Vijayawada Kanakadurga Malleswaralaya Charitra, Sasanalu

By Konda Srinivasulu (Author)
Rs.150
Rs.150

Vijayawada Kanakadurga Malleswaralaya Charitra, Sasanalu
INR
MANIMN2748
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ఆదాయం ఆర్జించే రెండో దేవాలయంగా గుర్తింపు పొందిన దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని ప్రతిరోజు వేల సంఖ్యలోనూ, దసరా ఉత్సవాల్లో లక్షల సంఖ్యలో భక్తులు దరిసుంటారు. ఆ విధంగా విజయవాడ దుర్గా మల్లేశ్వర ఆలయం దేశవ్యాప్త గుర్తింపు పొందింది. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ ఆలయం చుట్టూ అల్లుకొన్న పౌరాణిక, ఐతిహాసిక గాథలతో పాటు స్థలమహత్యం, ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాలు, చరిత్ర, శాసనాలను గురించి భక్తులకు తెలియజేయాలన్న ఉద్దేశంతో విజయవాడ కనకదుర్గ మల్లేశ్వర ఆలయ చరిత్ర, శాసనాలు అన్న పుస్తకాన్ని రచించాను.

                                    ఈ పుస్తకంలో రెండు ఆలయాలకు సంబంధించిన వేంగీ చాళుక్య, చాళుక్య చోళ, వెలనాటి చోళ, నతవాడి చాగి, పరిశ్చేది, కోన కండవాటి, కాకతీయ, విజయనగర, గజపతి రాజవంశాలు, ఇంకా రెడ్లు, అధికారులు, వర్తక సంఘాలు, కళాకారులు మొదలైనవారు ఇచ్చిన మొత్తం 108 శాసనాలు ఉన్నాయి. వీటిలో సంస్కృతం, తెలుగు, తమిళ (ఒకే ఒకటి) శాసనాలు క్రీ.శ. 9 నుంచి క్రీ.శ 16 శతాబ్ది వరకు, ఆలయ నిర్వహణ, నిర్మాణ, జీర్ణోద్ధరణ, అర్చన, ఉత్సవ, దీప దానాల తెలియజేస్తున్నాయి. క్రీ.శ. 909 నాటి వేంగీచాళుక్య విష్ణువర్ధనుని శాసనం మొదటిది కాగా, క్రీ.శ 1589 నాటిది చివరి శాసనం. ఈ శాసనాల్లో ఆనాటి మతపరమైన ఉత్సవాలు, ఆలయాల్లోని అఖండ దీపారాధన, పశువులు, భూమి, గ్రామాలను, ధనాన్ని దానం చేసిన వివరాలు, మఠాల నిర్వహణ, స్వామి నైవేద్యం, ఆభరణాలనిచ్చిన వివరాలు, వర్తక సంఘాలు మండపాలను నిర్మించిన వివరాలు ఉన్నాయి.

 

                                   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ఆదాయం ఆర్జించే రెండో దేవాలయంగా గుర్తింపు పొందిన దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని ప్రతిరోజు వేల సంఖ్యలోనూ, దసరా ఉత్సవాల్లో లక్షల సంఖ్యలో భక్తులు దరిసుంటారు. ఆ విధంగా విజయవాడ దుర్గా మల్లేశ్వర ఆలయం దేశవ్యాప్త గుర్తింపు పొందింది. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ ఆలయం చుట్టూ అల్లుకొన్న పౌరాణిక, ఐతిహాసిక గాథలతో పాటు స్థలమహత్యం, ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాలు, చరిత్ర, శాసనాలను గురించి భక్తులకు తెలియజేయాలన్న ఉద్దేశంతో విజయవాడ కనకదుర్గ మల్లేశ్వర ఆలయ చరిత్ర, శాసనాలు అన్న పుస్తకాన్ని రచించాను.                                     ఈ పుస్తకంలో రెండు ఆలయాలకు సంబంధించిన వేంగీ చాళుక్య, చాళుక్య చోళ, వెలనాటి చోళ, నతవాడి చాగి, పరిశ్చేది, కోన కండవాటి, కాకతీయ, విజయనగర, గజపతి రాజవంశాలు, ఇంకా రెడ్లు, అధికారులు, వర్తక సంఘాలు, కళాకారులు మొదలైనవారు ఇచ్చిన మొత్తం 108 శాసనాలు ఉన్నాయి. వీటిలో సంస్కృతం, తెలుగు, తమిళ (ఒకే ఒకటి) శాసనాలు క్రీ.శ. 9 నుంచి క్రీ.శ 16 శతాబ్ది వరకు, ఆలయ నిర్వహణ, నిర్మాణ, జీర్ణోద్ధరణ, అర్చన, ఉత్సవ, దీప దానాల తెలియజేస్తున్నాయి. క్రీ.శ. 909 నాటి వేంగీచాళుక్య విష్ణువర్ధనుని శాసనం మొదటిది కాగా, క్రీ.శ 1589 నాటిది చివరి శాసనం. ఈ శాసనాల్లో ఆనాటి మతపరమైన ఉత్సవాలు, ఆలయాల్లోని అఖండ దీపారాధన, పశువులు, భూమి, గ్రామాలను, ధనాన్ని దానం చేసిన వివరాలు, మఠాల నిర్వహణ, స్వామి నైవేద్యం, ఆభరణాలనిచ్చిన వివరాలు, వర్తక సంఘాలు మండపాలను నిర్మించిన వివరాలు ఉన్నాయి.  

Features

  • : Vijayawada Kanakadurga Malleswaralaya Charitra, Sasanalu
  • : Konda Srinivasulu
  • : Pratibha Prachuranalu
  • : MANIMN2748
  • : Paperback
  • : 2021
  • : 184
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vijayawada Kanakadurga Malleswaralaya Charitra, Sasanalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam