జిద్దు
పటేలా...నమస్తే
నా సంగతి నీకు తెలుసుగదా పటేలా. మంచి మాటకు మంచోన్ని. ఒక్కసారి మనుసునొచ్చిందనుకో... బంగారు కిరీటాలు పెడుతునన్నా తలదిప్పి సూడ. అంత జిడ్డుగాణ్ణి. ఎందుకు చెబుతున్ననంటే మొన్న పంచాది జరుగలేదా, దాని గురించి పటేలా.
నేను అవద్దం మాట్లాడిన్నా? నిజమే మాట్లాడిన గదా! అందుకే పటేలుతోని సవాలు జేసిన. నువ్వు మసీదు ఎక్కుతవా నన్ను ఎక్కుమంటావా అని. ఇది తప్పంటవా పటేలా! తప్పయితే చెప్పుతోని గొట్టు.
నువ్వు అనుకుంటుండచ్చు, 'పక్కీరోనికి ఇంతకావురమా... ఊరి ఉప సర్పంచి మసీదు ఎక్కుమంటాడా?' అని. భూమయ్య పటేలు ఉపసర్పంచ్ గావచ్చు. ఐతే నాకేంది. పటేలుగానీ, రుస్తుంగానీ, అందరూ ఒక్కటే. ఎట్లన్నా నా మాటనే నడుస్తదని అవద్దమాడితే నేను ఊకుంటనా?
నువ్వేగాదు పటేలా... ఐదారుగురు ఇట్లనే అన్నరు.
'అడుక్కతినే కుక్కవు. నీకు ఎంత ఓపిక ఉండాలెరా,' అన్నరు. అసలు సంగతి తెలిస్తే ఎవలూ అట్ల అనరు. నేను ఎంత ఓపిక పట్టిన. ఎంత బాదపడ్డా అన్నది చెప్పితే గదా తెలిసేది.
అసలు ఏం జరిగిందో తెలుసునా పటేలా! మా సంగతి తెలుసుగదా. మేము ఐదుగురు అన్నదమ్ములం. ఇద్దరు బొంబాయిలున్నరు. ముగ్గురం ఊర్ల ఉన్నం. మేము మొల్లలమని తెలుసుగదా. పీరీల పండుగు మేమే జేస్తం. మాకు ఇనాం భూములున్నయా? పడావు భూములున్నయా?... ఊరితోనే బతుకాయె. ఊ...............................
జిద్దు పటేలా...నమస్తే నా సంగతి నీకు తెలుసుగదా పటేలా. మంచి మాటకు మంచోన్ని. ఒక్కసారి మనుసునొచ్చిందనుకో... బంగారు కిరీటాలు పెడుతునన్నా తలదిప్పి సూడ. అంత జిడ్డుగాణ్ణి. ఎందుకు చెబుతున్ననంటే మొన్న పంచాది జరుగలేదా, దాని గురించి పటేలా. నేను అవద్దం మాట్లాడిన్నా? నిజమే మాట్లాడిన గదా! అందుకే పటేలుతోని సవాలు జేసిన. నువ్వు మసీదు ఎక్కుతవా నన్ను ఎక్కుమంటావా అని. ఇది తప్పంటవా పటేలా! తప్పయితే చెప్పుతోని గొట్టు. నువ్వు అనుకుంటుండచ్చు, 'పక్కీరోనికి ఇంతకావురమా... ఊరి ఉప సర్పంచి మసీదు ఎక్కుమంటాడా?' అని. భూమయ్య పటేలు ఉపసర్పంచ్ గావచ్చు. ఐతే నాకేంది. పటేలుగానీ, రుస్తుంగానీ, అందరూ ఒక్కటే. ఎట్లన్నా నా మాటనే నడుస్తదని అవద్దమాడితే నేను ఊకుంటనా? నువ్వేగాదు పటేలా... ఐదారుగురు ఇట్లనే అన్నరు. 'అడుక్కతినే కుక్కవు. నీకు ఎంత ఓపిక ఉండాలెరా,' అన్నరు. అసలు సంగతి తెలిస్తే ఎవలూ అట్ల అనరు. నేను ఎంత ఓపిక పట్టిన. ఎంత బాదపడ్డా అన్నది చెప్పితే గదా తెలిసేది. అసలు ఏం జరిగిందో తెలుసునా పటేలా! మా సంగతి తెలుసుగదా. మేము ఐదుగురు అన్నదమ్ములం. ఇద్దరు బొంబాయిలున్నరు. ముగ్గురం ఊర్ల ఉన్నం. మేము మొల్లలమని తెలుసుగదా. పీరీల పండుగు మేమే జేస్తం. మాకు ఇనాం భూములున్నయా? పడావు భూములున్నయా?... ఊరితోనే బతుకాయె. ఊ...............................© 2017,www.logili.com All Rights Reserved.