మనం కూచున్న చోట కూచున్నట్టుగా ఉన్నా మన శరీరంలో రక్తం ప్రయాణం చేస్తూనే ఉంటుంది. చిత్తం తలంపు ఉన్న చోటుకల్లా చేరుకుంటూనే ఉంటుంది.
ఒకటి భౌతికమైనది. మరోటి అభౌతికమైనది.
బాహ్యంగా కూడా మనం చేసే భౌతిక, అభౌతిక ప్రయాణానుభవాల సారం ఎలాంటి ఇంగితం ఇస్తుందనే దాని మీద జీవన కఠిన సందర్భాలలో మన పట్టు విడుపులకు ఆస్కారం దొరుకుతుంది.
మనిషి పాదాల నిర్మాణం, మట్టి మెత్తని స్వభావం ఈ జగతి ప్రయాణానికి అనుకూలంగా ఉందని సంకేతం ఇచ్చాయి. మనిషి కదలడం, ప్రయాణం కట్టడం అతడికి మోదాన్ని, ప్రమాదాన్ని తెచ్చి పెట్టాయి. మనిషి ప్రయాణం నాగరికతను నిర్మిం చింది. కలగలుపు సమాజాలను ఏర్పరచింది. మతాల వ్యాప్తికి కారకమైంది. జాతులు నిర్మూలనకు హేతువైంది. బండి చక్రం కనిపెట్టడం పురోభివృద్ధికీ అదే సమయంలో ఆధిపత్య స్థాపనకూ మార్గం చూపింది. యుద్ధ భటులూ, యుద్ధ పరికరాలూ ఎంత దూరం ప్రయాణించి లక్ష్యాన్ని చేరుకోగలవు అనే దాని మీదే నేటికీ ప్రపంచాధిపత్యం ఆధారపడి ఉంది....................
సంపాదకుని మాట చలన ఇంగితం మనం కూచున్న చోట కూచున్నట్టుగా ఉన్నా మన శరీరంలో రక్తం ప్రయాణం చేస్తూనే ఉంటుంది. చిత్తం తలంపు ఉన్న చోటుకల్లా చేరుకుంటూనే ఉంటుంది. ఒకటి భౌతికమైనది. మరోటి అభౌతికమైనది. బాహ్యంగా కూడా మనం చేసే భౌతిక, అభౌతిక ప్రయాణానుభవాల సారం ఎలాంటి ఇంగితం ఇస్తుందనే దాని మీద జీవన కఠిన సందర్భాలలో మన పట్టు విడుపులకు ఆస్కారం దొరుకుతుంది. మనిషి పాదాల నిర్మాణం, మట్టి మెత్తని స్వభావం ఈ జగతి ప్రయాణానికి అనుకూలంగా ఉందని సంకేతం ఇచ్చాయి. మనిషి కదలడం, ప్రయాణం కట్టడం అతడికి మోదాన్ని, ప్రమాదాన్ని తెచ్చి పెట్టాయి. మనిషి ప్రయాణం నాగరికతను నిర్మిం చింది. కలగలుపు సమాజాలను ఏర్పరచింది. మతాల వ్యాప్తికి కారకమైంది. జాతులు నిర్మూలనకు హేతువైంది. బండి చక్రం కనిపెట్టడం పురోభివృద్ధికీ అదే సమయంలో ఆధిపత్య స్థాపనకూ మార్గం చూపింది. యుద్ధ భటులూ, యుద్ధ పరికరాలూ ఎంత దూరం ప్రయాణించి లక్ష్యాన్ని చేరుకోగలవు అనే దాని మీదే నేటికీ ప్రపంచాధిపత్యం ఆధారపడి ఉంది....................© 2017,www.logili.com All Rights Reserved.