Na Hollywood Dairy Part 1

By Sridevi Muralidar (Author)
Rs.525
Rs.525

Na Hollywood Dairy Part 1
INR
MANIMN5215
In Stock
525.0
Rs.525


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ది కిడ్ (1921)

ఛార్లీ చాప్లిన్గా సుప్రసిద్ధుడైన సర్ ఛార్లెస్ స్పెన్సర్ ఛాప్లిన్ (1889-1977) ఒక బ్రిటిష్ హాస్యకళాకారుడు, నిర్మాత, రచయిత, దర్శకుడు, సంగీతదర్శకుడు. ఇతడు చలనచిత్ర చరిత్రలోనే అత్యంత ప్రముఖుడైన హాస్యకళాకారుడిగా, విశిష్ట దర్శకుడిగా నిలిచిపోయాడు. ఛాప్లిన్ ఒక మంచి గేయరచయిత కూడా. తన చిత్రాల కోసం ఎన్నెన్నో చక్కటి పాటలను రాసి, బాణీలు కట్టి నేపథ్యసంగీతం సమకూర్చాడు. తన చిత్రాలను తానే నిర్మించి, దర్శకత్వం వహించాడు.

ఛాప్లిన్ తాడు, బొంగరం లేని 'దేశదిమ్మరి' (ఆవారా, ది ట్రాంప్, The Tramp) పాత్రను తన మూకీ చిత్రాలలో అత్యద్భుతంగా పోషించాడు. నిరుపేద, ఒంటరి అయినా ఈ దేశదిమ్మరి అన్ని క్లిష్ట పరిస్థితులను తట్టుకుని నిలబడే గుండెధైర్యం కలవాడు. ఎప్పటికప్పుడు తనకు ఎదురైన కడగళ్ళను మరచి జీవితంలో కొత్త సాహసయాత్రల దిశగా ప్రయాణం చేస్తాడు. ప్రపంచ ప్రజలంతా ఈ 'దేశదిమ్మరి' మౌనభాషను అర్థం చేసుకుని అతడిని ప్రేమించారు. అతడి సాహసాలలో తోడున్నారు, అతడి అమాయకత్వాన్ని, వినయాన్ని, కష్టాలను అధిగమించే నేర్పును చూచి మనస్ఫూర్తిగా ఆనందించారు. నిరుపేదలు అతడిలో తమ ప్రతిబింబాన్ని చూసుకుని ఓదార్పు పొందారు.

ఛాప్లిన్ నిర్మించిన చిత్రాలలో అత్యుత్తమ చిత్రంగా పేరు పొందినది 'ది కిడ్'. ఈ చిత్రం అతడు తన నిజజీవితంలో ఎదుర్కొన్న గొప్ప విషాదం నుండి, వ్యక్తిగత సంక్షోభం నుండి రూపుదిద్దుకుంది. అతడి భార్య పూర్తిగా ఎదగని బిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువు మూడు రోజులకు మృతి చెందింది. ఈ విషాదం ఛాప్లిన్కి ఎంతో దుఃఖాన్ని, తీవ్ర సంక్షోభాన్ని కలిగించింది. కళాకారుడి సృజనాత్మక చేతన ఎందుకు, ఎప్పుడు.........................

ది కిడ్ (1921) ఛార్లీ చాప్లిన్గా సుప్రసిద్ధుడైన సర్ ఛార్లెస్ స్పెన్సర్ ఛాప్లిన్ (1889-1977) ఒక బ్రిటిష్ హాస్యకళాకారుడు, నిర్మాత, రచయిత, దర్శకుడు, సంగీతదర్శకుడు. ఇతడు చలనచిత్ర చరిత్రలోనే అత్యంత ప్రముఖుడైన హాస్యకళాకారుడిగా, విశిష్ట దర్శకుడిగా నిలిచిపోయాడు. ఛాప్లిన్ ఒక మంచి గేయరచయిత కూడా. తన చిత్రాల కోసం ఎన్నెన్నో చక్కటి పాటలను రాసి, బాణీలు కట్టి నేపథ్యసంగీతం సమకూర్చాడు. తన చిత్రాలను తానే నిర్మించి, దర్శకత్వం వహించాడు. ఛాప్లిన్ తాడు, బొంగరం లేని 'దేశదిమ్మరి' (ఆవారా, ది ట్రాంప్, The Tramp) పాత్రను తన మూకీ చిత్రాలలో అత్యద్భుతంగా పోషించాడు. నిరుపేద, ఒంటరి అయినా ఈ దేశదిమ్మరి అన్ని క్లిష్ట పరిస్థితులను తట్టుకుని నిలబడే గుండెధైర్యం కలవాడు. ఎప్పటికప్పుడు తనకు ఎదురైన కడగళ్ళను మరచి జీవితంలో కొత్త సాహసయాత్రల దిశగా ప్రయాణం చేస్తాడు. ప్రపంచ ప్రజలంతా ఈ 'దేశదిమ్మరి' మౌనభాషను అర్థం చేసుకుని అతడిని ప్రేమించారు. అతడి సాహసాలలో తోడున్నారు, అతడి అమాయకత్వాన్ని, వినయాన్ని, కష్టాలను అధిగమించే నేర్పును చూచి మనస్ఫూర్తిగా ఆనందించారు. నిరుపేదలు అతడిలో తమ ప్రతిబింబాన్ని చూసుకుని ఓదార్పు పొందారు. ఛాప్లిన్ నిర్మించిన చిత్రాలలో అత్యుత్తమ చిత్రంగా పేరు పొందినది 'ది కిడ్'. ఈ చిత్రం అతడు తన నిజజీవితంలో ఎదుర్కొన్న గొప్ప విషాదం నుండి, వ్యక్తిగత సంక్షోభం నుండి రూపుదిద్దుకుంది. అతడి భార్య పూర్తిగా ఎదగని బిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువు మూడు రోజులకు మృతి చెందింది. ఈ విషాదం ఛాప్లిన్కి ఎంతో దుఃఖాన్ని, తీవ్ర సంక్షోభాన్ని కలిగించింది. కళాకారుడి సృజనాత్మక చేతన ఎందుకు, ఎప్పుడు.........................

Features

  • : Na Hollywood Dairy Part 1
  • : Sridevi Muralidar
  • : Sridevi Muralidar
  • : MANIMN5215
  • : paparback
  • : Aug, 2020
  • : 346
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Na Hollywood Dairy Part 1

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam