Siddhanta Sikhamani (part- 2)

By Dr K Sivanada Murthy (Author)
Rs.200
Rs.200

Siddhanta Sikhamani (part- 2)
INR
MANIMN2972
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                            అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి, ధర్మపాలన చేసిన ఉర్లాం జమీందారీ వంశంలో 1928లో రాజమండ్రిలో జన్మించారు. వారసత్వంగా వచ్చిన దాతృత్వ సాంప్ర దాయాన్ని వీరుకూడా కొనసాగించారు. అనేకమంది కళాకారులకు, రచయితలకు, కవులకు, వేదపండితులకు గ్రంథ ప్రచురణలకు తగిన ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించడం నిత్యక్తత్వంగా సాగేది. సమాజశ్రేయస్సునలషించి, తపించి, అనవరతము కృషిసల్పిన మానవతా వాది. వారికి భారతదేశం అంటే అచంచలమైన భక్తి. భారతీయ సంస్కృతిపట్ల అమితమైన ప్రేమ. దేశక్షేమాన్ని, ప్రజాసంక్షేమాన్ని, సంస్కృతీ వికాసాన్ని సంకల్పిస్తూ దేశం నలుమూలలా ఆరువందలకు పైగా యాగాలు నిర్వహించారు. శ్రీ శివానంద మూర్తి గారిది బహుముఖీన వ్యక్తిత్వం. సనాతనధర్మ స్వరూపులు.వేదవిజ్ఞానాన్ని, పురాణేతిహాసాల సారాన్ని ఆధునిక సమాజానికి ప్రయోజనకరంగా వివరించి చెప్పగల ధీశాలి. తత్త్వవేత్త. పూర్ణయోగివర్యులు.

                              మన సంస్కృతి వైశిష్ట్యాన్ని ప్రాచ్య, పాశ్చాత్య దేశాలలో వివరించిన సంస్కృతీ ప్రతినిధి. అనితర సాధ్యమైన పఠనాసక్తితోపాటు వారు చక్కని వక్త. సహజ రచయిత. వివిధ విషయాలపై అనేక పత్రికలలో రాసిన వ్యాసాలద్వారా పాఠకలోకానికి సుపరిచితులు. అనేక పత్రికలలో, అనేక సావనీర్లలో రాసిన వ్యాసాలు, వివిధ కాన్ఫరెన్స్ లో ముఖ్యవకగా ఇచ్చిన సందేశాలూ కలిపి 'భారతీయత' పేరుతో నాలుగు సంపుటాలు పుస్తకాలుగా వెలువడ్డాయి. ఈ వ్యాసాలలో పురాణాలు మొదలుకొని నేటి సమాజ ఆర్థిక, సాంఘిక విషయాలపై తమ అభిప్రాయాలనూ, సూచనలనూ తెలియజేశారు. ఈ వ్యాసాలతోపాటు వీరు రాసిన అనేక రచనలు దేశవ్యాప్తంగా ప్రముఖుల ప్రశంసల నందుకున్నాయి. భీష్మబోధ, శ్రీకృష్ణ, శివయోగప్రదీపిక వంటి గ్రంథాలు బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి. 'కఠయోగము' అనే పుస్తకాన్ని శృంగేరీ పీఠాధితులు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు ఎంతో శ్లాఘించి శ్రీముఖాన్నిచ్చారు. వీరి రచనలు కొన్ని దృశ్యకావ్యములుగా (టీవీ ఛానెల్సులో 'కాలచక్రము', 'మనకథ') ప్రసారమయ్యాయి. 'గౌతమబుద్ధ' చలనచిత్రానికి రచన వీరిదే. ఇంకా అనేక రచనలు అముద్రితాలుగా ఉన్నాయి. 'మహామహోపాధ్యాయ', 'దేశికోత్తమ' వంటి అనేక బిరుదులు వీరిని వరించాయి. గీతం యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వీరికి 'డాక్టరేట్' పట్టానిచ్చి సత్కరించాయి. వీరి స్ఫూర్తితో 'సుపథ' అనే సాంస్కృతిక పత్రిక 20 సంవత్సరాలనుండి వెలువడుతూ అనేకమంది పెద్దల మన్ననలను అందుకుంటున్నది.

                              సిద్ధాంతములను గురించి అనేక గ్రంథములున్నా, వాటన్నింటియందు శిఖామణిగాను, ఉత్తమోత్తమముగానూ యున్న గ్రంథము “సిద్ధాన్త శిఖామణి". దీనిని వీరశైవ మతగ్రంథముగా రూపొందించి, పదునాలుగు వందల సంవత్సరముల క్రితము, శివయోగి శివాచార్యులవారు, మనకు వ్రాసి ఇచ్చారు. వారు మహాయోగి, మహా పండితులు. వారు చెప్పిన దానిలో ప్రమాణములన్నీ వేదమునందుఉన్నవి. అంతకుముందే ప్రచారములో నున్న, వేదకాలమునుండి అనాదిగానున్న ఒక సిద్ధాంతమును, వారు గ్రంథస్థము చేసి మనకందించారు. ఈ గ్రంథముపై సద్గురువు శ్రీశివానంద మూర్తిగారి ప్రసంగాలను మూడు పుస్తకాలుగా అందిస్తున్నాం.

                             శ్రీశివానందమూర్తిగారు 9 సంవత్సరాలు శైవమహాపీఠానికి పీఠాధిపత్యం వహించారు. వీరి సాధనామార్గము యోగము. మానవీయ దేశభక్తి వారి జీవనవిధానము. ప్రపంచమంతటా విస్తరించిన వారి వేలాదిమంది భక్తులకు వారే తండ్రి, ఆధ్యాత్మిక గురువు, దైవం, ఆర్తరక్షకులు. వీరు భారతదేశంలో మహాయోగిగా గుర్తింపబడ్డారు.

                             వీరి స్పూర్తితో నాలుగు సంస్థలు సమాజానికి విశిష్టమైన సేవలను అందిస్తున్నాయి. వీరు తూర్పు ప్రాంతవాసుల అభివృద్ధిని కాంక్షిస్తూ తాను నివసించిన భీమునిపట్నం (విశాఖజిల్లా)లో ఆద్యాది శ్రీమహాలక్ష్మి ఆలయాన్ని నిర్మించారు.

                            అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి, ధర్మపాలన చేసిన ఉర్లాం జమీందారీ వంశంలో 1928లో రాజమండ్రిలో జన్మించారు. వారసత్వంగా వచ్చిన దాతృత్వ సాంప్ర దాయాన్ని వీరుకూడా కొనసాగించారు. అనేకమంది కళాకారులకు, రచయితలకు, కవులకు, వేదపండితులకు గ్రంథ ప్రచురణలకు తగిన ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించడం నిత్యక్తత్వంగా సాగేది. సమాజశ్రేయస్సునలషించి, తపించి, అనవరతము కృషిసల్పిన మానవతా వాది. వారికి భారతదేశం అంటే అచంచలమైన భక్తి. భారతీయ సంస్కృతిపట్ల అమితమైన ప్రేమ. దేశక్షేమాన్ని, ప్రజాసంక్షేమాన్ని, సంస్కృతీ వికాసాన్ని సంకల్పిస్తూ దేశం నలుమూలలా ఆరువందలకు పైగా యాగాలు నిర్వహించారు. శ్రీ శివానంద మూర్తి గారిది బహుముఖీన వ్యక్తిత్వం. సనాతనధర్మ స్వరూపులు.వేదవిజ్ఞానాన్ని, పురాణేతిహాసాల సారాన్ని ఆధునిక సమాజానికి ప్రయోజనకరంగా వివరించి చెప్పగల ధీశాలి. తత్త్వవేత్త. పూర్ణయోగివర్యులు.                               మన సంస్కృతి వైశిష్ట్యాన్ని ప్రాచ్య, పాశ్చాత్య దేశాలలో వివరించిన సంస్కృతీ ప్రతినిధి. అనితర సాధ్యమైన పఠనాసక్తితోపాటు వారు చక్కని వక్త. సహజ రచయిత. వివిధ విషయాలపై అనేక పత్రికలలో రాసిన వ్యాసాలద్వారా పాఠకలోకానికి సుపరిచితులు. అనేక పత్రికలలో, అనేక సావనీర్లలో రాసిన వ్యాసాలు, వివిధ కాన్ఫరెన్స్ లో ముఖ్యవకగా ఇచ్చిన సందేశాలూ కలిపి 'భారతీయత' పేరుతో నాలుగు సంపుటాలు పుస్తకాలుగా వెలువడ్డాయి. ఈ వ్యాసాలలో పురాణాలు మొదలుకొని నేటి సమాజ ఆర్థిక, సాంఘిక విషయాలపై తమ అభిప్రాయాలనూ, సూచనలనూ తెలియజేశారు. ఈ వ్యాసాలతోపాటు వీరు రాసిన అనేక రచనలు దేశవ్యాప్తంగా ప్రముఖుల ప్రశంసల నందుకున్నాయి. భీష్మబోధ, శ్రీకృష్ణ, శివయోగప్రదీపిక వంటి గ్రంథాలు బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి. 'కఠయోగము' అనే పుస్తకాన్ని శృంగేరీ పీఠాధితులు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు ఎంతో శ్లాఘించి శ్రీముఖాన్నిచ్చారు. వీరి రచనలు కొన్ని దృశ్యకావ్యములుగా (టీవీ ఛానెల్సులో 'కాలచక్రము', 'మనకథ') ప్రసారమయ్యాయి. 'గౌతమబుద్ధ' చలనచిత్రానికి రచన వీరిదే. ఇంకా అనేక రచనలు అముద్రితాలుగా ఉన్నాయి. 'మహామహోపాధ్యాయ', 'దేశికోత్తమ' వంటి అనేక బిరుదులు వీరిని వరించాయి. గీతం యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వీరికి 'డాక్టరేట్' పట్టానిచ్చి సత్కరించాయి. వీరి స్ఫూర్తితో 'సుపథ' అనే సాంస్కృతిక పత్రిక 20 సంవత్సరాలనుండి వెలువడుతూ అనేకమంది పెద్దల మన్ననలను అందుకుంటున్నది.                               సిద్ధాంతములను గురించి అనేక గ్రంథములున్నా, వాటన్నింటియందు శిఖామణిగాను, ఉత్తమోత్తమముగానూ యున్న గ్రంథము “సిద్ధాన్త శిఖామణి". దీనిని వీరశైవ మతగ్రంథముగా రూపొందించి, పదునాలుగు వందల సంవత్సరముల క్రితము, శివయోగి శివాచార్యులవారు, మనకు వ్రాసి ఇచ్చారు. వారు మహాయోగి, మహా పండితులు. వారు చెప్పిన దానిలో ప్రమాణములన్నీ వేదమునందుఉన్నవి. అంతకుముందే ప్రచారములో నున్న, వేదకాలమునుండి అనాదిగానున్న ఒక సిద్ధాంతమును, వారు గ్రంథస్థము చేసి మనకందించారు. ఈ గ్రంథముపై సద్గురువు శ్రీశివానంద మూర్తిగారి ప్రసంగాలను మూడు పుస్తకాలుగా అందిస్తున్నాం.                              శ్రీశివానందమూర్తిగారు 9 సంవత్సరాలు శైవమహాపీఠానికి పీఠాధిపత్యం వహించారు. వీరి సాధనామార్గము యోగము. మానవీయ దేశభక్తి వారి జీవనవిధానము. ప్రపంచమంతటా విస్తరించిన వారి వేలాదిమంది భక్తులకు వారే తండ్రి, ఆధ్యాత్మిక గురువు, దైవం, ఆర్తరక్షకులు. వీరు భారతదేశంలో మహాయోగిగా గుర్తింపబడ్డారు.                              వీరి స్పూర్తితో నాలుగు సంస్థలు సమాజానికి విశిష్టమైన సేవలను అందిస్తున్నాయి. వీరు తూర్పు ప్రాంతవాసుల అభివృద్ధిని కాంక్షిస్తూ తాను నివసించిన భీమునిపట్నం (విశాఖజిల్లా)లో ఆద్యాది శ్రీమహాలక్ష్మి ఆలయాన్ని నిర్మించారు.

Features

  • : Siddhanta Sikhamani (part- 2)
  • : Dr K Sivanada Murthy
  • : Sivanada Supatha Foundation
  • : MANIMN2972
  • : Paperback
  • : Aug-2020
  • : 256
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Siddhanta Sikhamani (part- 2)

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam