రేబతి
"ఏమే రేబతీ - రేబీ - నీ మొహంమండా! నిన్ను తగలెయ్య".
కటక్ జిల్లా హరిహరపురం పరగణాలో ఒక చిన్న గ్రామం పాటపురొ. గ్రామం మొదట్లోనే ఒక నాలుగు గదుల ఇల్లు కనిపిస్తుంది. ఇంటికి ఆనుకుని పూరి గడ్డితో నేసిన శాలలో డెంకీ' ఉన్నది. అంగణం మధ్యలో నుయ్యి, ఇంటి బయటకి వీధి ద్వారం, పెరటి వైపుకి ఒక ద్వారం ఉన్నాయి. వీధివైపు గదిలో సాధారణంగా పన్నులు కట్టటానికి వచ్చేవారు కూర్చుంటారు. ఈ ఇల్లు శ్యామబంధు మహంతి ఇల్లు. శ్యామబంధు మహంతి జమీందార్ నియమించిన గ్రామ కరణం. అతడికి నెల జీతం రెండు రూపాయలు. ఇవి కాకుండా పన్నులు కట్టారా లేదా అని ఊళ్ళో తిరుగుతున్నపుడు, ఊళ్లో పెళ్లి పేరంటాలు ఏవో జరిగినపుడు అదనంగా మరో రెండు రూపాయలు దొరుకుతాయి. మొత్తం మీద నెలకి నాలుగు రూపాయలు శ్యామబంధు చేతికి అందుతాయి. సంసారం ఒక రకంగా సాగిపోతోంది. ఒక రకం ఏమిటి? చెప్పాలంటే బాగానే వెళుతోంది. ఇంట్లో అదిలేదు - ఇదిలేదు అనే మాటలు ఏనాడూ వినబడలేదు. పెరట్లో తోటకూర, బచ్చలి మొదలైన ఆకు కూరలే కాకుండా రెండు మునగ చెట్లు కూడా ఉన్నాయి. పశువుల శాలలో రెండు ఆవులు - పాలకీ, చిక్కటి మజ్జిగకీ లోటు లేదు. శ్యామబంధు తల్లి గడ్డి పేడా కలిపి పిడకలు చేసి ఎండబెడుతుంది. పొయ్యిలో వంటచెరకు లేదని బాధ లేదు. జమీందార్ మూడున్నర ఎకరాలు వ్యవసాయం చేసుకోమని ఇచ్చాడు. డబ్బు చేతిలో అంత ఆడకపోయినా ఇవాళ డబ్బు లేదే అని బాధపడే స్థితి లేదు. శ్యామబంధు చాలా న్యాయబద్ధంగా 1. డెంకీ : భూమిలో దింపిన పెద్ద రోలులో ధాన్యం, బియ్యం, మిరప కాయలు, ఆవాలు, ఉప్పు మొదలైనవి దంచుకోవటానికి పెద్ద రోకలిని, దానికి పెద్ద పొడుగాటి కొయ్యబల్లని సిద్ధం చేస్తారు. కొయ్యబల్ల మీద కాలువేసి తొక్కుతుంటే రోకలి ద్వారా రోట్లో అన్నీ కావలసిన విధంగా సిద్ధమౌతాయి..................
రేబతి "ఏమే రేబతీ - రేబీ - నీ మొహంమండా! నిన్ను తగలెయ్య". కటక్ జిల్లా హరిహరపురం పరగణాలో ఒక చిన్న గ్రామం పాటపురొ. గ్రామం మొదట్లోనే ఒక నాలుగు గదుల ఇల్లు కనిపిస్తుంది. ఇంటికి ఆనుకుని పూరి గడ్డితో నేసిన శాలలో డెంకీ' ఉన్నది. అంగణం మధ్యలో నుయ్యి, ఇంటి బయటకి వీధి ద్వారం, పెరటి వైపుకి ఒక ద్వారం ఉన్నాయి. వీధివైపు గదిలో సాధారణంగా పన్నులు కట్టటానికి వచ్చేవారు కూర్చుంటారు. ఈ ఇల్లు శ్యామబంధు మహంతి ఇల్లు. శ్యామబంధు మహంతి జమీందార్ నియమించిన గ్రామ కరణం. అతడికి నెల జీతం రెండు రూపాయలు. ఇవి కాకుండా పన్నులు కట్టారా లేదా అని ఊళ్ళో తిరుగుతున్నపుడు, ఊళ్లో పెళ్లి పేరంటాలు ఏవో జరిగినపుడు అదనంగా మరో రెండు రూపాయలు దొరుకుతాయి. మొత్తం మీద నెలకి నాలుగు రూపాయలు శ్యామబంధు చేతికి అందుతాయి. సంసారం ఒక రకంగా సాగిపోతోంది. ఒక రకం ఏమిటి? చెప్పాలంటే బాగానే వెళుతోంది. ఇంట్లో అదిలేదు - ఇదిలేదు అనే మాటలు ఏనాడూ వినబడలేదు. పెరట్లో తోటకూర, బచ్చలి మొదలైన ఆకు కూరలే కాకుండా రెండు మునగ చెట్లు కూడా ఉన్నాయి. పశువుల శాలలో రెండు ఆవులు - పాలకీ, చిక్కటి మజ్జిగకీ లోటు లేదు. శ్యామబంధు తల్లి గడ్డి పేడా కలిపి పిడకలు చేసి ఎండబెడుతుంది. పొయ్యిలో వంటచెరకు లేదని బాధ లేదు. జమీందార్ మూడున్నర ఎకరాలు వ్యవసాయం చేసుకోమని ఇచ్చాడు. డబ్బు చేతిలో అంత ఆడకపోయినా ఇవాళ డబ్బు లేదే అని బాధపడే స్థితి లేదు. శ్యామబంధు చాలా న్యాయబద్ధంగా 1. డెంకీ : భూమిలో దింపిన పెద్ద రోలులో ధాన్యం, బియ్యం, మిరప కాయలు, ఆవాలు, ఉప్పు మొదలైనవి దంచుకోవటానికి పెద్ద రోకలిని, దానికి పెద్ద పొడుగాటి కొయ్యబల్లని సిద్ధం చేస్తారు. కొయ్యబల్ల మీద కాలువేసి తొక్కుతుంటే రోకలి ద్వారా రోట్లో అన్నీ కావలసిన విధంగా సిద్ధమౌతాయి..................© 2017,www.logili.com All Rights Reserved.