I. V. S. Achyutavalli Navala Sahityam

By K B Lakshmi (Author)
Rs.80
Rs.80

I. V. S. Achyutavalli Navala Sahityam
INR
EMESCO0655
In Stock
80.0
Rs.80


In Stock
Ships in 4 - 15 Days
Check for shipping and cod pincode

Description

      నవలా ప్రక్రియలో రచనా వ్యక్తిత్వం నిరూపించుకున్న అచ్యుతవల్లి సమకాలీన సమస్యలను ఇతి వృత్తాలుగా చేసుకుని, సామాజిక స్పృహతో పరమ పఠనీయమైన కథాకథనంతో స్త్రీ చైతన్య సంఘర్షణకు అద్దం పట్టే పాత్రలను సృష్టించారు. స్త్రీవాద సిద్ధాంత రాద్ధాంతాలు తెలీని రోజుల్లో 1979 లో వచ్చిన అచ్యుతవల్లి కోరిక నవలలోని సంగీతపాత్ర, భ్రమరగీతంలోని సంగీతపాత్ర ఈనాటి నీనాగుప్తా వంటి అతివాద వ్యక్తిత్వాలకు ప్రతీకగా నిలవడం గమనార్హం. అలాగే నిమ్నవర్గ పక్షపాతంతో కూడిన దళితవాదం స్వాతంత్ర్యo సంతరించిన సరికొత్త విలువలతో కొడిగట్టిన దీపాలు, నేను దేవిని కాను నవలల్తో పాఠకుల్ని ఓ ఊపు ఊపింది.

       అచ్యుతవల్లి రచనాకాలంలో చలం, గోపీచంద్, అడవి బాపిరాజు, బుచ్చిబాబు, రావిశాస్త్రి, కొమ్మూరి వేణుగోపాలరావు, బలివాడ కాంతారావు, గొల్లపూడి మారుతీరావు, ఇచ్ఛాపురపు జగన్నాధరావు, సింగరాజు లింగమూర్తి, తదితర రచయితలు మధ్యతరగతి జీవితాల సమస్యలను తమ తమ నవలల్లో ప్రతిభావంతంగా చిత్రీకరించారు.

       అయితే రచయిత్రులు విద్యావంతులై ఉద్యోగం చేసే మహిళలు ఎదుర్కొనే సమస్యలను కథావస్తువుగా స్వీకరించారు. ఈ నవలలు ప్రజాజీవితాలపై ప్రభావం చూపడం ప్రారంభించాయి. వీరందరిలో ఐ.వి.యస్. అచ్యుతవల్లిగారి 'టోన్' చాలా బలమైనది. కేవలం మధ్యతరగతి కన్నీళ్ళని, కష్టాల్ని ఉటంకించి వదిలేయకుండా ఆ నేపధ్యంలో యువతీయువకుల జీవన విధానం, మనస్తత్వం, సమస్యల పట్ల ప్రత్యేక దృష్టితో రచనలు చేశారు. మధ్యతరగతి స్త్రీల పట్ల ప్రగాఢ సానుభూతిని కలుగజేస్తాయి ఈమె రచనలు. స్త్రీపురుషులు సమానమన్న ధోరణి ప్రతి నవలలో కనిపిస్తుంది. సహజమైన సంఘటనలను, పాత్రలను తీసుకుని పదునైన భాషలో నిర్భీతిగా ఈమె రచనలు చేసారు.    

       బహుముఖ ప్రజ్ఞాశాలి, విదూషీమణి అయిన అచ్యుతవల్లి నవలల సమగ్ర పరిశీలనావశ్యతను విశ్లేషనాత్మకంగా విశదీకరించడమే నా పరిశోధన. అచ్యుతవల్లి నవలా సాహిత్యంపై ఇది తొలి సిద్ధాంత వ్యాసం. ఈ సిద్ధాంత వ్యాసం మొదటి అధ్యాయంలో సిద్ధాంత వ్యాస రచనా మర్యాదను అనుసరించి తెలుగు నవలా పరిచయం జరిగింది. రెండో అధ్యాయంలో 1960వ దశకంలో తెలుగు నవలా రచనలో వచ్చిన ఆకస్మిక మార్పులు, అశేషంగా, అనివార్యంగా పెరిగిన పత్రికల, రచయిత్రుల సంఖ్య, పాఠకుల అభిరుచులను ప్రస్తావిస్తూ ఆనాటి తెలుగు నవల స్థితిగతులను తెలియజేయడం జరిగింది. మూడో అధ్యాయంలో అచ్యుతవల్లి నవలల పరిచయం జరిగింది. సామజిక న్యాయం ఈమె నవలల ఆశయం. నాల్గవ అధ్యాయంలో వస్తు వైవిధ్యం - ఇతివృత్త నిర్వహణ గురించి విశ్లేషణ జరిగింది. ఐ.వి.యస్. అచ్యుతవల్లి నవలల్లోని పాత్ర చిత్రణ - ప్రాముఖ్యతను గురించిన విశ్లేషణ ఐదో అధ్యాయంలో చేయడం జరిగింది. ఆరో అధ్యాయంలో ఆమె నవలల్లోని భాషా శైలి - శిల్పంల గురించి వివరణ, నవలల నేపధ్యం, వాతావరణాల పరిశీలన గురించిన చర్చజరిగింది.

