మన్నవ బాలయ్య జీవనరేఖలు
ఆంధ్రప్రదేశ్లో 'పంచారామాలు' పేరుతో ప్రసిద్ధమైన శైవక్షేత్రాలలో అమరారామం ఒకటి. ఇదే అమరావతి. గుంటూరుజిల్లా అమరావతి బాలయ్య స్వగ్రామం. దాదాపు నూరేళ్ల కిందట ఆ ఊళ్లో పేరొందిన కుటుంబాలలో మన్నవ వారిది కూడా ఒకటి! బాలయ్య తండ్రి గురవయ్య చౌదరి తాత, తండ్రుల కాలంనుంచి జీవనాధారంగా వస్తున్న వ్యవసాయాన్ని నమ్ముకున్నారు. ఆయన సతీమణి అన్నపూర్ణమ్మ భర్తకు అనుకూలవతి అయిన ఇల్లాలు. ఈ దంపతులు పెద్దగా చదువుకోకపోయినా, వారికి సాహిత్యంపట్ల ప్రగాఢాభిమానం ఉండేది. ఆ దంపతులకు ఏడుగురు సంతానం. వారిలో నలుగురు అమ్మాయిలు కాగా ముగ్గురు అబ్బాయిలు. మగసంతానంలో పెద్దవాడు బాలయ్య.
బాలయ్య పుట్టిన తేదీ అతని స్కూలు రికార్డుల ప్రకారం 09.04.1930. బాలయ్యకు తల్లిదండ్రులు పెట్టినపేరు బాలకృష్ణ. కానీ, వారి తాతగారి పేరు 'బాలయ్య' కావడంవల్ల, పెద్దలందరూ ఆయనను గుర్తు చేసుకోవడం కోసం బాలకృష్ణని చిన్నప్పటినుంచీ బాలయ్య అనే పిల్చేవారు. బాలకృష్ణ కూడా పెద్దవాడైనా తాతగారిపేరు పెట్టుకోవడానికి నామోషీ పడలేదు. పైగా తన తాతగారి మీద గౌరవంతో స్కూలు రికార్డులలో కూడా ఆ పేరు కొనసాగించారు. ఏతావాతా అతనికి కాలక్రమంలో బాలయ్య అన్న పేరే స్థిరపడిపోయింది. విద్యాభ్యాసం
ఆనాడు పల్లెటూళ్లలో యింటి పెద్దకొడుకు తండ్రికి వ్యవసాయంలో చేదోడువాదోడుగా ఉండడం అనేది ఆనవాయితీ. అందువల్ల, గురవయ్య, బాలయ్య తనకు పొలంపనుల్లో సాయపడాలని, పెద్దయ్యాక తనలాగే వ్యవసాయదారుడు కావాలని ఎంతగానో కోరుకున్నారు. అయినా, కనీసం లెక్కలు చూసుకునేటంతవరకైనా కొడుకు చదువుకుంటే బాగుంటుందని ఆయన భావించారు. స్వగ్రామంలో చదువుకునేందుకు సరైన సౌకర్యంలేక గురవయ్య కొడుకును చదువు నిమిత్తం చిన్నతనంలోనే వాళ్ల అమ్మమ్మగారి ఊరైన ముక్కామలకు అయితే ఆ ఊళ్లో అంతవరకూ చదువు చెప్తున్న మాష్టారు కొన్నినెలలకే వేరే ఊరికి వెళ్లిపోయాడు. దాంతో బాలయ్య చేసేదిలేక వాళ్లింటికి తిరిగి వచ్చేశారు. ఈసారి గురవయ్య తన ప్రయత్నాన్ని విరమించుకోకుండా, తమ ఊరికి దగ్గరలోనే ఉన్న నరుకుళ్లపాడు అనే ఊరికి తమ కొడుకును పంపించారు. ఆయన ప్రయత్నం ఫలించింది! ఆ ఊళ్లో వేజెండ్ల కొండయ్య అనే మాష్టారు బాలయ్యకు చదువు చెప్పారు. ఆయన చదువులో బాలయ్య..........................
మన్నవ బాలయ్య జీవనరేఖలు ఆంధ్రప్రదేశ్లో 'పంచారామాలు' పేరుతో ప్రసిద్ధమైన శైవక్షేత్రాలలో అమరారామం ఒకటి. ఇదే అమరావతి. గుంటూరుజిల్లా అమరావతి బాలయ్య స్వగ్రామం. దాదాపు నూరేళ్ల కిందట ఆ ఊళ్లో పేరొందిన కుటుంబాలలో మన్నవ వారిది కూడా ఒకటి! బాలయ్య తండ్రి గురవయ్య చౌదరి తాత, తండ్రుల కాలంనుంచి జీవనాధారంగా వస్తున్న వ్యవసాయాన్ని నమ్ముకున్నారు. ఆయన సతీమణి అన్నపూర్ణమ్మ భర్తకు అనుకూలవతి అయిన ఇల్లాలు. ఈ దంపతులు పెద్దగా చదువుకోకపోయినా, వారికి సాహిత్యంపట్ల ప్రగాఢాభిమానం ఉండేది. ఆ దంపతులకు ఏడుగురు సంతానం. వారిలో నలుగురు అమ్మాయిలు కాగా ముగ్గురు అబ్బాయిలు. మగసంతానంలో పెద్దవాడు బాలయ్య. బాలయ్య పుట్టిన తేదీ అతని స్కూలు రికార్డుల ప్రకారం 09.04.1930. బాలయ్యకు తల్లిదండ్రులు పెట్టినపేరు బాలకృష్ణ. కానీ, వారి తాతగారి పేరు 'బాలయ్య' కావడంవల్ల, పెద్దలందరూ ఆయనను గుర్తు చేసుకోవడం కోసం బాలకృష్ణని చిన్నప్పటినుంచీ బాలయ్య అనే పిల్చేవారు. బాలకృష్ణ కూడా పెద్దవాడైనా తాతగారిపేరు పెట్టుకోవడానికి నామోషీ పడలేదు. పైగా తన తాతగారి మీద గౌరవంతో స్కూలు రికార్డులలో కూడా ఆ పేరు కొనసాగించారు. ఏతావాతా అతనికి కాలక్రమంలో బాలయ్య అన్న పేరే స్థిరపడిపోయింది. విద్యాభ్యాసం ఆనాడు పల్లెటూళ్లలో యింటి పెద్దకొడుకు తండ్రికి వ్యవసాయంలో చేదోడువాదోడుగా ఉండడం అనేది ఆనవాయితీ. అందువల్ల, గురవయ్య, బాలయ్య తనకు పొలంపనుల్లో సాయపడాలని, పెద్దయ్యాక తనలాగే వ్యవసాయదారుడు కావాలని ఎంతగానో కోరుకున్నారు. అయినా, కనీసం లెక్కలు చూసుకునేటంతవరకైనా కొడుకు చదువుకుంటే బాగుంటుందని ఆయన భావించారు. స్వగ్రామంలో చదువుకునేందుకు సరైన సౌకర్యంలేక గురవయ్య కొడుకును చదువు నిమిత్తం చిన్నతనంలోనే వాళ్ల అమ్మమ్మగారి ఊరైన ముక్కామలకు అయితే ఆ ఊళ్లో అంతవరకూ చదువు చెప్తున్న మాష్టారు కొన్నినెలలకే వేరే ఊరికి వెళ్లిపోయాడు. దాంతో బాలయ్య చేసేదిలేక వాళ్లింటికి తిరిగి వచ్చేశారు. ఈసారి గురవయ్య తన ప్రయత్నాన్ని విరమించుకోకుండా, తమ ఊరికి దగ్గరలోనే ఉన్న నరుకుళ్లపాడు అనే ఊరికి తమ కొడుకును పంపించారు. ఆయన ప్రయత్నం ఫలించింది! ఆ ఊళ్లో వేజెండ్ల కొండయ్య అనే మాష్టారు బాలయ్యకు చదువు చెప్పారు. ఆయన చదువులో బాలయ్య..........................© 2017,www.logili.com All Rights Reserved.