Aha! Emi Ruchi. . . .

By Aluru Krishna Prasad (Author)
Rs.80
Rs.80

Aha! Emi Ruchi. . . .
INR
MANIMN0146
In Stock
80.0
Rs.80


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         "ఏ మగాడైనా తన కన్నతల్లికి తండ్రికి భార్యకు ఏనాడూ 'థాంక్యూ' అని చెప్పకూడదట. ఎందుకుకంటే ఆ ఋణం ఈ ముగ్గురికి ఏమిచ్చినా జన్మజన్మలకు తీరదని" చాలా ప్రవచనాలలో చెప్పారు. వారు చెప్పినది అక్షరాలా వాస్తవం.

          స్వతహాగా నాకు చిన్నప్పటి నుండి వంట అంటే చాలా ఆసక్తి. ఆ ఆసక్తి వల్లే అమ్మ దెగ్గర కూర్చుని దాదాపుగా ప్రతి ఐటమ్ ఎలా చెయ్యాలో తెలుసుకునేవాడిని. ఈ విషయంలో క్రెడిట్ అంతా అమ్మదే. కుంపట్లు కట్టే పొయ్యిలు రంపపు పొట్టు పొయ్యిలతో వంట చేసే రోజులు. అమ్మకు ఉదయం 9 కల్లా వంటంతా పూర్తయిపోవాలి. మేము భోజనము చేసేసి స్కూళ్ళకు వెళ్ళాలి. 10 గంటలకల్లా నాన్న బోంచేసి కోర్టుకు వెళ్ళేవారు. అసలు నా జీవితంలో ఏనాడూ ఆయనని ఒక్క రోజు కూడా వంటగదిలోకి రావడం నేను చూడలేదు. భోజనము చేయడానికి మాత్రమే వంటగదిలోకి వచ్చేవారు. అంతే! అంత హడావుడిలో ఉన్న అమ్మ నాకు అన్ని శ్రద్ధగా ఏ ఐటమ్ ఎలా చెయ్యాలో చెప్పేది. ఆలా నాకు ఏ కూర ఎలా వండాలో చారు ఎలా పెట్టాలో పులుసు ఎలా పెట్టాలో కందిపచ్చడిలో ఏమేమి వేసి చెయ్యాలో ఇలా బుర్రకు పట్టేసింది. వంట చేసేటప్పుడు ఏ వస్తువు ఎంత పాళ్ళల్లో వేయాలో తాను వేసేటప్పుడు నాకు చూపించి వేసేది. అమ్మ ఊరికే ఆ కూర కదుపు కుంపటి విసురు పాలు పొంగకుండా చూడు.... ఇలా అనేది కానీ నేనుగా వంట చేసిన సందర్భమే ఏనాడూ రాలేదు.

                                                                                                          - ఆలూరు కృష్ణప్రసాదు  

         "ఏ మగాడైనా తన కన్నతల్లికి తండ్రికి భార్యకు ఏనాడూ 'థాంక్యూ' అని చెప్పకూడదట. ఎందుకుకంటే ఆ ఋణం ఈ ముగ్గురికి ఏమిచ్చినా జన్మజన్మలకు తీరదని" చాలా ప్రవచనాలలో చెప్పారు. వారు చెప్పినది అక్షరాలా వాస్తవం.           స్వతహాగా నాకు చిన్నప్పటి నుండి వంట అంటే చాలా ఆసక్తి. ఆ ఆసక్తి వల్లే అమ్మ దెగ్గర కూర్చుని దాదాపుగా ప్రతి ఐటమ్ ఎలా చెయ్యాలో తెలుసుకునేవాడిని. ఈ విషయంలో క్రెడిట్ అంతా అమ్మదే. కుంపట్లు కట్టే పొయ్యిలు రంపపు పొట్టు పొయ్యిలతో వంట చేసే రోజులు. అమ్మకు ఉదయం 9 కల్లా వంటంతా పూర్తయిపోవాలి. మేము భోజనము చేసేసి స్కూళ్ళకు వెళ్ళాలి. 10 గంటలకల్లా నాన్న బోంచేసి కోర్టుకు వెళ్ళేవారు. అసలు నా జీవితంలో ఏనాడూ ఆయనని ఒక్క రోజు కూడా వంటగదిలోకి రావడం నేను చూడలేదు. భోజనము చేయడానికి మాత్రమే వంటగదిలోకి వచ్చేవారు. అంతే! అంత హడావుడిలో ఉన్న అమ్మ నాకు అన్ని శ్రద్ధగా ఏ ఐటమ్ ఎలా చెయ్యాలో చెప్పేది. ఆలా నాకు ఏ కూర ఎలా వండాలో చారు ఎలా పెట్టాలో పులుసు ఎలా పెట్టాలో కందిపచ్చడిలో ఏమేమి వేసి చెయ్యాలో ఇలా బుర్రకు పట్టేసింది. వంట చేసేటప్పుడు ఏ వస్తువు ఎంత పాళ్ళల్లో వేయాలో తాను వేసేటప్పుడు నాకు చూపించి వేసేది. అమ్మ ఊరికే ఆ కూర కదుపు కుంపటి విసురు పాలు పొంగకుండా చూడు.... ఇలా అనేది కానీ నేనుగా వంట చేసిన సందర్భమే ఏనాడూ రాలేదు.                                                                                                           - ఆలూరు కృష్ణప్రసాదు  

Features

  • : Aha! Emi Ruchi. . . .
  • : Aluru Krishna Prasad
  • : J V Publications
  • : MANIMN0146
  • : Paperback
  • : 2018
  • : 139
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Aha! Emi Ruchi. . . .

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam