నవగ్రహాలలో ఈశ్వరశబ్దము శ్రీ శనిదేవునికే కలదు. రాశి చక్రంలో కర్మ లాభ స్థానాలకు అధిపతి కాబట్టే భ్రుగుమహర్షి సకల మానవులకు వృత్తి నిర్ణయం చేసేటప్పుడు శనిగ్రహ కారకత్వాన్ని నిర్ణయంగా తీసుకున్నాడు. విరుద్దాంశాలకు శని ఆధిపత్యం వహించటమే ఆయనకు ఈశ్వర శబ్దం ఉండటానికి కారణం అనగా పూర్ణాయువుకు - అకాల మృత్యువుకు; నాయకత్వానికి - బానిసత్వానికి; యోగానికి - వియోగానికి, ఉన్నతి - అధోగతి; దైవత్వం - నీచత్వం; మున్నగు విరుద్దాంశాలను శ్రీ శనిదేవుడు ప్రభావితం చేస్తాడు. దీనిని బట్టి శ్రీ శనిదేవుడు రెండు వైరుధ్యాలను కలుపుట లేదా విడదీయుటలో ప్రసిద్ధమైన పాత్రను వహిస్తాడని అర్థమవుతుంది.
అష్టకష్టములు, అష్టదిక్కులు, అష్టదిక్పాలకులు, అష్టదిగ్గజములు, అష్టలక్ష్ములు, అష్టపశువులు, అష్టవిధనాయికలు, అష్టదిశలు/ దిక్కులు, అష్టాంగ యోగ విధానం. ఈ విధంగా అష్ట సంఖ్య (8) కలిగనవి ఎన్నో ప్రధాన అంశాలు శనిగ్రహ దేవత సంఖ్యలో ఉండుట శ్రీ శనీశ్వరుడు ఈశ్వరత్వాన్ని ప్రతిపాదిస్తుంది.
జన్మ లగ్నంలో కాని, గోచార రీత్యా కాని దశ, అంతర్ధశ, ఏలినాటి శని వలన బాధలు పడుచున్న వారు మాత్రమే కాకుండా సకల జనులు ఈ గ్రంథంలో వివరించబడిన వ్రతమును, ప్రక్రియలను ఆచరించి శ్రీ శనీశ్వరుడు అనుగ్రహముతో అష్టైశ్వర్యములు పొందవచ్చును.
సర్వేజనా: సుఖినో భవంతు
ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తి:
నవగ్రహాలలో ఈశ్వరశబ్దము శ్రీ శనిదేవునికే కలదు. రాశి చక్రంలో కర్మ లాభ స్థానాలకు అధిపతి కాబట్టే భ్రుగుమహర్షి సకల మానవులకు వృత్తి నిర్ణయం చేసేటప్పుడు శనిగ్రహ కారకత్వాన్ని నిర్ణయంగా తీసుకున్నాడు. విరుద్దాంశాలకు శని ఆధిపత్యం వహించటమే ఆయనకు ఈశ్వర శబ్దం ఉండటానికి కారణం అనగా పూర్ణాయువుకు - అకాల మృత్యువుకు; నాయకత్వానికి - బానిసత్వానికి; యోగానికి - వియోగానికి, ఉన్నతి - అధోగతి; దైవత్వం - నీచత్వం; మున్నగు విరుద్దాంశాలను శ్రీ శనిదేవుడు ప్రభావితం చేస్తాడు. దీనిని బట్టి శ్రీ శనిదేవుడు రెండు వైరుధ్యాలను కలుపుట లేదా విడదీయుటలో ప్రసిద్ధమైన పాత్రను వహిస్తాడని అర్థమవుతుంది. అష్టకష్టములు, అష్టదిక్కులు, అష్టదిక్పాలకులు, అష్టదిగ్గజములు, అష్టలక్ష్ములు, అష్టపశువులు, అష్టవిధనాయికలు, అష్టదిశలు/ దిక్కులు, అష్టాంగ యోగ విధానం. ఈ విధంగా అష్ట సంఖ్య (8) కలిగనవి ఎన్నో ప్రధాన అంశాలు శనిగ్రహ దేవత సంఖ్యలో ఉండుట శ్రీ శనీశ్వరుడు ఈశ్వరత్వాన్ని ప్రతిపాదిస్తుంది. జన్మ లగ్నంలో కాని, గోచార రీత్యా కాని దశ, అంతర్ధశ, ఏలినాటి శని వలన బాధలు పడుచున్న వారు మాత్రమే కాకుండా సకల జనులు ఈ గ్రంథంలో వివరించబడిన వ్రతమును, ప్రక్రియలను ఆచరించి శ్రీ శనీశ్వరుడు అనుగ్రహముతో అష్టైశ్వర్యములు పొందవచ్చును. సర్వేజనా: సుఖినో భవంతు ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తి:© 2017,www.logili.com All Rights Reserved.