                                                                                                                   - డా.కె.బి.లక్ష్మీ  

       

      నవలా ప్రక్రియలో రచనా వ్యక్తిత్వం నిరూపించుకున్న అచ్యుతవల్లి సమకాలీన సమస్యలను ఇతి వృత్తాలుగా చేసుకుని, సామాజిక స్పృహతో పరమ పఠనీయమైన కథాకథనంతో స్త్రీ చైతన్య సంఘర్షణకు అద్దం పట్టే పాత్రలను సృష్టించారు. స్త్రీవాద సిద్ధాంత రాద్ధాంతాలు తెలీని రోజుల్లో 1979 లో వచ్చిన అచ్యుతవల్లి కోరిక నవలలోని సంగీతపాత్ర, భ్రమరగీతంలోని సంగీతపాత్ర ఈనాటి నీనాగుప్తా వంటి అతివాద వ్యక్తిత్వాలకు ప్రతీకగా నిలవడం గమనార్హం. అలాగే నిమ్నవర్గ పక్షపాతంతో కూడిన దళితవాదం స్వాతంత్ర్యo సంతరించిన సరికొత్త విలువలతో కొడిగట్టిన దీపాలు, నేను దేవిని కాను నవలల్తో పాఠకుల్ని ఓ ఊపు ఊపింది.        అచ్యుతవల్లి రచనాకాలంలో చలం, గోపీచంద్, అడవి బాపిరాజు, బుచ్చిబాబు, రావిశాస్త్రి, కొమ్మూరి వేణుగోపాలరావు, బలివాడ కాంతారావు, గొల్లపూడి మారుతీరావు, ఇచ్ఛాపురపు జగన్నాధరావు, సింగరాజు లింగమూర్తి, తదితర రచయితలు మధ్యతరగతి జీవితాల సమస్యలను తమ తమ నవలల్లో ప్రతిభావంతంగా చిత్రీకరించారు.        అయితే రచయిత్రులు విద్యావంతులై ఉద్యోగం చేసే మహిళలు ఎదుర్కొనే సమస్యలను కథావస్తువుగా స్వీకరించారు. ఈ నవలలు ప్రజాజీవితాలపై ప్రభావం చూపడం ప్రారంభించాయి. వీరందరిలో ఐ.వి.యస్. అచ్యుతవల్లిగారి 'టోన్' చాలా బలమైనది. కేవలం మధ్యతరగతి కన్నీళ్ళని, కష్టాల్ని ఉటంకించి వదిలేయకుండా ఆ నేపధ్యంలో యువతీయువకుల జీవన విధానం, మనస్తత్వం, సమస్యల పట్ల ప్రత్యేక దృష్టితో రచనలు చేశారు. మధ్యతరగతి స్త్రీల పట్ల ప్రగాఢ సానుభూతిని కలుగజేస్తాయి ఈమె రచనలు. స్త్రీపురుషులు సమానమన్న ధోరణి ప్రతి నవలలో కనిపిస్తుంది. సహజమైన సంఘటనలను, పాత్రలను తీసుకుని పదునైన భాషలో నిర్భీతిగా ఈమె రచనలు చేసారు.            బహుముఖ ప్రజ్ఞాశాలి, విదూషీమణి అయిన అచ్యుతవల్లి నవలల సమగ్ర పరిశీలనావశ్యతను విశ్లేషనాత్మకంగా విశదీకరించడమే నా పరిశోధన. అచ్యుతవల్లి నవలా సాహిత్యంపై ఇది తొలి సిద్ధాంత వ్యాసం. ఈ సిద్ధాంత వ్యాసం మొదటి అధ్యాయంలో సిద్ధాంత వ్యాస రచనా మర్యాదను అనుసరించి తెలుగు నవలా పరిచయం జరిగింది. రెండో అధ్యాయంలో 1960వ దశకంలో తెలుగు నవలా రచనలో వచ్చిన ఆకస్మిక మార్పులు, అశేషంగా, అనివార్యంగా పెరిగిన పత్రికల, రచయిత్రుల సంఖ్య, పాఠకుల అభిరుచులను ప్రస్తావిస్తూ ఆనాటి తెలుగు నవల స్థితిగతులను తెలియజేయడం జరిగింది. మూడో అధ్యాయంలో అచ్యుతవల్లి నవలల పరిచయం జరిగింది. సామజిక న్యాయం ఈమె నవలల ఆశయం. నాల్గవ అధ్యాయంలో వస్తు వైవిధ్యం - ఇతివృత్త నిర్వహణ గురించి విశ్లేషణ జరిగింది. ఐ.వి.యస్. అచ్యుతవల్లి నవలల్లోని పాత్ర చిత్రణ - ప్రాముఖ్యతను గురించిన విశ్లేషణ ఐదో అధ్యాయంలో చేయడం జరిగింది. ఆరో అధ్యాయంలో ఆమె నవలల్లోని భాషా శైలి - శిల్పంల గురించి వివరణ, నవలల నేపధ్యం, వాతావరణాల పరిశీలన గురించిన చర్చజరిగింది.                                                                                                                    - డా.కె.బి.లక్ష్మీ          

Features

  • : I. V. S. Achyutavalli Navala Sahityam
  • : K B Lakshmi
  • : Visalaandhra Publishers
  • : EMESCO0655
  • : Paperback
  • : 2007
  • : 211
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:I. V. S. Achyutavalli Navala Sahityam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam