్వంతో గులాబీని అడిగింది మల్లె. 'కాదు.. నీ చుట్టూ ఉన్న ముళ్లను చూసి నవ్వుతున్నా' అంది గులాబీ. 'నీ చుట్టూ ముళ్లున్నాయని.. నాకూ ఉన్నాయని అబద్ధం ఆడతావా?' అంటూ కోపంతో గట్టిగా అడిగింది మల్లె. 'కోపం వద్దు.. నా చుట్టూ ముళ్లున్నాయనడం నిజమే. కానీ నీ చుట్టూ రాకుండా చూసుకోమని హెచ్చరిస్తున్నా' అంది గులాబీ సమాధానంగా. 'ఎందుకు వస్తాయి?' అని ఒకింత ఆశ్చర్యపోతూ అడిగింది మల్లె. 'అలా అడిగావు కాబట్టి చెబుతున్నా... జాగ్రత్తగా విను' అంది. 'నువ్వు ఈ తోటలోకి రాకముందు నేను కూడా నా..................
గుణపాఠం! అదొక అందమైన పూల తోట. ఆ తోటలో గులాబీ, మల్లె, చామంతి, సంపెంగ, సన్నజాజి తదితర మొక్కలు ఉన్నాయి. అవి పూల పరిమళాలను వెదజల్లుతూ ఆ తోటకు మరింత అందాన్ని తీసుకువచ్చేవి. వేసవి కాలం కావడంతో మల్లె చెట్టు విరగబూసింది. అది తోట పరిమళాన్ని ఇంకా పెంచుతోంది. కొమ్మ కొమ్మకు ఉన్న తన తెల్లని చిట్టి పువ్వులను చూసుకుని మల్లె మురిసిపోసాగింది. తన చుట్టూ ఉన్న మొక్కలను ఒకటికి రెండుసార్లు గమనించింది. ఏ మొక్కకూ తన కంటే ఎక్కువ పువ్వులు లేవని గర్వపడింది. అదే గర్వంతో.. 'ప్రకృతిలోని పచ్చదనానికి నా ఆకులే ప్రతీకలు.. పున్నమి జాబిలి వెన్నెలకు నా పువ్వులే ప్రత్యక్ష నిదర్శనాలు.. నన్ను, నా అందమైన పువ్వులను చూసి తెల్లబోవడం తప్ప మీరింకేమీ చేయలేరు. గుబురుగా ఉండటంతో పాటు తుమ్మెదలకు కూడా గూడునిస్తాను. నా ముందు మీరెంత?” అంటూ తక్కిన మొక్కల ముందు అహంకారాన్ని ప్రదర్శించింది. మల్లె చెట్టు మాటలు విని తోటి మొక్కలన్నీ నివ్వెరపోయాయి. 'మల్లెకు ఎందుకంత గర్వం' అంటూ మనసులోనే అనుకున్నాయి. గులాబీ మొక్క మాత్రం మల్లె మిడిసిపాటు చూసి గట్టిగా నవ్వింది. 'ఓటమిని ఒప్పుకోని వారే అలా నవ్వుతారు.. అంతే కదూ!' అంటూ అదే గర్వంతో గులాబీని అడిగింది మల్లె. 'కాదు.. నీ చుట్టూ ఉన్న ముళ్లను చూసి నవ్వుతున్నా' అంది గులాబీ. 'నీ చుట్టూ ముళ్లున్నాయని.. నాకూ ఉన్నాయని అబద్ధం ఆడతావా?' అంటూ కోపంతో గట్టిగా అడిగింది మల్లె. 'కోపం వద్దు.. నా చుట్టూ ముళ్లున్నాయనడం నిజమే. కానీ నీ చుట్టూ రాకుండా చూసుకోమని హెచ్చరిస్తున్నా' అంది గులాబీ సమాధానంగా. 'ఎందుకు వస్తాయి?' అని ఒకింత ఆశ్చర్యపోతూ అడిగింది మల్లె. 'అలా అడిగావు కాబట్టి చెబుతున్నా... జాగ్రత్తగా విను' అంది. 'నువ్వు ఈ తోటలోకి రాకముందు నేను కూడా నా..................© 2017,www.logili.com All Rights Reserved.