గొంతు కోసి దాపెట్టిన బదుకులు
మన దేశంలో ఒకే రకమైన జీవితాన్ని సమాజం మొత్తానికి ఆపాదించి, అదే ఇక్కడి మనుషుల జీవన విధానం, సంస్కృతి, చరిత్ర అని నమ్మబలికించే ప్రయత్నం నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయత్నంలో మిగతా బతుకుల గురించి సమాజానికి పట్టకుండా పోతుంది. దానికి కొందరు మనుషులు బతికారని, చనిపోయారని పట్టదు. అలా కప్పెట్టబడిన మనుషుల గాథలే ఇవి. అయితే ఇందులో రెండు రకాల జీవితాలు ఉన్నాయి. ఒకటి గూడెం జీవితం, రెండు గూడెం నుంచి యునివర్సిటీ దాకా చదువులకు వెళ్ళిన పిలగాడి జీవితం. ఈ రెండు జీవితాలు ఒకదానికొకటి కలిసిపోయి ఒకే జీవితంగా కనిపిస్తాయి. కానీ కావు. గూడెం నుంచి తాను ఎప్పుడైతే దూరమై, పరాయి జీవిగా మారిపోయాడో- ఆ వేదన, ఆ ఎడబాటులోంచి పుట్టిన కథలు ఇవి. తనని తాను సర్దుబాటు చేసుకోవడం కాదు. తనని తాను గూడెం పిలగాడిగా బతికించుకోవాలని చేసిన నిస్సహాయ ప్రయత్నం ఈ కథలు.
ఊరి కథలు, ఇంటి కథలు, కులం కథలు ఇలా ఏ కథలు ఎవరైనా రాయవచ్చు. కానీ వాడల్లోని యువకుడు, తండాలోని యువకుడు తన ఇంటి కథలు, వాడ కథలు రాశాడంటే జాగర్తగా వాటిని మనం అర్థం చేసుకోవాలి. అవి కేవలం జ్ఞాపకాలు కాదని...........................
గొంతు కోసి దాపెట్టిన బదుకులు మన దేశంలో ఒకే రకమైన జీవితాన్ని సమాజం మొత్తానికి ఆపాదించి, అదే ఇక్కడి మనుషుల జీవన విధానం, సంస్కృతి, చరిత్ర అని నమ్మబలికించే ప్రయత్నం నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయత్నంలో మిగతా బతుకుల గురించి సమాజానికి పట్టకుండా పోతుంది. దానికి కొందరు మనుషులు బతికారని, చనిపోయారని పట్టదు. అలా కప్పెట్టబడిన మనుషుల గాథలే ఇవి. అయితే ఇందులో రెండు రకాల జీవితాలు ఉన్నాయి. ఒకటి గూడెం జీవితం, రెండు గూడెం నుంచి యునివర్సిటీ దాకా చదువులకు వెళ్ళిన పిలగాడి జీవితం. ఈ రెండు జీవితాలు ఒకదానికొకటి కలిసిపోయి ఒకే జీవితంగా కనిపిస్తాయి. కానీ కావు. గూడెం నుంచి తాను ఎప్పుడైతే దూరమై, పరాయి జీవిగా మారిపోయాడో- ఆ వేదన, ఆ ఎడబాటులోంచి పుట్టిన కథలు ఇవి. తనని తాను సర్దుబాటు చేసుకోవడం కాదు. తనని తాను గూడెం పిలగాడిగా బతికించుకోవాలని చేసిన నిస్సహాయ ప్రయత్నం ఈ కథలు. ఊరి కథలు, ఇంటి కథలు, కులం కథలు ఇలా ఏ కథలు ఎవరైనా రాయవచ్చు. కానీ వాడల్లోని యువకుడు, తండాలోని యువకుడు తన ఇంటి కథలు, వాడ కథలు రాశాడంటే జాగర్తగా వాటిని మనం అర్థం చేసుకోవాలి. అవి కేవలం జ్ఞాపకాలు కాదని...........................© 2017,www.logili.com All Rights Reserved.