N T R tho Nenu

By H J Dhora (Author)
Rs.90
Rs.90

N T R tho Nenu
INR
EMESCO0076
In Stock
90.0
Rs.90


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

”ఎన్టీఆర్‌తో నేను” అనే పేరు పెట్టి శ్రీ దొర వ్రాసిన ఈ పుస్తకం రాష్ట్ర చరిత్రలో ఒక ముఖ్యమైన దశాబ్దం, ఎనభైలలో జరిగిన విశేష పరిణామాలను అక్షరబద్ధం చేస్తున్నది. దేశ చరిత్ర వ్రాసేవారూ, జీవిత చరిత్రలు వ్రాసేవారూ ఇరవయ్యవ శతాబ్దిలోని ఎనిమిదవ దశకాన్ని గురించీ, రామారావు గారిని గురించీ యథార్థ సంఘటనల సమాచార సమాహారాన్ని అందించవచ్చు. కానీ, ఆ సంఘటనల వెనుక నడిచిన కథలను వెల్లడించే అవకాశాలు తక్కువ. అలాంటి సమాచారం పూర్తిగా కాకపోవచ్చు కానీ చాలావరకు  ఈ గ్రంథం అందిస్తున్నది.

రామారావు గారు ముఖ్యమంత్రిగా, దొరగారు ఇంటిలిజెన్స్‌ అధికారిగా ఉన్నప్పుడు రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోయే చాలా సంఘటనలు జరిగాయి. రాజకీయంగా చూస్తే రాష్ట్రంలో తొలిసారి కాంగ్రేసేతర ప్రభుత్వం ఏర్పడటం మొదలు, యావన్మంది మంత్రులను ఇళ్లకు పంపించి తానొక్కడే ముఖ్యమంత్రిగా, కొద్దిరోజులే కావచ్చును కానీ, పరిపాలన సాగించడం, ఒక మంత్రిని అవినీతిపరుడని పోలీసులకు పట్టించడం, వెన్నుపోటు రాజకీయాలు, రంగా హత్య, తదనంతరం విజయవాడ భగ్గుమనడం, మెజారిటీ ఉన్నప్పటికీ అసెంబ్లీని రద్దు చేయించి ఎన్నికలు జరిపించడం మొదలైనవి చెప్పవలసి వస్తే చాలా ఉన్నాయి.

దొరగారి పుస్తకం చదువుతుంటే ఇంతముఖ్యమైన నిర్ణయాల వెనుక ఇంత కథ ఉన్నదా అనిపిస్తుంది.

నిజాలను నిర్మొహమాటంగా వెల్లడించే ఈ విధమైన పుస్తకం రాయటానికి ధైర్యం, సాహసం కూడా అవసరమే. అవి దొరగారికి పుష్కలంగా ఉన్నాయి కనుకనే రాశారు. రాగద్వేషాలలో దేనినీ ఆయన దాచుకోలేదు. ఉన్నది ఉన్నట్టు రాయటానికి దొరగారు చేసిన ప్రయత్నం బహుధా ప్రశంసనీయం.

”ఎన్టీఆర్‌తో నేను” అనే పేరు పెట్టి శ్రీ దొర వ్రాసిన ఈ పుస్తకం రాష్ట్ర చరిత్రలో ఒక ముఖ్యమైన దశాబ్దం, ఎనభైలలో జరిగిన విశేష పరిణామాలను అక్షరబద్ధం చేస్తున్నది. దేశ చరిత్ర వ్రాసేవారూ, జీవిత చరిత్రలు వ్రాసేవారూ ఇరవయ్యవ శతాబ్దిలోని ఎనిమిదవ దశకాన్ని గురించీ, రామారావు గారిని గురించీ యథార్థ సంఘటనల సమాచార సమాహారాన్ని అందించవచ్చు. కానీ, ఆ సంఘటనల వెనుక నడిచిన కథలను వెల్లడించే అవకాశాలు తక్కువ. అలాంటి సమాచారం పూర్తిగా కాకపోవచ్చు కానీ చాలావరకు  ఈ గ్రంథం అందిస్తున్నది. రామారావు గారు ముఖ్యమంత్రిగా, దొరగారు ఇంటిలిజెన్స్‌ అధికారిగా ఉన్నప్పుడు రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోయే చాలా సంఘటనలు జరిగాయి. రాజకీయంగా చూస్తే రాష్ట్రంలో తొలిసారి కాంగ్రేసేతర ప్రభుత్వం ఏర్పడటం మొదలు, యావన్మంది మంత్రులను ఇళ్లకు పంపించి తానొక్కడే ముఖ్యమంత్రిగా, కొద్దిరోజులే కావచ్చును కానీ, పరిపాలన సాగించడం, ఒక మంత్రిని అవినీతిపరుడని పోలీసులకు పట్టించడం, వెన్నుపోటు రాజకీయాలు, రంగా హత్య, తదనంతరం విజయవాడ భగ్గుమనడం, మెజారిటీ ఉన్నప్పటికీ అసెంబ్లీని రద్దు చేయించి ఎన్నికలు జరిపించడం మొదలైనవి చెప్పవలసి వస్తే చాలా ఉన్నాయి. దొరగారి పుస్తకం చదువుతుంటే ఇంతముఖ్యమైన నిర్ణయాల వెనుక ఇంత కథ ఉన్నదా అనిపిస్తుంది. నిజాలను నిర్మొహమాటంగా వెల్లడించే ఈ విధమైన పుస్తకం రాయటానికి ధైర్యం, సాహసం కూడా అవసరమే. అవి దొరగారికి పుష్కలంగా ఉన్నాయి కనుకనే రాశారు. రాగద్వేషాలలో దేనినీ ఆయన దాచుకోలేదు. ఉన్నది ఉన్నట్టు రాయటానికి దొరగారు చేసిన ప్రయత్నం బహుధా ప్రశంసనీయం.

Features

  • : N T R tho Nenu
  • : H J Dhora
  • : Emesco
  • : EMESCO0076
  • : Paperback
  • : 189
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:N T R tho Nenu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam