గంట నుంచీ ఆమె అలా ఎదురు చూస్తోంది. సీసా కోసం వెళ్లిన అతనింకా తిరిగిరాలేదు. ఎప్పుడూ అర్థ గంటలోగా వచ్చేసేవాడు. ఈరోజెందుకో ఇంత ఆలస్యం చేస్తున్నాడు.
అసహనంగా నిట్టూర్చి మేజా దగ్గరికి నడిచింది. గత దినాల వైభవానికి చిహ్నంగా మిగిలిన గాజు కూజా లోంచి నీళ్ళు వంపుకొంటున్నప్పుడు ఆమె చేతి వేళ్ళు వణికాయి.
గ్లాసు పైకెత్తి గొంతు తడుపుకొనే ప్రయత్నంలో నీళ్ళు తొణికి గుండెల మీద పమిట తడిసింది.
కొంత కాలంగా రోజూ వుదయం పది దాటిం తరువాత చేతుల్లో ఈ వణుకు ప్రారంభమవుతోంది. కిటికీ లోంచి రోడ్డు మీదికి చూసింది. సిటీ బస్ ఆ స్టాపులో ఒక్క నిమిషం ఆగి బయల్దేరింది. అందులోంచి కూడా దిగలేదు అతను. “ఎక్కడ అఘోరిస్తున్నాడో ముసలాడు" చిరాగ్గా ఖాళీ గ్లాసుని మేజామీద గట్టిగా చప్పుడయ్యేలా పెట్టి పక్కనే వున్న పాత సినిమా పత్రిక తిరగేసింది.
ఎవరెవరో కొత్త కొత్త ముఖాలు... వయ్యారీ జాణలు... ఏవేవో సినిమాలు... విసుగ్గా పత్రికని నేలమీదికి విసిరేసింది. "అమ్మగారూ!" గుమ్మంలోంచి కుప్పుసామి పిలుపు. ఒక్క వుదుటున లేచి వెళ్ళింది గుమ్మం దగ్గరికి...................
గంట నుంచీ ఆమె అలా ఎదురు చూస్తోంది. సీసా కోసం వెళ్లిన అతనింకా తిరిగిరాలేదు. ఎప్పుడూ అర్థ గంటలోగా వచ్చేసేవాడు. ఈరోజెందుకో ఇంత ఆలస్యం చేస్తున్నాడు. అసహనంగా నిట్టూర్చి మేజా దగ్గరికి నడిచింది. గత దినాల వైభవానికి చిహ్నంగా మిగిలిన గాజు కూజా లోంచి నీళ్ళు వంపుకొంటున్నప్పుడు ఆమె చేతి వేళ్ళు వణికాయి. గ్లాసు పైకెత్తి గొంతు తడుపుకొనే ప్రయత్నంలో నీళ్ళు తొణికి గుండెల మీద పమిట తడిసింది. కొంత కాలంగా రోజూ వుదయం పది దాటిం తరువాత చేతుల్లో ఈ వణుకు ప్రారంభమవుతోంది. కిటికీ లోంచి రోడ్డు మీదికి చూసింది. సిటీ బస్ ఆ స్టాపులో ఒక్క నిమిషం ఆగి బయల్దేరింది. అందులోంచి కూడా దిగలేదు అతను. “ఎక్కడ అఘోరిస్తున్నాడో ముసలాడు" చిరాగ్గా ఖాళీ గ్లాసుని మేజామీద గట్టిగా చప్పుడయ్యేలా పెట్టి పక్కనే వున్న పాత సినిమా పత్రిక తిరగేసింది. ఎవరెవరో కొత్త కొత్త ముఖాలు... వయ్యారీ జాణలు... ఏవేవో సినిమాలు... విసుగ్గా పత్రికని నేలమీదికి విసిరేసింది. "అమ్మగారూ!" గుమ్మంలోంచి కుప్పుసామి పిలుపు. ఒక్క వుదుటున లేచి వెళ్ళింది గుమ్మం దగ్గరికి...................© 2017,www.logili.com All Rights Reserved.