పదో నంబర్ మైలురాయి
“హా... దిగాలి... దిగాలి.. పదవ నంబర్ మైలురాయి” అన్నాడు కండక్టర్.
అతను టిక్కెట్లు కొట్టే దానితో బస్సులోని గుండ్రని ఇనుము రాడ్డుపై 'ట్రింగ్ డిడ్డింగ్'మని లయబద్ధమైన శబ్దం వొచ్చింది.
ఆ శబ్దానికి డ్రైవరు బస్సాపేడు.
అయినా సరే మళ్ళీ " ఆపాపు ..” అన్నాడు గట్టిగా.
“రై..రై..” అన్నాడు చివరగా.
ఏదో డిటెక్టివ్ కథల్లో టైటిల్లా వుంది మన ఊరి పేరు అనుకున్నాడు జగపతి.
నవంబర్ చలికాలం, పొద్దుటి పదింటికాడ ఎండ హాయిగా వుంది.
బస్సులోంచి ఆదరా బాదరా ఇద్దరూ దిగారు.
ఆ బస్సు వెళ్ళిపోయాక చూస్తే రోడ్డంతా ఖాళీ.
రోడ్డు కూడా ఇంత అందంగా ఉంటుందా అటు ఇటు తాటిచెట్లతో అనుకున్నాడు. జగపతికి పద్నాలుగేళ్ళు.
అతను ఇందాక కండక్టర్ అరచిన పదవ మైలు రాయి ఎక్కడుందా అని చూసాడు. అది రోడ్డుకు దిగువగా, కిందకు కుంగి పోయి వుంది. దాని చుట్టూ టచ్ మీ నాట్ మొక్కలు.
పరిగెత్తుకు వెళ్లి వాటితో ఆడటం మొదలు పెట్టాడు 'అబ్బా.. ఆహా' అనుకుంటా.
'బాబూ.. జగపతి .. వెళ్లాం రావయ్యా నాయనా " అని సున్నాలేసేవాడు కేకేశాడు.
పదో నంబర్ మైలురాయి “హా... దిగాలి... దిగాలి.. పదవ నంబర్ మైలురాయి” అన్నాడు కండక్టర్. అతను టిక్కెట్లు కొట్టే దానితో బస్సులోని గుండ్రని ఇనుము రాడ్డుపై 'ట్రింగ్ డిడ్డింగ్'మని లయబద్ధమైన శబ్దం వొచ్చింది. ఆ శబ్దానికి డ్రైవరు బస్సాపేడు. అయినా సరే మళ్ళీ " ఆపాపు ..” అన్నాడు గట్టిగా. “రై..రై..” అన్నాడు చివరగా. ఏదో డిటెక్టివ్ కథల్లో టైటిల్లా వుంది మన ఊరి పేరు అనుకున్నాడు జగపతి. నవంబర్ చలికాలం, పొద్దుటి పదింటికాడ ఎండ హాయిగా వుంది. బస్సులోంచి ఆదరా బాదరా ఇద్దరూ దిగారు. ఆ బస్సు వెళ్ళిపోయాక చూస్తే రోడ్డంతా ఖాళీ. రోడ్డు కూడా ఇంత అందంగా ఉంటుందా అటు ఇటు తాటిచెట్లతో అనుకున్నాడు. జగపతికి పద్నాలుగేళ్ళు. అతను ఇందాక కండక్టర్ అరచిన పదవ మైలు రాయి ఎక్కడుందా అని చూసాడు. అది రోడ్డుకు దిగువగా, కిందకు కుంగి పోయి వుంది. దాని చుట్టూ టచ్ మీ నాట్ మొక్కలు. పరిగెత్తుకు వెళ్లి వాటితో ఆడటం మొదలు పెట్టాడు 'అబ్బా.. ఆహా' అనుకుంటా. 'బాబూ.. జగపతి .. వెళ్లాం రావయ్యా నాయనా " అని సున్నాలేసేవాడు కేకేశాడు.© 2017,www.logili.com All Rights Reserved.