Mana Samskarthala Jeevitha Kadhalu

By Koduri Srirama Murthy (Author)
Rs.58
Rs.58

Mana Samskarthala Jeevitha Kadhalu
INR
REEMPUB018
Out Of Stock
58.0
Rs.58
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

             ఈ చిన్న పుస్తకంలో ఆరుగురు సంఘసంస్కర్తల సంస్కరణోధ్యమ కధలను పిల్లలకూ, పెద్దలకూ ఆసక్తికరంగా వుండేటట్టు వివరించడం జరిగింది.

               రాజా రామ మోహన రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు, ఉన్నవ లక్ష్మినారాయణ, దరిశి చెంచయ్య, ఈ ఆరుగురి పేర్లు సంఘ సంస్కరణోధ్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినవి. వీరు చేసిన త్యాగాలు సనాతన వాదులతో సలిపిన పోరాటాలు, చిరస్మరణీయమైనవి.

         కాలగమనంలో సాంఘిక జీవనంలో ఎన్నో దురాచారాలు చోటు చేసుకుంటాయి. ఈ కధ ఒక నాటి సతీసహగమనాలతో ప్రారంభమై నేటి వరకట్న సమస్య వరకూ వున్నది. ఇట్లాంటి దురాచారాలను ధీశాలూరు చూస్తూ ఊరుకోరు. మందిలో ఒకరుగా వాటిని అంగీకరించరు. వీటిని సరిచెయ్యడానికి ఎన్ని కష్టాలు ఎదురయినా నడుం బిగిస్తారు.

         ఈ కృషిలో వారికి ఎవరూ తోడూ వుండరు. పైగా వాళ్లు ముందుకు వెళ్ళకుండా చెయ్యడానికి ఎన్నో అడ్డంకులను కల్పించడానికి కూడా చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే వారిది ఒంటరి పోరాటం.

            ఈ ఒంటరి పోరాటాన్ని ఆరుగురు త్యాగమూర్తులు ఎలా సాగించిందీ ఈ పుస్తకం వివరిస్తుంది.

           ఈ పుస్తకం మిగతా జీవిత చరిత్ర గ్రంధాల కంటె భిన్నమైనది. ఇందులో ఆ మహానీయుల జననం, మరణం, వంటి సాధారణ వివరాలు కొన్ని యిచ్చినప్పటికీ, ప్రాధాన్యత మాత్రం వారు చేసిన సంఘ సంస్కరణ కృషికే ఇవ్వడం జరిగింది. ప్రముఖ సంఘ సంస్కర్తల గురించి ఈ తరం వారు తెలుసుకోవలసింది సాధారణ జీవిత వివరాలకంటే, - సంఘంతో వారు సాగించిన పోరాటం గురించే పాఠకులు తెలుసుకోవడం ముఖ్యం అని ఈ రచయిత అభిప్రాయం. ఆ విధంగా ఇది ఆరుగురు సంఘ సంస్కరణోధ్యమాల కధ.

          ఈ సందర్భంలోనే ఒక విషయాన్ని గురించి చెప్పక తప్పదు. భారత దేశంలో మొదటిలో జరిగిన సంఘ సంస్కరణోధ్యామాలన్నీ స్త్రీల అభ్యుదయాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని జరిగినవే! సతీసహగమనమైనా, కన్యా శుల్క వరశుల్క సమస్యలైనా, - అన్నీ స్త్రీకీ శారీరక, మానసిక సమస్యలను కలిగించేవే.

          ఈ సమస్యలన్నింటికీ మూల కారణం స్త్రీ, పురుషుల మధ్య సమానత లేకపోవటం. అన్ని విధాలా స్త్రీని అణగ ద్రోక్కడం. ఈ మూల కారణాన్ని తోలగొంచేందుకే తొలి తరం సంఘ సంస్కర్తలందరూ అహర్నిశలూ శ్రమించారు. పాఠకులకు ఈ పుస్తకం స్పూర్తి నివ్వగలదని నా ఆకాంక్ష.

- కోడూరి శ్రీరామమూర్తి 

 

             ఈ చిన్న పుస్తకంలో ఆరుగురు సంఘసంస్కర్తల సంస్కరణోధ్యమ కధలను పిల్లలకూ, పెద్దలకూ ఆసక్తికరంగా వుండేటట్టు వివరించడం జరిగింది.                రాజా రామ మోహన రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు, ఉన్నవ లక్ష్మినారాయణ, దరిశి చెంచయ్య, ఈ ఆరుగురి పేర్లు సంఘ సంస్కరణోధ్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినవి. వీరు చేసిన త్యాగాలు సనాతన వాదులతో సలిపిన పోరాటాలు, చిరస్మరణీయమైనవి.          కాలగమనంలో సాంఘిక జీవనంలో ఎన్నో దురాచారాలు చోటు చేసుకుంటాయి. ఈ కధ ఒక నాటి సతీసహగమనాలతో ప్రారంభమై నేటి వరకట్న సమస్య వరకూ వున్నది. ఇట్లాంటి దురాచారాలను ధీశాలూరు చూస్తూ ఊరుకోరు. మందిలో ఒకరుగా వాటిని అంగీకరించరు. వీటిని సరిచెయ్యడానికి ఎన్ని కష్టాలు ఎదురయినా నడుం బిగిస్తారు.          ఈ కృషిలో వారికి ఎవరూ తోడూ వుండరు. పైగా వాళ్లు ముందుకు వెళ్ళకుండా చెయ్యడానికి ఎన్నో అడ్డంకులను కల్పించడానికి కూడా చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే వారిది ఒంటరి పోరాటం.             ఈ ఒంటరి పోరాటాన్ని ఆరుగురు త్యాగమూర్తులు ఎలా సాగించిందీ ఈ పుస్తకం వివరిస్తుంది.            ఈ పుస్తకం మిగతా జీవిత చరిత్ర గ్రంధాల కంటె భిన్నమైనది. ఇందులో ఆ మహానీయుల జననం, మరణం, వంటి సాధారణ వివరాలు కొన్ని యిచ్చినప్పటికీ, ప్రాధాన్యత మాత్రం వారు చేసిన సంఘ సంస్కరణ కృషికే ఇవ్వడం జరిగింది. ప్రముఖ సంఘ సంస్కర్తల గురించి ఈ తరం వారు తెలుసుకోవలసింది సాధారణ జీవిత వివరాలకంటే, - సంఘంతో వారు సాగించిన పోరాటం గురించే పాఠకులు తెలుసుకోవడం ముఖ్యం అని ఈ రచయిత అభిప్రాయం. ఆ విధంగా ఇది ఆరుగురు సంఘ సంస్కరణోధ్యమాల కధ.           ఈ సందర్భంలోనే ఒక విషయాన్ని గురించి చెప్పక తప్పదు. భారత దేశంలో మొదటిలో జరిగిన సంఘ సంస్కరణోధ్యామాలన్నీ స్త్రీల అభ్యుదయాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని జరిగినవే! సతీసహగమనమైనా, కన్యా శుల్క వరశుల్క సమస్యలైనా, - అన్నీ స్త్రీకీ శారీరక, మానసిక సమస్యలను కలిగించేవే.           ఈ సమస్యలన్నింటికీ మూల కారణం స్త్రీ, పురుషుల మధ్య సమానత లేకపోవటం. అన్ని విధాలా స్త్రీని అణగ ద్రోక్కడం. ఈ మూల కారణాన్ని తోలగొంచేందుకే తొలి తరం సంఘ సంస్కర్తలందరూ అహర్నిశలూ శ్రమించారు. పాఠకులకు ఈ పుస్తకం స్పూర్తి నివ్వగలదని నా ఆకాంక్ష. - కోడూరి శ్రీరామమూర్తి   

Features

  • : Mana Samskarthala Jeevitha Kadhalu
  • : Koduri Srirama Murthy
  • : Reem
  • : REEMPUB018
  • : Paperback
  • : 58
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mana Samskarthala Jeevitha Kadhalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam