Nenerigina Nannagaru

Rs.200
Rs.200

Nenerigina Nannagaru
INR
VISHALA493
Out Of Stock
200.0
Rs.200
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

"ముళ్ళబాటలో నీవు నడిచావు

  పూల తోటలో మమ్ము నడిపావు

  ఏ పూట తిన్నావో ఎన్ని పస్తులున్నావో

  పరమాన్నం మాకు దాచి ఉంచావు....

 

  ఉన్ననాడు ఏమి దాచుకున్నావు

  లేనినాడు చేయి చాపనన్నావు

  నీ రాచగుణమే మా మూలధనం

  నీవే మా పాలి దైవము......." 

          దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం నాన్నగారి చరిత్ర రాయాలన్న సంకల్పం కలిగింది. అయితే ఒక వ్యక్తిగా నాన్నగారి గురించి నాకు తెలిసినది తక్కువ కనుక అమ్మతో నా కోరికని చెప్పినప్పుడు సానుకూలంగా స్పందించి నాకు తెలియని అనేక విషయాలని వివరంగా చెప్పింది. అది కేవలం అమ్మ కోణం మాత్రమే అవడం వల్ల సమగ్రత లోపిస్తుంది అనిపి౦చింది. ఎందుకంటే అమ్మకి కూడా నాన్నగారు దగ్గరి బంధువే. ఐనా, వివాహం జరిగినప్పటి నుంచి మాత్రమే బాగా తెలుసు. అందుకని నాన్నగారి వైపు బంధువులను కలిసాను. ఆ క్రమంలో నాన్నగారి పినతండ్రి గారి కుమారుడు, తమ్ముడు సన్నిహితుడు ఐన డా.ఘంటసాల సుబ్బారావుగారు, నాన్నగారి మేనకోడలు, ర్యాలి పిచ్చిరామయ్య తాతగారి కుమార్తె, మా సదాశివుడు బాబాయిగారి భార్య శ్రీమతి ఘంటసాల సుబ్బలక్ష్మిగారు నాన్నగారి చిన్ననాటి విశేషాలను వివరించారు. నాన్నగారి ప్రయాణాలలో వెన్నంటి నీడగా తిరిగిన మేమందరం ఆప్యాయంగా గుండు మామయ్య అని పిలిచే శ్రీ కొమరవోలు కృష్ణారావు గారు అపురూప సంఘటనలు చెప్పారు.

          నాన్నగారు సమకాలీనులు, కవి, బహు భాషాకోవిదులు, సుప్రసిద్ధ చలనచిత్ర నేపధ్య గాయకులు, మిత్రులు పూజ్యులు శ్రీ పి.బి. శ్రీనివాస్ గారిని నేను అడిగిన వెంటనే అంగీకరించి నా ఈ రచనని ఓపికగా చదివి, తమ అమూల్యమైన అభిప్రాయాన్ని రాసిచ్చి ఆశీర్వదించారు. నాన్నగారి కోరికను నెరవేర్చడంలో కృతకృత్యురాలిని కావడానికి కారకులైన వీరందరికీ శిరస్సు వంచి ప్రణామం చేస్తూ నా హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

                                                                                       - శ్యామల ఘంటసాల  

"ముళ్ళబాటలో నీవు నడిచావు   పూల తోటలో మమ్ము నడిపావు   ఏ పూట తిన్నావో ఎన్ని పస్తులున్నావో   పరమాన్నం మాకు దాచి ఉంచావు....     ఉన్ననాడు ఏమి దాచుకున్నావు   లేనినాడు చేయి చాపనన్నావు   నీ రాచగుణమే మా మూలధనం   నీవే మా పాలి దైవము......."            దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం నాన్నగారి చరిత్ర రాయాలన్న సంకల్పం కలిగింది. అయితే ఒక వ్యక్తిగా నాన్నగారి గురించి నాకు తెలిసినది తక్కువ కనుక అమ్మతో నా కోరికని చెప్పినప్పుడు సానుకూలంగా స్పందించి నాకు తెలియని అనేక విషయాలని వివరంగా చెప్పింది. అది కేవలం అమ్మ కోణం మాత్రమే అవడం వల్ల సమగ్రత లోపిస్తుంది అనిపి౦చింది. ఎందుకంటే అమ్మకి కూడా నాన్నగారు దగ్గరి బంధువే. ఐనా, వివాహం జరిగినప్పటి నుంచి మాత్రమే బాగా తెలుసు. అందుకని నాన్నగారి వైపు బంధువులను కలిసాను. ఆ క్రమంలో నాన్నగారి పినతండ్రి గారి కుమారుడు, తమ్ముడు సన్నిహితుడు ఐన డా.ఘంటసాల సుబ్బారావుగారు, నాన్నగారి మేనకోడలు, ర్యాలి పిచ్చిరామయ్య తాతగారి కుమార్తె, మా సదాశివుడు బాబాయిగారి భార్య శ్రీమతి ఘంటసాల సుబ్బలక్ష్మిగారు నాన్నగారి చిన్ననాటి విశేషాలను వివరించారు. నాన్నగారి ప్రయాణాలలో వెన్నంటి నీడగా తిరిగిన మేమందరం ఆప్యాయంగా గుండు మామయ్య అని పిలిచే శ్రీ కొమరవోలు కృష్ణారావు గారు అపురూప సంఘటనలు చెప్పారు.           నాన్నగారు సమకాలీనులు, కవి, బహు భాషాకోవిదులు, సుప్రసిద్ధ చలనచిత్ర నేపధ్య గాయకులు, మిత్రులు పూజ్యులు శ్రీ పి.బి. శ్రీనివాస్ గారిని నేను అడిగిన వెంటనే అంగీకరించి నా ఈ రచనని ఓపికగా చదివి, తమ అమూల్యమైన అభిప్రాయాన్ని రాసిచ్చి ఆశీర్వదించారు. నాన్నగారి కోరికను నెరవేర్చడంలో కృతకృత్యురాలిని కావడానికి కారకులైన వీరందరికీ శిరస్సు వంచి ప్రణామం చేస్తూ నా హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.                                                                                        - శ్యామల ఘంటసాల  

Features

  • : Nenerigina Nannagaru
  • : Dr Shyamala Ghantasala
  • : Ghantasala Publications
  • : VISHALA493
  • : Paperback
  • : 2015
  • : 250
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nenerigina Nannagaru

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam