Janakibala Kadhalu

By Indraganti Janakibala (Author)
Rs.400
Rs.400

Janakibala Kadhalu
INR
EMESCO0569
Out Of Stock
400.0
Rs.400
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

              1970లో ఆంధ్రపత్రికలో నా మొదటి కధ 'మనిషికి మరో మలుపు' కధ ప్రచురింపబడినప్పుడు ఏదో సాధించేసినట్లు ఆనందపడిపోయాను.

                   ఆ తర్వాత అనేక వార, మాస, దినపత్రికల్లో నా కధలు అప్పుడప్పుడు ప్రచురింపబడుతూ వుండేవి.

                  ప్రసిద్ధులైన తెలుగు కధారచయితల, రచయిత్రుల సాహిత్యం చదువుతూ, అదే ధోరణిలో ఆలోచిస్తూ, నా దృష్టిలో కొచ్చిన అన్యాయాలను, అక్రమాలను, ఆశ్చర్యాలను కధలుగా మలుస్తూ వ్రాస్తున్నప్పటికీ, పది పదిహేనేళ్ళ వరకు నా వ్యక్తిత్వాన్ని, నా ఆస్తిత్వాన్ని గుర్తుంచుకోలేకపోయాననిపిస్తుంది

               1980లో నా మొదటి కధాసంపుటి ప్రేమలేఖ వచ్చింది. దానికి మంచి గుర్తింపే వచ్చింది - క్రమంగా 84,85లలో నా కధలు వ్రాసే విధానంలో మార్పు వచ్చిందనిపిస్తుంది. 'ప్రయోజనం', 'అంతరంగతరంగాలు', 'ఆత్మదృష్టి', 'అందరం ప్రేక్షకులమే', 'నిర్ణయానికి అటూయిటూ' సంపుటాలు నన్ను పాఠకులకి దగ్గర చేశాయి.

             వందలుగా కధలు వ్రాసిన రచయితలను తల్చుకున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. అన్ని కధలు ఎలా వ్రాయగలిగానా అనిపిస్తుంది.  

             నేటికి ఇది ఇంద్రగంటి జానకీబాల సమగ్ర కధల సంపుటి. కుటుంబాలను, కుటుంబ అనుబంధాలను, వివిధ సామాజికంశాలను స్పృశిస్తూ నాలుగు దశాబ్దాలుగా అంచెలంచెలుగా విశ్లేషించిన కధలు. అచ్చమైన మధ్యతరగతి ఆవేశాలకు, అనుమానాలకు, అహంకారాలకు, అపోహలకు, ఆత్మవిశ్వాసాలకు అద్దంపట్టే కధలు. హాస్యం, వ్యంగం, సున్నితమైన అనుభూతిని చిత్రించే కధలు. స్త్రీవాదంలో తేటదనాన్ని సమర్ధించే అంతరంగ తరంగాలు.

              నలబై ఏళ్ల కాలంలో నేను వ్రాసిన 130 కధలను ఒక పుస్తకంగా వేస్తె బాగుంటుందనే ఆలోచన వచ్చి, ఈ కధాసంపుటిని పాఠకుల ముందుంచుతున్నాను. ఇవన్నీ చదివి నా ఆలోచనలు మీరూ పంచుకుంటారని ఆశిస్తున్నాను.

- ఇంద్రగంటి జానకీబాల

 

 

              1970లో ఆంధ్రపత్రికలో నా మొదటి కధ 'మనిషికి మరో మలుపు' కధ ప్రచురింపబడినప్పుడు ఏదో సాధించేసినట్లు ఆనందపడిపోయాను.                    ఆ తర్వాత అనేక వార, మాస, దినపత్రికల్లో నా కధలు అప్పుడప్పుడు ప్రచురింపబడుతూ వుండేవి.                   ప్రసిద్ధులైన తెలుగు కధారచయితల, రచయిత్రుల సాహిత్యం చదువుతూ, అదే ధోరణిలో ఆలోచిస్తూ, నా దృష్టిలో కొచ్చిన అన్యాయాలను, అక్రమాలను, ఆశ్చర్యాలను కధలుగా మలుస్తూ వ్రాస్తున్నప్పటికీ, పది పదిహేనేళ్ళ వరకు నా వ్యక్తిత్వాన్ని, నా ఆస్తిత్వాన్ని గుర్తుంచుకోలేకపోయాననిపిస్తుంది                1980లో నా మొదటి కధాసంపుటి ప్రేమలేఖ వచ్చింది. దానికి మంచి గుర్తింపే వచ్చింది - క్రమంగా 84,85లలో నా కధలు వ్రాసే విధానంలో మార్పు వచ్చిందనిపిస్తుంది. 'ప్రయోజనం', 'అంతరంగతరంగాలు', 'ఆత్మదృష్టి', 'అందరం ప్రేక్షకులమే', 'నిర్ణయానికి అటూయిటూ' సంపుటాలు నన్ను పాఠకులకి దగ్గర చేశాయి.              వందలుగా కధలు వ్రాసిన రచయితలను తల్చుకున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. అన్ని కధలు ఎలా వ్రాయగలిగానా అనిపిస్తుంది.                నేటికి ఇది ఇంద్రగంటి జానకీబాల సమగ్ర కధల సంపుటి. కుటుంబాలను, కుటుంబ అనుబంధాలను, వివిధ సామాజికంశాలను స్పృశిస్తూ నాలుగు దశాబ్దాలుగా అంచెలంచెలుగా విశ్లేషించిన కధలు. అచ్చమైన మధ్యతరగతి ఆవేశాలకు, అనుమానాలకు, అహంకారాలకు, అపోహలకు, ఆత్మవిశ్వాసాలకు అద్దంపట్టే కధలు. హాస్యం, వ్యంగం, సున్నితమైన అనుభూతిని చిత్రించే కధలు. స్త్రీవాదంలో తేటదనాన్ని సమర్ధించే అంతరంగ తరంగాలు.               నలబై ఏళ్ల కాలంలో నేను వ్రాసిన 130 కధలను ఒక పుస్తకంగా వేస్తె బాగుంటుందనే ఆలోచన వచ్చి, ఈ కధాసంపుటిని పాఠకుల ముందుంచుతున్నాను. ఇవన్నీ చదివి నా ఆలోచనలు మీరూ పంచుకుంటారని ఆశిస్తున్నాను. - ఇంద్రగంటి జానకీబాల    

Features

  • : Janakibala Kadhalu
  • : Indraganti Janakibala
  • : Analpa
  • : EMESCO0569
  • : Paperback
  • : October 2013
  • : 830
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Janakibala Kadhalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam