Realistic Cinema

By Sivalakshmi (Author)
Rs.300
Rs.300

Realistic Cinema
INR
MANIMN4107
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఐసెన్స్టీన్ - సామ్యవాద వాస్తవికత

సాహిత్యం తరువాత సినిమాయే రెండవ వ్యసనంగా నా విద్యార్థి దశ గడిచింది గానీ చిరకాల స్నేహం శివలక్ష్మి వలె నేను సుశిక్షితుడైన సినిమా విమర్శకుడో విశ్లేషకుణ్నో, కనీసం సమీక్షకుణ్నో, పరిచయకర్తనో కాలేకపోయాను. నాకు ఆమె, ఆమె సహచరుడు రామ్మోహన్ చలసాని ప్రసాద్ ద్వారా పరిచయమైన గత ముప్పై మూడేళ్లలో ముఖ్యంగా నేను నలగొండ చౌరస్తా, మలక్పేటలో ఉన్న ఇరవై మూడేళ్లలో నన్ను 'మంచి సినిమా' లో లేదా 'ప్రత్యామ్నాయ సినిమా' లో ప్రవేశపెట్టాలని, నిలపాలని ఆమె చేసిన ఎన్నో ప్రయత్నాలు నా వ్యాపకాల వల్లనే ఫలించలేదు.

ఎమర్జెన్సీ తర్వాత వరంగల్లో జీవన్, శ్రీనివాసరావు, వంటి నా కొలీగ్స్ ప్రయత్నాల వల్ల ఏర్పడిన ఫిల్మ్ సొసైటీలో పట్టుమని పదేళ్లలో కొన్నయినా మంచి సినిమాలు చూడ గలిగానో లేదో. హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్క నన్నూ, నా సహచరినీ ఎన్నోసార్లు తమతో పాటే తీసుకవెళ్లి మంచి సినిమాలు సారథి స్టూడియోలోనో, ఫిల్మ్ ఫెస్టివల్స్లోనో చూపాలనే ఆమె ప్రయత్నాలు బహుశా ఒకటి రెండు మంచి ఇరానియన్ సినిమాలు చూడడం వరకే ఫలించాయి.

ఇపుడింక ఏ అవకాశాలు, ఆకరాలు లేని నా ఈ స్థితిలో ఆమె నన్ను తన సినిమా పరిచయ వ్యాసాల ద్వారా మళ్లీ సినిమా అప్రిసియేషన్ కోర్సులోకి ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నది. అందులోనూ సినిమా ద్వారా కాకున్నా నాకు పరిచయమున్న ప్రత్యామ్నాయ, రాజకీయ, ప్రజాకీయ వాతావరణం వల్లనైనా కొన్ని సినిమా పరిచయ వ్యాసాలు చదివి స్పందించగలనని భావించింది.

శివలక్ష్మికి 'శ్రీశ్రీ రేడియో నాటికలు' పై ఎం.ఫిల్. సిద్ధాంత వ్యాసం రాయవలసిన లేదా శ్రీశ్రీని అధ్యయనం చేయవలసిన సమయంలో చలసాని ప్రసాద్ పరిచయం కావడం తెలుగు పాఠకులు ఎవరైనా ఊహించగలిగేదే. అప్పుడామె టెలిఫోన్ భవన్, ఖైరతాబాదులో టెలిఫోన్ ఆపరేటర్గా పనిచేస్తున్నది. ఆమెకు జీవితం వల్ల, శ్రామిక వృత్తి జీవితం వల్ల, ఉద్యోగ వృత్తి వల్ల కూడ కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చాయి. అట్లా ఆమెకు చలసాని ద్వారా ఒక విశాలమైన వైవిద్యభరితమైన ప్రపంచంతో పరిచయమైంది. అటు ఏలూరు వాడయిన రామ్మోహన్క ఆర్టిస్టు మోహన్తో ఉన్న ఆత్మీయత వల్ల శివలక్ష్మికి కళలు - సాహిత్యం, సినిమాలను ఏ పర్స్పెక్టివ్లో చూడాలనే అవగాహన కలిగింది. ఆమెకు వాటిని ఎట్లా అర్ధం చేసుకొని పరిచయం చేయాలనే నైశిత్వాన్ని కూడ అలవర్చింది. - అని నేననుకుంటాను.

అట్లా ఆమె విరసంకు సన్నిహితురాలైంది. విరసం బయట కూడ ఆమెకు విస్తృత ప్రపంచం ఉన్నది. ముఖ్యంగా ఏ స్త్రీకయినా తన జీవితం చాలు ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడానికి, వ్యాఖ్యానించడానికి. ఆ పని స్త్రీలందరూ చేస్తారు. కొందరి అనుభవాలు, వ్యాఖ్యలు మనదాకా, ఇతరులదాకా చేరక పోవచ్చు. చాలా మందివి అప్రకటితంగానే, అవ్యక్తంగానే ఉండవచ్చు. చాల కొద్ది మందికే అవి నలుగురికి చేర్చే అవకాశాలు రావచ్చు..............

ఐసెన్స్టీన్ - సామ్యవాద వాస్తవికత సాహిత్యం తరువాత సినిమాయే రెండవ వ్యసనంగా నా విద్యార్థి దశ గడిచింది గానీ చిరకాల స్నేహం శివలక్ష్మి వలె నేను సుశిక్షితుడైన సినిమా విమర్శకుడో విశ్లేషకుణ్నో, కనీసం సమీక్షకుణ్నో, పరిచయకర్తనో కాలేకపోయాను. నాకు ఆమె, ఆమె సహచరుడు రామ్మోహన్ చలసాని ప్రసాద్ ద్వారా పరిచయమైన గత ముప్పై మూడేళ్లలో ముఖ్యంగా నేను నలగొండ చౌరస్తా, మలక్పేటలో ఉన్న ఇరవై మూడేళ్లలో నన్ను 'మంచి సినిమా' లో లేదా 'ప్రత్యామ్నాయ సినిమా' లో ప్రవేశపెట్టాలని, నిలపాలని ఆమె చేసిన ఎన్నో ప్రయత్నాలు నా వ్యాపకాల వల్లనే ఫలించలేదు. ఎమర్జెన్సీ తర్వాత వరంగల్లో జీవన్, శ్రీనివాసరావు, వంటి నా కొలీగ్స్ ప్రయత్నాల వల్ల ఏర్పడిన ఫిల్మ్ సొసైటీలో పట్టుమని పదేళ్లలో కొన్నయినా మంచి సినిమాలు చూడ గలిగానో లేదో. హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్క నన్నూ, నా సహచరినీ ఎన్నోసార్లు తమతో పాటే తీసుకవెళ్లి మంచి సినిమాలు సారథి స్టూడియోలోనో, ఫిల్మ్ ఫెస్టివల్స్లోనో చూపాలనే ఆమె ప్రయత్నాలు బహుశా ఒకటి రెండు మంచి ఇరానియన్ సినిమాలు చూడడం వరకే ఫలించాయి. ఇపుడింక ఏ అవకాశాలు, ఆకరాలు లేని నా ఈ స్థితిలో ఆమె నన్ను తన సినిమా పరిచయ వ్యాసాల ద్వారా మళ్లీ సినిమా అప్రిసియేషన్ కోర్సులోకి ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నది. అందులోనూ సినిమా ద్వారా కాకున్నా నాకు పరిచయమున్న ప్రత్యామ్నాయ, రాజకీయ, ప్రజాకీయ వాతావరణం వల్లనైనా కొన్ని సినిమా పరిచయ వ్యాసాలు చదివి స్పందించగలనని భావించింది. శివలక్ష్మికి 'శ్రీశ్రీ రేడియో నాటికలు' పై ఎం.ఫిల్. సిద్ధాంత వ్యాసం రాయవలసిన లేదా శ్రీశ్రీని అధ్యయనం చేయవలసిన సమయంలో చలసాని ప్రసాద్ పరిచయం కావడం తెలుగు పాఠకులు ఎవరైనా ఊహించగలిగేదే. అప్పుడామె టెలిఫోన్ భవన్, ఖైరతాబాదులో టెలిఫోన్ ఆపరేటర్గా పనిచేస్తున్నది. ఆమెకు జీవితం వల్ల, శ్రామిక వృత్తి జీవితం వల్ల, ఉద్యోగ వృత్తి వల్ల కూడ కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చాయి. అట్లా ఆమెకు చలసాని ద్వారా ఒక విశాలమైన వైవిద్యభరితమైన ప్రపంచంతో పరిచయమైంది. అటు ఏలూరు వాడయిన రామ్మోహన్క ఆర్టిస్టు మోహన్తో ఉన్న ఆత్మీయత వల్ల శివలక్ష్మికి కళలు - సాహిత్యం, సినిమాలను ఏ పర్స్పెక్టివ్లో చూడాలనే అవగాహన కలిగింది. ఆమెకు వాటిని ఎట్లా అర్ధం చేసుకొని పరిచయం చేయాలనే నైశిత్వాన్ని కూడ అలవర్చింది. - అని నేననుకుంటాను. అట్లా ఆమె విరసంకు సన్నిహితురాలైంది. విరసం బయట కూడ ఆమెకు విస్తృత ప్రపంచం ఉన్నది. ముఖ్యంగా ఏ స్త్రీకయినా తన జీవితం చాలు ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడానికి, వ్యాఖ్యానించడానికి. ఆ పని స్త్రీలందరూ చేస్తారు. కొందరి అనుభవాలు, వ్యాఖ్యలు మనదాకా, ఇతరులదాకా చేరక పోవచ్చు. చాలా మందివి అప్రకటితంగానే, అవ్యక్తంగానే ఉండవచ్చు. చాల కొద్ది మందికే అవి నలుగురికి చేర్చే అవకాశాలు రావచ్చు..............

Features

  • : Realistic Cinema
  • : Sivalakshmi
  • : Kuhoo Virasam Prachuranalu
  • : MANIMN4107
  • : paparback
  • : Jan, 2023
  • : 257
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Realistic Cinema

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam