భావాలని వ్యక్తం చెయ్యడానికి మనిషి భాష వాడుతాడు. భాషతో పాటు ఎన్నో చిత్రాలను, ఆకృతులని భావవ్యక్తీకరణ కోసం వాడడం జరుగుతుంది. మూడు గీతలు ఒక బిందువులో కలిసినట్టు ఉండే ‘మెర్సిడెస్' కారు కంపెనీ చిహ్నం. అలాగే, ఐదు వృత్తాలు కలిసినట్టు ఉండే ఒలింపిక్స్ చిహ్నం ఆ కోవకి చెందినవే. అవి ఒక వస్తువుకి, లేదా భావనకి దృశ్యరూపాలు. United Nations అనే పదావళికి ఏ విధంగా UN అనేది సంక్షిప్త రూపమో, అదే విధంగా పైన చెప్పుకున్న చిహ్నాలు (signs) ఒక కంపెనీనో, ఒక సంస్థనో, వస్తువునో సూచించే సంక్షిప్త చిహ్నాలు. అవి ప్రతీకలు (symbols) కావు. 'ప్రతీక' అన్న పదాన్ని నేను పూర్తిగా భిన్నమైన రీతిలో, ఒక ప్రత్యేక అర్థంతో వాడుతున్నాను.
ప్రతీక అనేది ఒక పదం కావచ్చు, ఓ చిత్రం కావచ్చు. దానికి సామాన్య వ్యావహారిక ప్రపంచంలో ఓ అర్థం, ఓ బాహ్యార్థం ఉంటుంది. అది కాకుండా ఆ పదానికి, లేదా చిత్రానికి మరో రహస్యమైన, గూడార్థం కూడా ఉంటుంది. గ్రీకు దేశంలో క్రీట్ (Crete) ప్రాంతానికి చెందిన స్మారక చిహ్నాలనే తీసుకుంటే ఎన్నో సందర్భాలలో మనకి బాడిస (adze) అనే చిహ్నం కనిపిస్తుంది. ఇది మనకి బాగా తెలిసిన ఓ సామాన్య పనిముట్టు. కాని ఆ వస్తువు ఈ సందర్భంలో మరేదో వాస్తవానికి ప్రతీకగా నిలుస్తోంది.
అలాగే నాకు తెలిసిన ఓ భారతీయుడు ఒకసారి ఇంగ్లండు సందర్శించి తిరిగి ఇండియాకి వెళ్లి ఇంగ్లండులో మనుషులు జంతువులని పూజిస్తారని చెప్పాడు. ఎందుకంటే అతగాడు ఇంగ్లండ్ లో ఎన్నో పాతకాలపు చర్చిలలో డేగలు, సింహాలు, ఎద్దులు మొదలైన జంతువుల బొమ్మలు చూశాడు. అతడికి తెలియనిది ఏంటంటే ఈ జంతువులు ఎవాంజెలిస్ట్లకి ప్రతీకలు. క్రైస్తవ సాంప్రదాయంలో ఎవాంజెలిస్ట్ లు నలుగురు. వాళ్లు మాథ్యూ, మార్క్, ల్యూక్, జాన్. వీరిలో మాథ్యూని మానవ రూపంలోను, మార్క్ని సింహం రూపంలోను, ల్యూక్ని ఎద్దు రూపం లోను, జాన్ని డేగ రూపంలోను వ్యక్తం చెయ్యడం పరిపాటి. ఇంచుమించు ఇదే విధంగా జంతువులని...........................
అచేతన పట్ల ఒక అవగాహన కలల ప్రాధాన్యత భావాలని వ్యక్తం చెయ్యడానికి మనిషి భాష వాడుతాడు. భాషతో పాటు ఎన్నో చిత్రాలను, ఆకృతులని భావవ్యక్తీకరణ కోసం వాడడం జరుగుతుంది. మూడు గీతలు ఒక బిందువులో కలిసినట్టు ఉండే ‘మెర్సిడెస్' కారు కంపెనీ చిహ్నం. అలాగే, ఐదు వృత్తాలు కలిసినట్టు ఉండే ఒలింపిక్స్ చిహ్నం ఆ కోవకి చెందినవే. అవి ఒక వస్తువుకి, లేదా భావనకి దృశ్యరూపాలు. United Nations అనే పదావళికి ఏ విధంగా UN అనేది సంక్షిప్త రూపమో, అదే విధంగా పైన చెప్పుకున్న చిహ్నాలు (signs) ఒక కంపెనీనో, ఒక సంస్థనో, వస్తువునో సూచించే సంక్షిప్త చిహ్నాలు. అవి ప్రతీకలు (symbols) కావు. 'ప్రతీక' అన్న పదాన్ని నేను పూర్తిగా భిన్నమైన రీతిలో, ఒక ప్రత్యేక అర్థంతో వాడుతున్నాను. ప్రతీక అనేది ఒక పదం కావచ్చు, ఓ చిత్రం కావచ్చు. దానికి సామాన్య వ్యావహారిక ప్రపంచంలో ఓ అర్థం, ఓ బాహ్యార్థం ఉంటుంది. అది కాకుండా ఆ పదానికి, లేదా చిత్రానికి మరో రహస్యమైన, గూడార్థం కూడా ఉంటుంది. గ్రీకు దేశంలో క్రీట్ (Crete) ప్రాంతానికి చెందిన స్మారక చిహ్నాలనే తీసుకుంటే ఎన్నో సందర్భాలలో మనకి బాడిస (adze) అనే చిహ్నం కనిపిస్తుంది. ఇది మనకి బాగా తెలిసిన ఓ సామాన్య పనిముట్టు. కాని ఆ వస్తువు ఈ సందర్భంలో మరేదో వాస్తవానికి ప్రతీకగా నిలుస్తోంది. అలాగే నాకు తెలిసిన ఓ భారతీయుడు ఒకసారి ఇంగ్లండు సందర్శించి తిరిగి ఇండియాకి వెళ్లి ఇంగ్లండులో మనుషులు జంతువులని పూజిస్తారని చెప్పాడు. ఎందుకంటే అతగాడు ఇంగ్లండ్ లో ఎన్నో పాతకాలపు చర్చిలలో డేగలు, సింహాలు, ఎద్దులు మొదలైన జంతువుల బొమ్మలు చూశాడు. అతడికి తెలియనిది ఏంటంటే ఈ జంతువులు ఎవాంజెలిస్ట్లకి ప్రతీకలు. క్రైస్తవ సాంప్రదాయంలో ఎవాంజెలిస్ట్ లు నలుగురు. వాళ్లు మాథ్యూ, మార్క్, ల్యూక్, జాన్. వీరిలో మాథ్యూని మానవ రూపంలోను, మార్క్ని సింహం రూపంలోను, ల్యూక్ని ఎద్దు రూపం లోను, జాన్ని డేగ రూపంలోను వ్యక్తం చెయ్యడం పరిపాటి. ఇంచుమించు ఇదే విధంగా జంతువులని...........................© 2017,www.logili.com All Rights Reserved.