రాంబాబు జలుబు మందు
రాంబాబు గుండెల్లో బితుగ్గా వుంది. క్లాసులో అందరి వైపు చూశాడు. ఎవరూ ధైర్యంగా లేరు. పిల్లలందరి కళ్ళలో దిగులు. మాష్టారు చెప్పే పాఠం వినాలన్న ధ్యాసే లేదు. కిటికీలోంచి దూకి పారిపోతే బాగుండును అనుకొన్నాడు.
కాని వరండా కిటికీలన్నీ మూసి వుంచారు. బాత్రూమ్ సాకు చెప్పినా వినడంలేదు. కళ్ళతో బెదిరిస్తున్నారు మాష్టారు.
క్లాసులో అందరు చెవులు రిక్కించారు. అరుగో వచ్చేస్తున్నారు యములాళ్ళు. వాళ్లెందరున్నారో ఏమిటో! పిల్లల గుండె చప్పుడు పైకి విన్పించేటంత నిశ్శబ్దంగా వుంది క్లాసు. అడుగుల చప్పుడు వీళ్ళ క్లాసు గుమ్మంలోకివచ్చి ఆగింది. అందరు తలలు వంచి ఓరగా చూశారు. వీళ్ళు ఊహించుకున్న మీసాల రాక్షసుడి బదులు చేతిలో చిన్న పెట్టెతో నవ్వుతూన్న వ్యక్తి కన్పించాడు. ఆయన తెల్లబట్టలు వేసుకున్నాడు. భయం తగ్గి పిల్లలు తలలు ఎత్తి మెల్లిగా చూడసాగారు. మాష్టారు సైగ చేశారు. అది చూసి అందరూ లేచి నిలబడి “గుడ్ మార్నింగ్ సార్" అని అరిచారు. ఇంతలో హెడ్మాష్టారు లోపలకు వచ్చారు. ఆయన్ని చూసి అందరూ పిల్లుల్లా వూరుకున్నారు.
"ఆ! పిల్లలందరూ ప్రజంటు అయ్యారా! ఎవరూ ఎగ్గొట్టలేదు కదా” అన్నారు హెడ్మాష్టారు గద్దిస్తూ. పిల్లలు కిక్కురుమనకుండా వూరుకున్నారు...............
రాంబాబు జలుబు మందు రాంబాబు గుండెల్లో బితుగ్గా వుంది. క్లాసులో అందరి వైపు చూశాడు. ఎవరూ ధైర్యంగా లేరు. పిల్లలందరి కళ్ళలో దిగులు. మాష్టారు చెప్పే పాఠం వినాలన్న ధ్యాసే లేదు. కిటికీలోంచి దూకి పారిపోతే బాగుండును అనుకొన్నాడు. కాని వరండా కిటికీలన్నీ మూసి వుంచారు. బాత్రూమ్ సాకు చెప్పినా వినడంలేదు. కళ్ళతో బెదిరిస్తున్నారు మాష్టారు. క్లాసులో అందరు చెవులు రిక్కించారు. అరుగో వచ్చేస్తున్నారు యములాళ్ళు. వాళ్లెందరున్నారో ఏమిటో! పిల్లల గుండె చప్పుడు పైకి విన్పించేటంత నిశ్శబ్దంగా వుంది క్లాసు. అడుగుల చప్పుడు వీళ్ళ క్లాసు గుమ్మంలోకివచ్చి ఆగింది. అందరు తలలు వంచి ఓరగా చూశారు. వీళ్ళు ఊహించుకున్న మీసాల రాక్షసుడి బదులు చేతిలో చిన్న పెట్టెతో నవ్వుతూన్న వ్యక్తి కన్పించాడు. ఆయన తెల్లబట్టలు వేసుకున్నాడు. భయం తగ్గి పిల్లలు తలలు ఎత్తి మెల్లిగా చూడసాగారు. మాష్టారు సైగ చేశారు. అది చూసి అందరూ లేచి నిలబడి “గుడ్ మార్నింగ్ సార్" అని అరిచారు. ఇంతలో హెడ్మాష్టారు లోపలకు వచ్చారు. ఆయన్ని చూసి అందరూ పిల్లుల్లా వూరుకున్నారు. "ఆ! పిల్లలందరూ ప్రజంటు అయ్యారా! ఎవరూ ఎగ్గొట్టలేదు కదా” అన్నారు హెడ్మాష్టారు గద్దిస్తూ. పిల్లలు కిక్కురుమనకుండా వూరుకున్నారు...............© 2017,www.logili.com All Rights Reserved.